ముష్కరులపై చర్యలను ఆశిస్తున్నాం
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. ఈ విషయంపై ఉగ్రవాదులపై పాక్ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని అమెరికా అత్యున్నత అధికారి ఒకరు తెలిపారు. దాడికి కుట్రపన్నిన ఉగ్రవాదులపై చర్యలకు ఉపక్రమిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. దక్షిణాసియాలో ఉగ్రవాదం అందరికీ సవాల్ విసురుతోందని అమెరికా వ్యాఖ్యానించింది. ఉగ్రవాద నిర్మూలనకు అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చింది.
మరోవైపు పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడిని పాకిస్థాన్ విదేశాంగశాఖ ఖండించింది. పఠాన్‌కోట్ మృతులకు సంతాపం తెలిపిన విదేశాంగ అధికారి కిర్పి.. ఉగ్రవాదాన్ని ఉమ్మడి సమస్యగా ప్రపంచ దేశాలు గుర్తించాలని కోరారు. భారత్ అందించిన సమాచారం ఆధారంగా పనిచేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.