ధ్యానంపై అవగాహన అవసరం
గుడివాడ టౌన్ : విద్యార్థి దశ నుంచే ధ్యానంపై పట్టు ఉండాలని రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఫౌండ్ ఆఫ్ ట్రస్టీ రాజకుమారి అన్నారు. స్థానిక రూరల్ మండలం తట్టివర్రు రోడ్డులోని పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని, గుడ్లవల్లేరు ఏఏఎన్ఎం అండ్ జీవీఆర్ఎస్ఆర్ హైస్కూల్ విద్యార్థులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ ధ్యానం జ్ఞానాన్ని పెంచుతుందని, అది విద్యార్థి దశ నుంచే అలవరుచుకుంటే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. విద్యార్థులు ధ్యానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు మనోహర్, జ్ఞానకేంద్ర ఉపాధ్యాయులు అనిత, అనిల్, మాధవి, వంశీ పాల్గొన్నారు.