ట్రంప్ నిర్ణయంతో లక్ష వీసాల రద్దు
వాషింగ్టన్ : ఏడు ముస్లిం మెజారిటీ దేశాల ప్రజలకు అమెరికా ప్రయాణంపై నిషేధం విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నాక దాదాపు లక్ష వీసాలను రద్దుచేసినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. డల్లాస్ ఎయిర్పోర్టుకు యెమెన్ నుంచి వచ్చిన ఇద్దరు సోదరులు వేసిన కేసుపై విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ సంఖ్యను బహిర్గతం చేసింది.
అయితే వీసాలున్నా ఎందరిని వెనక్కు పంపారనే అంశంపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అమెరికా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరాక్, ఇరాన్ , యెమెన్ , సూడాన్ , సోమాలియా, లిబియా, సిరియా దేశాలనుంచి వచ్చే శరణార్థులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.