అమీర్‌పేట జీవితాలతో...
హైదరాబాద్‌లో అమీర్‌పేట అంటే తెలియనివారు ఉండరు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలు ఈ ప్రాంతంతో ముడిపడి ఉంటాయి. ఆ నేపథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అమీర్‌పేటలో’. శ్రీ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. అశ్విని కథానాయిక. పద్మశ్రీ క్రియేషన్స్ పతాకంపై యామిని బ్రదర్స్ సమర్పణలో మహేశ్ మందలపు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీ మాట్లాడుతూ-‘‘అమీర్‌పేట అంటే మనకు ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి.
అక్కడి జీవితాలను చూపిస్తూనే, మంచి కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. వినోదంతో పాటు భావోద్వేగ అంశాలు ఉన్నాయి. కుటుంబం మొత్తం కలిసి చూసేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం శ్రీ ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. ఈ చిత్రం నిర్మాణంలో వంశీ, శ్రీకాంత్, ప్రవీణ్‌ల సహకారం మరచిపోలేను’’ అని నిర్మాత చెప్పారు. అశ్విని, సహ నిర్మాత యామిని వంశీకృష్ణ, సంగీత దర్శకుడు మురళి తదితరులు పాల్గొన్నారు.