norman foster delegates
-
డిజైన్లలో రాజీ పడను..
ఫోస్టర్‌కు సినీ దర్శకుడు రాజమౌళితో సూచనలిప్పించాలని సీఎం ఆదేశం సాక్షి, అమరావతి : రాజధాని డిజైన్లపై సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో వెంటనే సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఆలస్యమైనా పరవాలేదని, డిజైన్లలో రాజీ పడనని చెప్పారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన రాజధాని డిజైన్లను గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో మళ్లీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ డిజైన్లు అంతగా ఆకట్టుకోవడం లేదని, వెంటనే సినీ దర్శకుడు రాజమౌళితో మాట్లాడాలని అధికారులకు చెప్పారు. అవసరమైతే ఆయన బృందం మొత్తాన్ని లండన్ పంపించి డిజైన్ల రూపకల్పనలో ఫోస్టర్ సంస్థకు తగు సలహాలు ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, తాను కూడా రాజమౌళితో మాట్లాడతానని చెప్పారు. అక్టోబరు 25న తాను కూడా లండన్ వెళ్లి నార్మన్ ఫోస్టర్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ వారు రూపొందించిన ఆకృతులను పరిశీలిస్తానన్నారు. వచ్చే నెలలో అమెరికా, యూఏఈ పర్యటనతోపాటు లండన్ వెళతానని చెప్పారు. పరిపాలనా నగరంలోని ముఖ్య భవనాల డిజైన్లు, నిర్మాణ వ్యూహ ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఇంకా సమయం తీసుకోవాలని నార్మన్ ఫోస్టర్ బృందానికి సూచించారు. నార్మన్ ఫోస్టర్ సమర్పించే డిజైన్లను అక్టోబర్ నెలాఖరులోగా ఖరారు చేద్దామని చెప్పారు. ఆయన క్రియేటివ్ డైరెక్టర్ కాబట్టే.. ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 30న అసెంబ్లీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజమౌళి క్రియేటివ్ డైరెక్టర్ కాబట్టి ఆయన సలహా అడుగుతున్నామన్నారు. రాజధానిలో లోకేష్ రహస్య పర్యటన నిడమర్రు (తాడేపల్లి రూరల్): ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ గురువారం రాజధాని అమరావతి ప్రాంతంలో విదేశీ బృందంతో కలసి రహస్యంగా పర్యటించారు. స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఇవ్వకుండానే నిడమర్రు నుంచి తాడికొండ వెళ్లే ప్రాంతంలో ఆయన పర్యటించారు. -
మా వాళ్లు తొందరపడ్డారు: చంద్రబాబు
►రాజధాని డిజైన్లు ఇంకా ఖరారు కాలేదు ►నార్మన్ ఫోస్టర్స్ డిజైన్లలో మార్పు చేయాల్సిన అవసరం ఉంది ►దర్శకుడు రాజమౌళిని డిజైన్ల కోసం రిక్వెస్ట్ చేస్తాం సాక్షి, అమరావతి : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం డిజైన్లు ఇంకా ఖరారు కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం ఆలస్యం అయినా రాజీపడేది లేదని, మంచి డిజైన్ల కోసం అందరి సలహా తీసుకుంటామని అన్నారు. తమ వాళ్లు తొందరపడి తేదీని ప్రకటించారని చంద్రబాబు అన్నారు. నార్మన్ ఫోస్టర్ డిజైన్లలో మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళిని డిజైన్ల కోరామని, గతంలో కూడా ఒకసారి ఆయనను అడిగామని చంద్రబాబు తెలిపారు. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ ఏమీ రాలేదని చెప్పారు. ఇప్పటివరకూ రూ.13వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉన్నా రాలేదని చంద్రబాబు తెలిపారు. రాజధాని కోసం అప్పులు తీసుకొచ్చి...భూములు విక్రయించి, వివిధ సంస్థల ద్వారా నిధులు సమీకరించి రాజధాని నిర్మాణం చేపడతామని సీఎం పేర్కొన్నారు. కాగా 2018 కల్లా మొదటి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా.. ఆచరణలో మాత్రం అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్ర నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి దసరా పండుగ రోజున (ఈ నెల 30) శంకుస్థాపన చేస్తామన్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ, హైకోర్టుతోపాటు సచివాలయ భవనానికి సంబంధించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్ సంస్థ ముఖ్యమంత్రికి చూపించినప్పటికీ వారిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ నెల 30న శంకుస్థాపన లేకపోవడంతో రాజధాని నిర్మాణ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది. డిజైన్ల కోసం మళ్లీ రాజమౌళిని సంప్రదించాలని ఏపీ సర్కార్ నిర్ణయం చర్చనీయాశంగా మారింది. అయితే గతంలో చంద్రబాబు ప్రతిపాదనను రాజమౌళి సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం మళ్లీ రాజమౌళి వద్దకే వెళ్లాలనుకుంటోంది. ట్రాన్స్ట్రాయ్కు నోటీసులు ఇచ్చాం... పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ మార్పుపై చంద్రబాబు నాయుడు స్పందించారు. ట్రాన్స్ట్రాయ్ పనులు సరిగా చేయడం లేదని, 60 (సి) నిబంధన ప్రకారం కంపెనీకి నోటీసులు ఇచ్చామన్నారు. వాళ్లు చేస్తున్న పనులను రద్దు చేసి వేరేవారికి అప్పగిస్తామని చెప్పారు. పనులు వేరేవారికి అప్పగించినా న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని చెప్పుకొచ్చారు. -
లోకేశ్ రహస్య పర్యటనపై అనుమానాలు!
సాక్షి, అమరావతి: నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం రాజధాని భూముల్లో పర్యటించారు. నిడమర్రులో రాజధాని భూములను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు ఆయన దగ్గరుండి మరీ చూపించారు. కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులను లోకేశ్ సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఫొటోలు తీయొద్దని ఆంక్షలు విధించారు. ఇది మంత్రి లోకేశ్ ప్రైవేటు పర్యటన అని సెక్యురిటీ సిబ్బంది తెలిపారు. నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో లోకేశ్ ప్రైవేటు పర్యటన ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని భూముల్లో లోకేశ్ రహస్య పర్యటనల ఆంతర్యం ఏమిటోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన అసెంబ్లీ భవనం డిజైన్‌కు సీఎం చంద్రబాబు బుధవారం ఆమోదం తెలిపారు. హైకోర్టు భవనం డిజైన్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నార్మన్ ఫోస్టర్ బృందం వెలగపూడి సచివాలయంలో సీఎంకు తుది డిజైన్లపై ప్రజెంటేషన్ ఇచ్చింది. ఫోస్టర్ సంస్థ ఇచ్చిన డిజైన్ల ప్రకారం అసెంబ్లీ భవనం వజ్రాకృతిలో నాలుగంతస్తుల్లో ఉంటుంది.