ఎస్ఆర్ నగర్లో నకిలీ పోలీస్ అరెస్టు
హైదరాబాద్: విద్యార్థులు, మహిళలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసును ఎస్సార్ నగర్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. స్పెషల్ పార్టీ పోలీసునంటూ గత కొన్ని రోజులుగా ప్రేమ జంటలను, హోటళ్ల నిర్వాహకులను బెదిరిస్తున్నాడు. బెదిరింపులకు పాల్పడుతున్నట్టు అతడిపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు.
ఈ మేరకు అప్పలనాయుడు అనే యువకుడిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.