బీసీ నాయకుల వితరణ
ఓదూరు (రామచంద్రపురం రూరల్):
గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో ఇటీవల మరణించిన ఒకరికి, అదే సంఘటనలో ఇద్దరిని కాపాడిన ఓ బాలుడికి బీసీ నాయకులు వితరణ చేశారు. అనపర్తిలో ములగపాక శివరాం సంతోష్ ఇటీవల గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో మరణించగా అతని తల్లికి శుక్రవారం ఓదూరులోని బీసీ నాయకులు బుల్లెట్ రాము మీడియా గ్రూపు తోడ్పాటుతో గల్ఫ్ బీసీ యూత్ అందించిన రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదే సంఘటనలో తన ప్రాణాలకు తెగించి ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడిన బాలుడు దుర్గా రమేష్‌ను అభినందించి అతనికి రూ. 7 వేల నగదు బహుమతి, జ్ఞాపికను అందజేశారు. సీనియర్ బీసీ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి సూర్యచంద్రరావు, బీసీ యువజన సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు రెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు.