office of profit
-
మళ్లీ తెరపైకి ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం
సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు తీర్పుతో ఊరట పొందిన ఆప్ ఎమ్మెల్యేలను ఎన్నికల సంఘం మాత్రం వదలట్లేదు. శుక్రవారం 20 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఎన్నికల సంఘం ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. మే 17న వీరందరినీ తమ ఎదుట హాజరై వాదనలు వినిపించాలని కోరింది. కోర్టు ఆదేశాల మేరకే తాము ఈ చర్యలకు దిగినట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్, కమిషనర్లు సునీల్ అరోరా, అశోఖ్ లవసలు ఎమ్మెల్యేల వాదనలను వింటారని ఈసీ పేర్కొంది. ఇదిలా ఉంటే అనర్హత వేటు కేసులో వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ఊరట ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం వేసిన అనర్హత వేటును హైకోర్టు పక్కన పెడుతూ.. ఎన్నికల సంఘం తమ నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించాలని, ఆ ఎమ్మెల్యేల వాదనలు వినాలని 79 పేజీలతో కూడిన తీర్పు కాపీలో ఆదేశించింది. దీంతో వాదనలు వినేందుకు ఎన్నికల సంఘం ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. 2015 లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ సర్కార్… పార్లమెంటరీ కార్యదర్శులుగా 20 మంది ఎమ్మెల్యేలను నియమించింది. ఇవి లాభదాయక పదవుల కిందకు వస్తాయని… ఈ కారణంగా వారిపై అనర్హత వేటు వేస్తున్నట్లు ఈసీ వాదిస్తూ వస్తోంది. ఆప్ ఎమ్మెల్యేల వేటుపై సవాలక్ష ప్రశ్నలు -
లాభాపేక్ష పదవుల జాబితాతో బిల్లు
న్యాయ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన న్యూఢిల్లీ: లాభాపేక్ష పదవుల్లో కొనసాగడం వల్ల ఎంపీలు అనర్హత ముప్పును ఎదుర్కోవడం తెలిసిందే. అయితే ఏ ఏ పదవుల్లో ఉంటే అనర్హతకు గురవుతారోనన్న వివరాలతో బిల్లు రూపొందించాలని న్యాయ శాఖను పార్లమెంట్ ఉమ్మడి కమిటీ కోరింది. ఏ పదవుల్లో కొనసాగితే సభ్యతం కోల్పోతారన్నది రాజ్యాంగంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు, పార్లమెంటు చట్టం(అనర్హత నిరోధం), హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా పేర్కొనలేదని తన తాజా నివేదికల్లో పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ఏఏ విభాగాలు, ఆఫీసులు అనర్హత కిందకు వస్తాయో, ఏవి రావో పేర్కొంటూ నమూనా బిల్లును రూపొందించాలని కమిటీ సూచించింది. పార్లమెంట్ షెడ్యూల్లో అనర్హత వర్తించే విభాగాల జాబితా ఉన్నా... చాలా విభాగాలు అందులో లేవని కమిటీ అభిప్రాయపడింది. -
ఎమ్మెల్యే తండ్రి టైర్లకు పంక్చర్లు వేస్తున్నారు!
భోపాల్: ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ)కి చెందిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన, జంగ్ పురా నియోజకవర్గం నుంచి గెలుపొందిన ప్రవీణ్ దేశ్ ముఖ్ తండ్రి పీఎన్ దేశ్ ముఖ్(55) మధ్యప్రదేశ్ లోని భోపాల్ దగ్గరలోని జిన్సీలో టైర్ పంక్చర్ షాపు నడుపుకుంటు జీవనం సాగిస్తున్నారు. పార్లమెంటరీ సెక్రటరీ వ్యవహారాల నుంచి విద్యాశాఖను చూసే ప్రవీణ్ పై కూడా ‘ఆఫీస్ ఆఫ్ ఫ్రాఫిట్’ కింద ఆఫీస్ స్పేస్ కింద అసెంబ్లీ స్పీకర్ ద్వారా రూమ్ లు కేటాయించుకున్నారని బీజేపీ, కాంగ్రెస్ లు ఆరోపించాయి. దీన్ని ఖండించిన ఏఏపీ ఎమ్మెల్యేలు వాటిని కొట్టిపారేశారు. తాము విధుల్లోకి వచ్చిన నాటి నుంచి ఎటువంటి జీతభత్యాలను స్వీకరించకుండా పనిచేస్తున్నామని ప్రవీణ్ తెలిపారు. ఈ విషయం స్పందించిన ప్రవీణ్ తండ్రి తనకు గానీ తన కుటుంబంలో ఏ ఒక్కరికీ గానీ అధికారం చేతిలో ఉందన్న గర్వం లేదని అన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి అద్దెకు ఓ ఫ్లాట్ లో నివసిస్తున్నట్లు తెలిపారు. మేం జీవించే జీవనంలో కూడా ఎటువంటి మార్పులు లేవని చెప్పారు. మొదట ప్రవీణ్ ఎమ్మెల్యే అయినప్పుడు తాను ఆనందించినట్లు ఏడాది తర్వాత అతని సింపుల్ జీవితాన్ని, ఢిల్లీలో విద్యను అందించడానికి చేసిన కృషిని చూసి గొప్పగా ఫీలయినట్లు వివరించారు. డబ్బుకోసమే ఇదంతా చేసి ఉంటే పెద్ద కంపెనీలో రీజనల్ మేనజర్ ఉద్యోగాన్ని ప్రవీణ్ వదులుకునేవాడు కాదని అన్నారు. ఒక ఎమ్మెల్యే డిస్ క్వాలిపై అయినా, ప్రవీణ్ సామాజిక సేవ చేస్తాడని ఆయన తేల్చి చెప్పారు.