వింత మొక్కు.. ఆపై తీర్థంలా మూత్రం!
మండ్య: మగబిడ్డ పుడితే డబ్బు బంగారం సమర్పణ, అన్నదానం ఇలా రకరకాలుగా మొక్కులు తీర్చుకోవడం తెలుసు. కానీ కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని డింక గ్రామంలో ఇది వెరైటీగా మొక్కు తీర్చుకున్నారు. మొక్కు ద్వారా పుట్టిన మగ బిడ్డకు 5-10 ఏళ్ల వయసులో గ్రామంలో ఆంజనేయ స్వామి పండగ సందర్భంగా నగ్నంగా నిచ్చైన పైన కుర్చోబెట్టి గ్రామంలో ఊరేగింపు జరిపారు. ఆ సమయంలో ఇతన్ని బాల హనుమంతుగా స్తుతిస్తారు.
బాలుడికి దిగంబరంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వంద మీటర్ల దూరంలోని రంగమంటపం వరకు నిచ్చెనపైన కుర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ జనం నృత్యాలు చేస్తూ బాలుని కోసం ఎదురుచూస్తున్నారు.
బాలుడు రాగానే అతని మూత్రాన్ని సేకరించి తీర్థం మాదిరిగా తమపై చల్లుకున్నారు. దీనివల్ల తమకూ మగబిడ్డ పుడతాడనేది వారి విశ్వాసం. ఈ సందర్భంగా గ్రామంలో వర్షాలు ఎలా పడతాయి, పంటలెలా పండుతాయన్న దానిపై బాల హనుమంతుడు భవిష్యవాణి వినిపించాడు. సుమారు 200 ఏళ్ల నుంచీ ఈ సంప్రదాయం ఉంది. దీనికే నిచ్చెన హనుంతు మొక్కు అనే పేరు కూడా ఉంది.