బ్యూటిప్స్
► ఓట్స్‌ని ఉడికించి, మెత్తగా రుబ్బుకోవాలి. అందులో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని, అరగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చెమట వల్ల పట్టిన మురికి తొలగిపోయి, ముఖం కాంతిమంతమవుతుంది.
► పుదీనా ఆకులను రుబ్బి నీళ్లు కలిపి మాడుకు పట్టించి కొంతసేపటి తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు.
► గుడ్డు తెల్లసొనను తలకు పట్టించి... గంట తరువాత స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
►సాయంత్రం ఇంటికి రాగానే నేరుగా సబ్బుతో ముఖాన్ని శుభ్రపరచకుండా ముందుగా క్లెన్సింగ్ మిల్క్‌ను తగినంత దూది ఉండకు అద్దుకొని, ముఖాన్ని, మెడను తుడుచుకోవాలి. తర్వాత ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై చేరిన మలినాలు, దుమ్ము త్వరగా తొలగిపోతాయి.
►జిడ్డుచర్మం అయితే... స్వచ్ఛమైన పసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, మోచేతులకు పట్టించాలి. నిమ్మరసం సహజమైన బ్లీచ్‌గా పని చేస్తుంది. ఈ ప్యాక్ వేసినప్పుడు కొంచెం మంటగా ఉంటుంది.
►ఒక కప్పు బీట్రూట్ రసంలో అరకప్పు పెరుగు, పావుకప్పు బాదం నూనె, చెంచా ఉసిరిక పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి, అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. నెలకు రెండుసార్లయినా ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.