ప్రిక్వార్టర్స్‌లో సాయి ప్రణీత్
ఎల్ మాంటే (యూఎస్): యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సాయి ప్రణీత్ ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 21-15, 21-17తో సంకీర్త్ (కెనడా)పై విజయం సాధించాడు. పురుషుల ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ హెచ్.ఎస్ ప్రణయ్ 21-9, 21-8తో జోషువా మ్యాగీ (ఐర్లాండ్)పై; ప్రతుల్ జోషి 21-18, 21-13తో మిలన్ లుధిక్ (చెక్ రిపబ్లిక్)పై, ఆనంద్ పవార్ 21-12, 21-9తో డేవిడ్ ఒబెర్నోస్టేర్పై; అజయ్ జయరామ్ 21-14, 21-9తో రాల్ మస్త్ (ఈస్టోనియా)పై గెలుపొందారు. మహిళల విభాగంలో తన్వి 21-6, 21-9తో నిక్తే అలేజండ్రా సోటోమయేర్ (గ్వాటేమలా) పై నెగ్గగా... రుత్విక శివాని 19-21, 21-15, 18-21తో ఆయుమి మినే (జపాన్) చేతిలో ఓడింది.