ఉస్మానియా హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్
హైదరాబాద్: ఉస్మానియా నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. కళాశాల హాస్టల్లో కలుషితాహారం తిన్న పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన అనంతరం అనారోగ్యానికి గురి కావటంతో వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.