లోకేశ్ రహస్య పర్యటనపై అనుమానాలు!
సాక్షి, అమరావతి: నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం రాజధాని భూముల్లో పర్యటించారు. నిడమర్రులో రాజధాని భూములను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు ఆయన దగ్గరుండి మరీ చూపించారు. కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులను లోకేశ్ సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఫొటోలు తీయొద్దని ఆంక్షలు విధించారు. ఇది మంత్రి లోకేశ్ ప్రైవేటు పర్యటన అని సెక్యురిటీ సిబ్బంది తెలిపారు. నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో లోకేశ్ ప్రైవేటు పర్యటన ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని భూముల్లో లోకేశ్ రహస్య పర్యటనల ఆంతర్యం ఏమిటోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
కాగా, నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన అసెంబ్లీ భవనం డిజైన్‌కు సీఎం చంద్రబాబు బుధవారం ఆమోదం తెలిపారు. హైకోర్టు భవనం డిజైన్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నార్మన్ ఫోస్టర్ బృందం వెలగపూడి సచివాలయంలో సీఎంకు తుది డిజైన్లపై ప్రజెంటేషన్ ఇచ్చింది. ఫోస్టర్ సంస్థ ఇచ్చిన డిజైన్ల ప్రకారం అసెంబ్లీ భవనం వజ్రాకృతిలో నాలుగంతస్తుల్లో ఉంటుంది.