Prevention of accidents
-
మూత తెరిచినా మునగం
వానాకాలం మొదలైంది.. కాస్త గట్టి వర్షం పడటంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.. ఆ నీరు వేగంగా పోయేందుకు కొన్నిచోట్ల మ్యాన్‌హోల్స్ తెరిచారు.. ఆ నీళ్లలోంచే, ఆ మ్యాన్‌హోల్స్ దగ్గరి నుంచే జనం అటూఇటూ నడిచి వెళ్లారు.. కానీ ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు.ఎందుకంటే..అక్కడ మ్యాన్‌హోల్ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ పట్టుజారినా అందులో పడిపోకుండా గ్రిల్స్ అడ్డంగా ఉన్నాయి. కాసేపటికి నీరంతా వెళ్లిపోయింది. మ్యాన్‌హోల్‌పై పెట్టేసిన మూత ఎల్ఈడీలతో వెలుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యలన్నీ పూర్తయితే.. నిపుణుల సూచనలన్నీ అమల్లోకి వస్తే.. జరిగేది ఇదే.కానీ మ్యాన్‌హోల్స్ వద్ద రక్షణ చర్యలు ఇంకా పూర్తవలేదు.. వానల తీవ్రత పెరుగుతున్నా పనుల వేగం పెరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డీప్ మ్యాన్‌హోల్స్‌కు గ్రిల్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని.. జపాన్‌లో అనుసరిస్తున్న తరహాలో మ్యాన్‌హోల్స్ మూతలపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అమలైతే.. ‘మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి’వంటి ఘటనలు ఇకపై వినకుండా ఉంటామని అంటున్నారు.సాక్షి, హైదరాబాద్: వానాకాలం ప్రారంభమైంది. కాస్త గట్టిగా చినుకులు పడినప్పుడల్లా.. డ్రైనేజీ, నాలాలు ఉప్పొంగడం.. రోడ్లపై, కాలనీల్లో నీళ్లు చేరడం మొదలైంది. జీహెచ్ఎంసీ, జల మండలి ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోడ్ల మీది చెత్త డ్రైనేజీల్లో చేరి పూడుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారుతోంది. అలాంటి సమయాల్లో మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచి, నీరు పోయేలా చేస్తుండటం ప్రమాదకరంగా మారుతోంది. కొన్నిసార్లు అయితే.. ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉన్నాయి? ఎక్కడ రోడ్డు ఉందనేది తెలియని పరిస్థితి ఉంటోంది. ఏదో పనిమీద బయటికి వెళ్లినవారు, ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటిబాట పట్టాల్సిన దుస్థితి. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌లో పడి జనం మృత్యువాతపడిన ఘటనలూ ఎన్నో.150కి పైగానే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్మహానగరం పరిధిలో వాన నీరు నిలిచిపోయే సుమారు 150కుపైగా పాయింట్లుæ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 50 వరకు ప్రమాదకర ప్రాంతాలు ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్, చాదర్ ఘాట్, సింగరేణి కాలనీ, బాలాపూర్, మల్లేపల్లి, మైత్రీవనం, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఛే నంబర్, మెట్టుగూడ, వీఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రాంతాలు ఎక్కువ. ఇలాంటి చోట్ల నిలిచిన నీళ్లు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్‌హోల్స్ మూతలు తీస్తుండటం.. ప్రమాదాలకు దారి తీస్తోంది. మరికొన్ని చోట్ల వాహనాల రాకపోకలతో మ్యాన్‌హోల్స్ ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి, మూతలు పగిలిపోయాయి. అలాంటి చోట వాననీరు నిలిచి.. పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. వాహనాలు కూడా వాటిలో పడి దెబ్బతింటున్నాయి.జపాన్‌లో మ్యాన్‌హోల్స్‌కు ఎల్ఈడీ లైట్లు జపాన్‌లోని టోక్యో సిటీలో మ్యాన్‌హోల్స్ మూతలపై ప్రత్యేకంగా కార్టూన్ డిజైన్లతో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ సాయంతో రీచార్జి అయ్యే ఈ లైట్లు.. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వెలుగుతూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ ఉన్నాయని సులువుగా గుర్తించి, జాగ్రత్త పడేందుకు వీటితో చాన్స్ ఉంటుంది. అంతేగాకుండా రకరకాల డిజైన్లు, రంగులతో కార్టూన్ క్యారెక్టర్లు కనిపిస్తూ అందంగా కూడా ఉంటున్నాయి. ఇలా మన దగ్గర కూడా మ్యాన్‌హోల్స్‌పై ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. రాత్రిపూట మ్యాన్‌హోల్స్ సులువుగా కనబడితే.. ప్రమాదాలు తప్పుతాయని అంటున్నారు.జలమండలి రక్షణ చర్యలువరదల ముంపుతో ఢిల్లీ, ముంబై లాంటి పరిస్థితి హైదరాబాద్‌లో ఏర్పడకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. సీవరేజీ ఓవర్ ఫ్లో, మ్యాన్‌హోల్స్ నిర్వహణపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. నగరవ్యాప్తంగా వాటర్ ల్యాగింగ్ పాయింట్లు, లోతైన మ్యాన్‌హోల్స్‌ను గుర్తించింది. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ బిగించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపేలా.. మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తోంది.కొన్ని వాటర్ ల్యాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. నగరవ్యాప్తంగా 63వేలకుపైగా డీప్ మ్యాన్ హోల్స్ ఉండగా.. ఇప్పటివరకు 25 వేల వరకు మ్యాన్‌హోల్స్‌పై సేఫ్టీ గ్రిల్స్ బిగించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్ చేసి, ఎరుపు రంగు పెయింట్ వేస్తున్నామని.. ఎప్పటికప్పుడు మ్యాన్‌హోల్స్ నుంచి పూడిక, వ్యర్థాలను తోడేసేందుకు ఎయిర్‌టెక్ యంత్రాలను అందుబాటులో ఉంచినట్టు వివరిస్తున్నారు. ఇప్పటికే వానాకాలం మొదలైన నేపథ్యంలో.. ఈ రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీలువర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆరీ్ట), సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్ (ఎస్పీటీ)లను జలమండలి రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలతోపాటు వాహనాలను కేటాయించింది. వాననీరు నిలిచిన చోట వాహనాల్లో ఉండే జనరేటర్లు, మోటార్లతో నీటిని తోడేస్తారు. ఎయిర్‌టెక్ యంత్రాలతో మ్యాన్‌హోల్స్ నుంచి తీసిన వ్యర్థాల (సిల్ట్)ను ఎప్పటికప్పుడు తొలగిస్తారు. మరోవైపు మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్Œ నుంచి సీవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. వారు రోజూ ఉదయాన్నే తమ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తారు. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు.మ్యాన్‌హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసులువాన పడుతున్న సమయంలో, నీళ్లు నిలిచినప్పుడు.. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి స్పష్టం చేసింది. ఇష్టమొచి్చనట్టు తెరిచిపెడితే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి నంబర్ 155313కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చని సూచించింది. నాలాలపై నిర్లక్ష్యంతో.. మహానగర పరిధిలోని పలుచోట్ల నాలాలు ప్రమాదకరంగా మారాయి. నిబంధనల ప్రకారం.. రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పున్న నాలాలను క్యాపింగ్ (శ్లాబ్ లేదా ఇతర పద్ధతుల్లో పూర్తిగా కప్పి ఉంచడం) చేయాలి. రెండు మీటర్ల కన్నా వెడల్పున్న నాలాలకు రిటైనింగ్ వాల్ కట్టాలి. లేదా ఫెన్సింగ్ వేయాలి. కానీ గ్రేటర్ సిటీ పరిధిలో సగానికిపైగా చిన్న నాలాలకు క్యాపింగ్ లేదు. పెద్ద ఓపెన్ నాలాలకు రిటైనింగ్ వాల్/ ఫెన్సింగ్ లేకుండా పోయాయి. గతంలో వేసిన క్యాపింగ్, ఫెన్సింగ్ భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. దీనితో వాన పడినప్పుడు నాలాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత ఐదేళ్లలో సుమారు 15 మందికిపైగా నాలాల్లో పడి చనిపోవడం గమనార్హం. వానాకాలం మొదలైన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన క్యాపింగ్, ఫెన్సింగ్ వేయడం.. బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.మ్యాన్‌హోల్స్‌కు రక్షణ కవచాలు వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్‌తో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాం. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డీప్ మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి అత్యంత ప్రమాదకరమైనవని తెలిసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను గుర్తించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాం. వర్షం పడే సమయంలో కింది స్థాయి సిబ్బంది నుంచి మేనేజర్ వరకు వారి పరిధిలోని ఫీల్డ్‌లో ఉండేలా ఆదేశాలు జారీ చేశాం.డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి. వాటిలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి. వాన నీరు సైతం సాఫీగా వెళ్లే విధంగా మార్గం ఉండాలి. వాటిలో పూడిక పేరుకుపోవడంతో వర్షం పడినప్పుడు నీరు వెళ్లక రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మురుగు నీటి వ్యవస్ధను పర్యవేక్షించే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. నిరంతరం పూడికతీత పనులు కొనసాగించాలి. వర్షాకాలంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలి.సిటీలో సీవరేజీ నెట్వర్క్, మ్యాన్ హోల్‌ల లెక్క ఇదీ..జీహెచ్ఎంసీ పరిధిలో సీవరేజీ నెట్వర్క్: 5,767 కి.మీశివారు మున్సిపాలిటీల పరిధిలో : 4,200 కి.మీ మొత్తం మ్యాన్‌హోల్స్: 6,34,919 డీప్ మ్యాన్‌హోల్స్: 63,221 వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో..: 26,798 శివారు మున్సిపాలిటీల పరిధిలో..: 36,423 -
ప్రమాదాలకు చెక్.. వాటేన్ ఐడియా.. డ్రైవర్ రాజా..!
కొత్తపేట/రావులపాలెం(కోనసీమ జిల్లా): ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నట్టుగా.. ఆ ఆర్టీసీ డ్రైవర్ మదిలో పుట్టిన ఓ ఐడియా.. ఎన్నో ప్రమాదాలను నివారిస్తోంది. బస్సుకు ఆయన అమర్చిన స్టీల్ బాల్ ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. ఈ ఐడియా కోనసీమ జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన వీవీవీ సత్యనారాయణరాజుది. రావులపాలెం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న రాజు ఆ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. చదవండి: ప్రేమ పేరుతో ఎస్ఐ వంచన రోడ్డుపై వాహనంలో వెళ్తున్నప్పుడు వెనుక నుంచి వచ్చే ఇతర వాహనాలను గుర్తించేందుకు వాటికి కుడి, ఎడమ వైపు రియర్ వ్యూ అద్దాలు ఉంటాయి. వాటి ద్వారా వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తూ డ్రైవర్లు తమ వాహనాలను జాగ్రత్తగా నడుపుతూంటారు. సాధారణంగా బస్సు డ్రైవర్‌కు ముందు భాగంలో 5 అడుగుల ఎత్తు వరకూ కనిపించదు. బస్టాండ్లు, బస్టాపుల్లో ఆగి ఉన్న బస్సు ముందు నుంచి ప్రయాణికులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండటం సర్వసాధారణంగా కనిపిస్తుంది. అలా ఎవరైనా వెళ్తున్నప్పుడు వారు కనిపించక, ఎవరూ లేరని భావించి, డ్రైవర్లు బస్సును ముందుకు పోనిస్తూంటారు. దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదేవిధంగా గతంలో రావులపాలెం బస్టాండ్‌లోనే రెండు ప్రమాదాలు జరిగి, ఆయా డ్రైవర్లు 6 నెలల పాటు సస్పెండయ్యారు. బాధితులకు ఆర్టీసీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇటువంటి ప్రమాదాలను, ఆర్టీసీ పరిహారాలు చెల్లించే పరిస్థితిని అరికట్టాలని సత్యనారాయణరాజు తీవ్రంగా ఆలోచించారు. ఆ క్రమంలోనే ఆయనకు స్టీల్ బాల్ పెట్టాలనే ఐడియా వచ్చింది. 180 డిగ్రీల కుంభాకారపు స్టీల్ బాల్‌ను 2 అడుగుల రాడ్‌కు అమర్చి, దానిని డ్రైవర్ సీటుకు కుడివైపున అద్దం ముందు బిగించారు. ఆ స్టీల్ బాల్లో బస్సు ముందు భాగం ఎడమ నుంచి కుడివైపు డ్రైవర్ డోర్ వరకూ కనిపిస్తోంది. దీంతో బస్సు ముందు ఎవరూ లేరని గుర్తించడం సులభమైంది. తద్వారా ఇటువంటి ప్రమాదాలకు చెక్ పడింది. ఈ స్టీల్ బాల్‌ను అన్ని బస్సులకూ అమర్చాలని ఆర్టీసీ యాజమాన్యం యోచిస్తోంది. ఈ స్టీల్ బాల్ తయారీకి కేవలం రూ.100 ఖర్చయినట్టు సత్యనారాయణరాజు తెలిపారు. ఆయన వినూత్న ఆలోచనను ఆర్టీసీ అధికారులు, సహచర డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఎంతగానో మెచ్చుకుని, అభినందించారు. -
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశించారు. దీని కోసం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని, ఈ స్పెషల్ డ్రైవ్ లో ఆయా పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. తాను కూడా కంపెనీల్లో తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఫ్యాక్టరీ, బాయిలర్ల శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. -
‘ఆటు’బోట్లకు చెక్
గోదావరి విహారం ఎంత ఆనందం కలిగిస్తుందో.. పరిస్థితి విషమిస్తే అంతలోనే విషాదం మిగులుస్తుంది. దీనికి నిస్సందేహంగా ఒక నిర్దిష్ట పర్యాటక విధివిధానాలు లేకపోవడమే కారణం. అందుకే పుట్టగొడుగుల్లా టూరిజం ఏజెన్సీలు పుట్టుకొస్తున్నాయి. శిక్షణ లేని సురంగుల సారథ్యంలో లైసెన్సులు లేని బోట్లు తిప్పుతూ.. పర్యాటకుల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా జల పర్యాటక ప్రాంతాల్లో బోట్ల నిర్వహణను నియంత్రించాలని తలంచింది. దీనికోసం ప్రత్యేక విధివిధానాలు రూపొందించింది. జంగారెడ్డిగూడెం: నదీ పర్యాటకానికి సురక్షిత ప్రయాణమే ఆయువు పట్టు. ఇటీవల చోటు చేసుకున్న బోటు ప్రమాదం పర్యాటకాన్ని కుదిపేసింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో పర్యాటకులు సైతం నదీ పర్యాటకానికి భయపడుతున్నారు. దీంతో బోటు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఎక్కడికక్కడ కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. గోదావరి నదీ తీరాన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఐదు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనుంది. ఒక్కొక్కదానికి రూ.1.62 కోట్లు ఖర్చుచేయనుంది. ప్రతి పడవకూ మళ్లీ లైసెన్స్.. ఇకపై ప్రతి బోటుకూ కచ్చితంగా లైసెన్సులు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకు బోట్లు, పడవల పర్యవేక్షణ ధవళేశ్వరం బోటు సూపరింటెండెంట్ పరిధిలో ఉంది. తాజాగా నిబంధనలు మార్చి బోట్ల పర్యవేక్షణ బాధ్యతను కాకినాడ పోర్టు అధికారికి ప్రభుత్వం అప్పగించింది. పట్టిసీమ, నరసాపురం తదితర ప్రాంతాల్లోనూ బోట్లు, పడవలు నడుస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం బోటు, పడవల లైసెన్సులతో పాటు నడిపే చోదకులకు కూడా లైసెన్సులు ఉండాలి. ప్రయాణికుల భద్రతకు అవసరమైన లైఫ్ జాకెట్లు ఉండాలి. బోటు సామర్థ్యాన్ని బట్టి ఇంజిన్ సామర్థ్యం ఉండాలి. వచ్చే నెల 10 నుంచి బోట్ల లైసెన్సుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈలోగా సరంగులు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో 40కిపైగా ప్రయాణ పడవలు, పాపికొండలకు వెళ్లే లాంచీలు 63 ఉన్నాయి. వీటన్నింటికీ తిరిగి లెసెన్సులు పొందాలి. బోటు ఫిట్నెస్తోపాటు నదులు, జలవనరుల రూట్ సర్వే, సరంగుల డ్రైవింగ్ శిక్షణ తప్పనిసరి. సరంగులకు ప్రత్యేకంగా 18 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ పూర్తయిన తరువాతే లైసెన్సులు జారీ చేస్తారు. వచ్చేనెల 10న కాకినాడలో సరంగుల పరీక్షలు నిర్వహించనున్నారు. బోటును ఆపరేట్ చేయడానికి రూటు పర్మిట్ ఇరిగేషన్ శాఖ నుంచి కచ్చితంగా తీసుకోవాలి. తొలిదశలో 9 చోట్ల కంట్రోల్ రూమ్‌లు బోటు ప్రమాదాల నివారణ కోసం తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంక వద్ద బోటు కంట్రోల్ రూమ్‌కు ఈ నెల 21న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. వీటికి రూ.70 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఇదిలా ఉంటే గోదావరి తీరంలో ఏర్పాటు చేయనున్న ఒక్కొక్క కంట్రోల్‌రూమ్‌ను రూ.1.62 కోట్లతో నిర్మించనున్నారు. ప్రతి కంట్రోల్‌రూమ్‌లో 13 మంది సిబ్బంది ఉంటారు. దీనిలో టూరిజం, పోలీసు, జలవనరులు, రెవెన్యూ శాఖకు చెందిన సిబ్బంది పనిచేస్తారు. తొలిదశలో తొమ్మిదింట్లో పశ్చిమగోదావరి జిల్లాలో సింగన్నపల్లి, పేరంటాళ్ల పల్లి వద్ద కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పోచవరం, గండిపోచమ్మ గుడి వద్ద, రాజమండ్రి పద్మావతి ఘాట్ వద్ద గోదావరి నది తీరాన కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. గోదావరి తీరం వెంబడి మొత్తం ఐదు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. మిగతావి కృష్ణానది విజయవాడ పున్నమిఘాట్లో, విశాఖ రిషీకొండ బీచ్‌లో శ్రీశైలం పాతాళగంగ, నాగార్జున సాగర్ వద్ద ఈ కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తారు. కార్యాచరణ ఇదే.. బోటు ప్రమాదాల నివారణకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణ ప్రకటించారు. కంట్రోల్ రూమ్‌లకు తహసీల్దార్ ఇన్చార్జ్గా ఉంటారు. 13 మంది సిబ్బందితో కంట్రోల్ రూమ్ నిర్వహణ ఉంటుంది. వీరిలోముగ్గురు పోలీసులు కచ్చితంగా ఉండాలి. పడవ ప్రయాణ మార్గాలు, వాటి కదలికలు, వరద ప్రవాహంపై సమగ్ర సమాచారం ఈ కంట్రోల్ రూమ్‌లకు ఉండాలి. పడవ ప్రయాణాలను పర్యవేక్షించాల్సిన పూర్తి బాధ్యత కంట్రోల రూమ్ సిబ్బందిదే. మద్యం సేవించి పడవ నడపకుండా శ్వాస పరీక్షలు నిర్వహించాలి. పడవలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలి. కంట్రోల్ రూమ్ పరిధిలోని బోట్లు, జెట్టీలు ఉండాలి. పడవ ప్రయాణానికి టికెట్ల జారీ అధికారం కూడా వీటికే అప్పగించాలి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడగలిగితే కంట్రోల్ రూమ్ సిబ్బందికి 2 నెలల జీతం ఇన్సెంటివ్‌గా ఇవ్వాలి. రెండేళ్ల వ్యవధిలో జరిగిన పడవ దుర్ఘటనలు ఇవీ.. ►కృష్ణా నదిలో 2017లో జరిగిన బోటు ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ►2018 మే 11న గోదావరిలో బోటు ప్రమాదం జరిగింది. ప్రాణనష్టం జరగలేదు. ►2018 మే 15న గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో 19మంది మృత్యువాతపడ్డారు. ►2018 సెప్టెంబర్ 15న గోదావరిలో వశిష్ట రాయల్ బోటు ప్రమాదంలో 51 మంది మృతిచెందారు. -
ఏడాదిన్నరలో రూ.169.86 కోట్లు
⇒ వాహనదారుల నుంచి వసూలు చేసిన జరిమానా సొమ్ము ఇది ⇒ 2015లో రూ.100.90 కోట్లు.. 2016 మే 31 నాటికి రూ.68.95 కోట్లు ⇒ ఈ ఏడాది మొత్తంగా రూ.150 కోట్లకు చేరే అవకాశం ⇒ రోడ్డు ప్రమాదాల నివారణకు డీటీఆర్‌ఎస్ పేరుతో ప్రత్యేక విభాగం ⇒ 50 హైవే ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల ఏర్పాటు ⇒ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ⇒ ఇదే తరహాలో వివరాలివ్వాలని ఏపీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మోటారు వాహనాల చట్టం నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గత ఏడాదిన్నరలో రాష్ట్ర పోలీసులు వాహనదారుల నుంచి ఏకంగా రూ. 169.86 కోట్లు జరిమానాగా వసూలు చేశారు. ఇందులో 2015 సంవత్సరం మొత్తంలో రూ.100.9 కోట్లుకాగా.. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి రూ. 68.9 కోట్లు వసూలు చేశారు. ఈ లెక్కన ఈ ఏడాది జరిమానాల సొమ్ము రూ.150 కోట్లకు చేరే అవకాశముంది. సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఏడాది మార్చి 14న జరిగిన ఓ బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇంతకుముందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రైల్వేలు, రోడ్డు భద్రత అదనపు డెరైక్టర్ జనరల్ టి.కృష్ణప్రసాద్ రెండు రోజుల కింద ఓ అఫిడవిట్‌ను సమర్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్డు భద్రతకు తీసుకుంటున్న చర్యలను అందులో వివరించారు. రాష్ట్రంలోని మొత్తం రహదారుల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల పొడవు 22 శాతమని.. అవి 43 శాతం ప్రమాదాలకు, 48 శాతం మరణాలకు కారణమవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ ధర్మాసనానికి వివరించారు. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నాం రోడ్డు ప్రమాదాల తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం భద్రత, ట్రాఫిక్ ప్రణాళికల నిమిత్తం ప్రత్యేకంగా అదనపు డీజీ స్థాయి అధికారిని నియమించిందని సంజీవ్ కుమార్ కోర్టుకు నివేదించారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ రోడ్‌సేఫ్టీ (డీటీఆర్‌ఎస్)’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. జాతీయ రహదారులపై 50 హైవే ట్రాఫిక్ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యల విషయంలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. హైవేలపై ఆటోలను అనుమతించడం లేదని, దాబాల్లో మద్యం అమ్మకాలను నిషేధించడమే కాక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనం నడిపే వ్యక్తి, వెనుక కూర్చొన్న వ్యక్తి ఇద్దరూ హెల్మెట్ ధరించాలన్న నిబంధన కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించామన్నారు. జాతీయ రహదారులపై మద్యం షాపులను తొలగించడంతో పాటు పర్మిట్లు రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు లేఖలు రాశామన్నారు. మద్యం తాగి వాహనం నడిపేవారి లెసైన్స్ రద్దు కోసం రవాణాశాఖ అధికారులకు సిఫారసు చేస్తున్నామన్నారు. గత ఏడాదిన్నర కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై నమోదు చేసిన కేసులు, జరిమానాగా వసూలు చేసిన మొత్తం వివరాలను ధర్మాసనం ముందుం చారు. ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు తదుపరి ఏ ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామన్నారు. ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం... రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఏపీ సర్కారును ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తరహాలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ.. విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. -
ఔటర్‌పై ఎల్ఈడీ వెలుగులు
సిటీబ్యూరో: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్ఎండీఏ చర్యలు చేపడుతోంది. పగలు కంటే.. రాత్రివేళల్లోనే అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఓఆర్ఆర్పై శంషాబాద్-గచ్చిబౌలి మధ్యనే ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాలు రాత్రి వేళ జరిగినవే. ఈఘటనలో ముగ్గురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. వెలుతురు సరిగా లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని హెచ్ఎండీఏ గుర్తించింది. ఈ క్రమంలో శంషాబాద్-గచ్చిబౌలి దారిలో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని హెచ్ఎండీఏ కమిషనర్ టి. చిరంజీవులు తెలిపారు. 24 కిలోమీటర్ల మేర రూ. 56 కోట్ల వ్యయంతో బల్బులు ఏర్పాటు చేసేందుకు ఫిలిప్స్ కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకుందని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో వీటిని పూర్తి స్థాయిలో అమరుస్తారని తెలిపారు. వాస్తవంగా గంటకు గరిష్టంగా 120 కి.మీ వేగంతో వాహ నాలు రాకపోకలు సాగించేలా ఓఆర్ఆర్ని డిజైన్ చేశారు. అయితే, అంతకు మించిన వేగంతో వాహనాల రాకపోకలు సాగిస్తుండడం ప్రమాదాలకు హేతువు అవుతోంది. ఈ క్రమంలో వాహనాల వేగానికి కళ్లెం వేయడానికీ కసరత్తు చేస్తున్నారు. హెచ్ఎండీఏ, పోలీసు శాఖ సంయుక్తంగా వేగ నియంత్రణ చేపట్టే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. -
రాయితీపై తాటిచెట్లు ఎక్కే మిషన్లు!
గీత కార్మికుల ప్రమాదాల నివారణకు ప్రభుత్వ ప్రయత్నం హైదరాబాద్: కాళ్లు, చేతులతోపాటు శరీరమంతా తన అధీనంలో ఉంచుకొని ప్రతిరోజు తాటి చెట్టు ఎక్కేందుకు సాహసం చేసే గీత కార్మికులు తర చూ ప్రమాదాల బారిన పడి మృత్యుఒడిలోకి చేరిన సంఘటనలు కోకొల్లలు. అంగవైకల్యానికి గురవుతున్నవారి సంఖ్యకు కొదవేలేదు. దీనిపై దృష్టి సారించిన రాష్ర్ట ప్రభుత్వం గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా తాటిచెట్లు ఎక్కే మిషన్లను తెప్పించాలని యోచిస్తోంది. ఇప్పటికే కేరళ, తమిళనాడుల్లో కొబ్బరి, పామ్ చెట్లు ఎక్కేందుకు వినియోగిస్తున్న మిషన్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టేలా కసరత్తు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్... కులవృత్తుల వారికి అవసరమైన పనిముట్లను తయారు చేసే అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్‌తో సంప్రదింపులు జరిపారు. ఫౌండేషన్ నిపుణులతో పైలట్ ప్రాజెక్టు కింద ప్రయోగాలు చేయాలని నిర్ణయించారు. ఈ మిషన్ల వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవని గీత కార్మికులకు నమ్మ కం కుదిరితే రాయితీపై వాటిని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మిషన్‌ను తాటిచెట్టుకు అనుసంధానించి సైకిల్ పెడల్స్లా ఉండే వాటిపై నిలబడి తొక్కడం ద్వారా చెట్టుపైకి వెళ్లే వీలు లభిస్తుంది. కనీస ధర రూ. 5 వేలతో మొదలై కోరుకునే సౌకర్యాన్ని బట్టి తదనుగుణమైన ధరల్లో మిషన్లు లభిస్తాయి. -
మద్యం మత్తు.. ప్రాణాలు చిత్తు
సంగారెడ్డి క్రైం : మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారు. జిల్లాలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో అతి వేగం, అజాగ్రత్తతోపాటు పీకల దాకా మద్యం సేవించి వాహనాలు నడపడమేనని కారణమని తెలుస్తోంది. తాజాగా సంగారెడ్డి మండలం కంది శివారులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ పీకల దాకా మద్యం సేవించి లారీ న డుపుతూ ఆటోను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆటో ప్రయాణిస్తున్న ఆరుగురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. 65వ నంబరు జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించినప్పటికీ రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఈ రహదారి హైదరాబాద్ - ముంబయి జాతీయ రహదారి కావడం వల్ల ఈ రోడ్డుపై భారీ వాహనాలు ప్రతినిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో భారీ వాహనాలు అతివేగంగా వెళ్తుంటాయి. దీంతో రోడ్డుపై ద్విచక్ర వాహనాలు గానీ, చిన్న వాహనాలు గానీ వెళ్లాలంటే వణుకు పుడుతుంది. ఈ రహదారిపై ప్రతినిత్యం వందలాది సంఖ్యలో భారీ వాహనాలు, టూరిస్టు బస్సులు, లారీలు తిరుగుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పోతిరెడ్డిపల్లి నుంచి జహీరాబాద్ వరకు జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి పూట అత్యవసర సమయాల్లో రోడ్డు మీదకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో పాటు ఈ రోడ్డులో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులైతే అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సి వస్తోంది. జాతీయ రహదారిపై ఉన్న పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట, పెద్దాపూర్, బుదేర, కంకోల్, జహీరాబాద్ ప్రాంతాల ప్రజలు ఏ రోజు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తుంటారు. ప్రమాదాల నివారణ కోసం అధికారులు రోడ్లపై ప్రమాద సూచికలు ఏర్పాటు చేసినప్పటికీ సింగిల్ రోడ్డుపై మూల మలుపులు ఎక్కువగా ఉండడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మద్యం మత్తు.. ప్రాణాలు హరీ... పీకల దాకా మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు సంబవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాతీయ రహదారిపై అంటే సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు ఎక్కువగా దాబాలు ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్‌లు జోరుగా సాగుతుండటంతో జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో వాహన డ్రైవర్లు దాబాల్లో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ రహదారిపై ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు వాహనాల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రోడ్డుపై ప్రమాదాలకు నిలయంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మరిన్ని బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. -
ప్రమాదాల నివారణకు ప్రతినబూనాలి
డీఎస్పీ రామచంద్ర కర్నూలు రాజ్‌విహార్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాల్సిన అవసరం ఉందని కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర అన్నారు. 26వ రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం కర్నూలు కొత్త బస్టాండ్‌లోని రిజర్వేషన్ కౌంటరు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో డ్రైవర్లుగా పని చేయడం గర్వకారణమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కార్మికులు మద్యం, గుట్కా వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా డ్రైవర్లు విధులకు హాజరయ్యే ముందు మద్యం, ఇతర మత్తు పానియాలు సేవిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికమన్నారు. విధులకు హజరయ్యే ముందు తగిన విశ్రాంతి తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరంగా ఉండాలని సూచించారు. బస్సులు నడిపేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరమని ఆర్టీసీ రీజినల్ మేనేజరు కృష్ణమోహన్ అన్నారు. విధులకు హాజరయ్యే ముందు తగిన విశ్రాంతి తీసుకుంటే మానసిక ఉల్లాసంగా ఉంటుందన్నారు. విధుల్లో ఉన్న ప్రతి డ్రైవరు తన బస్సులో ఉన్న ప్రయాణికుల సంక్షేమాన్ని మరవరాదన్నారు. డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజరు రామం, డిప్యూటి చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాసులు, కర్నూలు-1 డిపో మేనేజరు మనోహర్, బస్‌స్టేషన్ ఏటీఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రమాద రహిత డ్రైవర్లను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రమాదాల నివారణపై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులిచ్చి అభినందించారు. -
పట్టాలెక్కనున్న ‘ఏటీపీఎస్’
ప్రమాదాల నివారణ ప్రయోగాలకు రైల్వే బోర్డు పచ్చజెండా లింగంపల్లి-వాడీ, వికారాబాద్-బీదర్ సెక్షన్లలో అమలు తాండూరు: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా.. వెనుక నుంచి రైళ్లు ఢీకొనకుండా ప్రమాదాలను నివారించేందుకు రైల్వే అధికారులు చేపట్టిన ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీఎస్) ప్రయోగాలు ఎట్టకేలకు పట్టాలెక్కనున్నాయి. హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్, మేథా, కర్నెక్స్ కంపెనీల ఆధ్వర్యంలో రెండేళ్లుగా చేసిన ప్రయోగాలకు రైల్వే బోర్డు సభ్యులు పచ్చజెండా ఊపారు. సోమవారం రైల్వే బోర్డు సభ్యులు ఏకే మిట్టల్(ఎలక్ట్రికల్), మరో అడిషనల్ మెంబర్ మనోహరన్( సిగ్నల్స్), సికింద్రాబాద్ డీఆర్ఎం ఎస్ కే మిశ్రా, మూడు కంపెనీల ప్రతినిధులు కుర్గుంట, నవాంద్గీ, మంతట్టి రైల్వే స్టేషన్ల మధ్య రైలులో వెళ్లి ప్రయోగాల తీరును పరిశీలించారు. ఈ ప్రయోగాల అమలుకు మొదటగా రైల్వేబోర్డు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఎంపిక చేసింది. లింగంపల్లి- వాడీ వరకు, వికారాబాద్-బీదర్ సెక్షన్ల మధ్య ఏటీపీఎస్‌ను మొదట అమలు చేయనున్నారు. ఈ రెండు సెక్షన్ల మధ్య సుమారు 40కి పైగా రైల్వేస్టేషన్ల పరిధిలో 40 రైలు ఇంజిన్లలో ఏటీపీఎస్ సాంకేతిక పరికరాలను అమర్చనున్నారు. వచ్చే ఏడాది మార్చి- జూన్ మధ్య ఏటీపీఎస్‌ను అమలు చేయనున్నట్టు రైల్వే బోర్డు అడిషనల్ మెంబర్ (టెలి కమ్యూనికేషన్స్) మహేష్ మంగళ్ తెలిపారు. ప్రయోగాలకు రూ.22 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రైన్ కొలిజన్ అవైడింగ్ సిస్టమ్(టీకాస్)లో ఉన్న అన్ని అంశాలు ఏటీపీసీలో ఉంటాయన్నారు. ఇప్పటి వరకు చేసిన 32 ప్రయోగాలు విజయవంతం అయ్యాయని ఆయన వివరించారు. -
అతివేగానికి కళ్లెం..
- ముఖ్య కూడళ్లలో హైటెక్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు - వాహన నంబర్ సహా గుర్తించగలిగే ఏఎన్పీఆర్ టెక్నాలజీ వినియోగం - ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ విభాగం చర్యలు సాక్షి, ముంబై: నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించే దిశగా ట్రాఫిక్ విభాగం చర్యలు తీసుకుంటోంది. మితిమీరిన వేగంతో వెళుతున్న వాహనాలకు కళ్లెం వేయడానికి అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు గాను వాహన వేగాన్ని నియంత్రించేందుకు నగరంలోని ఐదు ముఖ్య కూడళ్లలో నంబర్ ప్లేట్లను కూడా రికార్డు చేసే కొత్త హైటెక్ సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కెమెరాల్లో వాహన నంబర్లను స్పష్టంగా చదివే విధంగా పరికరాలను అమర్చనున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఏ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కువ వేగంతో వెళుతున్నాయో ఆ ప్రదేశాల్లో ఈ కెమెరాలను అమర్చనున్నారు. అంతేకాకుండా ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్పీఆర్) టెక్నాలజీతో కూడుకున్న సీసీటీవీ కెమెరాలను అమర్చాల్సిందిగా ఏజెన్సీలను ట్రాఫిక్ విభాగం కోరింది. బాంద్రా-వర్లీ సీలింక్ (బీడబ్ల్యూఎస్‌ఎల్)పై కూడా ఈ కెమెరాలను ఈ ఏడాది చివరికల్లా అమర్చనున్నారు. అదేవిధంగా బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), విక్రోలిలోని గోద్రేజ్ జంక్షన్, మెరిన్ డ్రైవ్, సౌత్ ముంబైలోని జేజే ఫ్లై ఓవర్లలో కూడా ఈ సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వారిని పట్టుకోవడం కోసం ఏఎన్పీఆర్ కెమెరాలనే ఉపయోగిస్తూ ఉంటారు. ఇదిలా వుండగా నగరవ్యాప్తంగా ఈ కెమరాలను ఏఏ ప్రదేశాల్లో అమర్చాలో ఇప్పటికే అధ్యయనం నిర్వహించామని అడిషినల్ కమిషనర్ (ట్రాఫిక్) క్వైజర్ ఖలీద్ తెలిపారు. విక్రోలిలోని గోద్రేజ్ జంక్షన్లో ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైందని ఆయన చెప్పారు. బాంద్రా-వర్లీ సీలింక్ కూడా ప్రమాదాలకు నిలయంగా మారుతోందని, ఇక్కడ కూడా వాహన దారులు అతి వేగంగా వాహనాలు నడుపుతున్నారని ఆయన తెలిపారు. కాగా బాంద్రా-వర్లీ సీలింక్‌పై రెండు వైపులా ఈ కెమరాలను అమర్చనున్నారు. కాగా, ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ మార్గంపై కూడా ఈ కెమెరాలను అమర్చే అవసరముందా అనే అంశంపై అధ్యయనం నిర్వహించనున్నారని ఎంఎస్ఆర్డీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే బీడబ్ల్యూఎస్‌ఎల్, జేజే ఫ్లై ఓవర్‌పై ద్విచక్రవాహనాలను నిషేధించారు. 2002-10 మధ్య కాలంలో జేజే ఫ్లై ఓవర్‌పై 254 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 183 ద్విచక్రవాహనాల వల్లనే జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాలలో 33 మంది మరణించగా, అందులో 31 మంది ద్విచక్రవాహన దారులే. వ్యాపార కేంద్రంగా పేరుగాంచిన బీకేసీ వద్ద కార్యాలయ పని గంటలు ముగిసిన వెంటనే మితిమీరిన వేగంతో వాహనాలు వెళుతుండాన్ని గమనించామని ఆయన తెలిపారు. దీంతో ఆయా మార్గాలన్నింటిలోనూ సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. -
రైల్వే శాఖలో చలనం
బషీరాబాద్: ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ చేపట్టిన టీకాస్ ప్రయోగం ఆదివారం మరోసారి చేపట్టారు. రైలు ప్రమాదాలను పసిగట్టి ప్రమాదాలు జరగకుండా టీకాస్ పద్ధతిని ఈ ఏడాది ప్రవేశపెడతామని 5 నెలల క్రితం రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. టీకాస్ ప్రయోగం విజయవంతమై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో రైల్వే అధికారులు స్పందించారు. ఎదురెదురుగా రైళ్లు ప్రయాణించినా ప్రమాదం జరగకుండా వాటంతటవే నిలిచిపోయేలా రైల్వే శాఖ, ఆర్డీఎస్‌ఓల సంయుకాధ్వర్యంలో ట్రెయిన్ కొలిజన్ అవైడింగ్ సిస్టం (టీకాస్) ప్రయోగం సుమారు 20 నెలలుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం కర్నెక్స్ కంపెనీకి చెందిన సిబ్బంది నవాంద్గి రైల్వే స్టేషన్లో సాంకేతిక పరికరాలు పరిశీలించారు. పది రోజుల పాటు ఆర్డీఎస్ఓ (టీకాస్) ప్రాజెక్టు డెరైక్టర్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక పరికరాలను కర్నెక్స్ కంపెనీ సిద్ధం చేసుకొంటోంది. నాలుగైదు నెలలు క్రితం టీకాస్ ప్రయోగం నిలిపివేసిన అధికారులు ఆదివారం టీకాస్ లోకో ఇంజిన్ రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని నవాంద్గి- మంతట్టి రైల్వే స్టేషన్ల మధ్య తిరుగుతూ కనిపించింది. ప్రమాదాలు జరిగితే కానీ రైల్వే శాఖ కళ్లు తెరవదంటూ పలువురు విమర్శించారు. గత గురువారం మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొని పలువురు చిన్నారులు మృత్యువాత పడిన విషాద ఘటన పాఠకులకు విదితమే. -
వారి యవ్వారమంతా గుట్టే..
- చమురు సంస్థల కార్యకలాపాల తీరు - ప్రమాదాల నివారణలో నిర్లక్ష్యం - ఏమైనా జరిగితే.. అధికారులదే బాధ్యత అమలాపురం : ‘కోట్లు మాకు... పాట్లు మీకు’ అన్నట్టుగా ఉంది చమురు సంస్థల తీరు. చమురు, సహజ వాయువులను వెలికితీసి తరలించుకుపోయి జేబులు నింపుకొంటున్న ఆ సంస్థలు.. ఏ చిన్న ప్రమాదం జరిగినా బాధ్యతంతా స్థాని క ప్రభుత్వ అధికారులపైకి వేసి పలాయన మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రమాదాలను ఎదుర్కోవడంలోనే కాదు, ప్రమాదాల నివారణలో కూడా స్థానికాధికారులకు, చమురు సంస్థలకు మధ్య సమన్వయం కొరవడింది. ప్రమాదం జరిగితే చమురు సంస్థల పలాయానం కేజీ బేసిన్ పరిధిలో బ్లోఅవుట్లు, పైపులైన్ల లీకేజీలు వంటి సంఘటనలు జరిగినప్పుడు చమురు సంస్థలు పలాయనమంత్రం జపిస్తున్నాయి. సంఘటన స్థలానికి వెళితే బాధితుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోందని తప్పించుకుని, ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై వదిలేస్తున్నారు. నగరం లో గ్యాస్ దుర్ఘటన జరిగినప్పుడు గెయిల్ సంస్థే కాకుం డా గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్), మినీ ఆయిల్ రిఫైనరీ నిర్వహిస్తున్న ఓఎన్జీసీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కనీసం అగ్నిమాపక శకటాలు కూడా పంపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితు లు తమపై దాడి చేస్తారన్న భయంతో గెయిల్ ఉద్యోగులు బయటకు అడుగు పెట్టలేదు. దీంతో మంటలను అదుపు చేయాల్సిన బాధ్యత స్థానిక అగ్నిమాపక శాఖపై పడింది. వారు రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నుంచి వచ్చేసరికే పెనునష్టం జరిగిపోయింది. నిర్వహణపై సమన్వయం లేదు ఓఎన్జీసీతో పాటు ఇతర సంస్థలకు చెందిన గ్యాస్, చము రు పైపులైన్లు కోనసీమలో విస్తరించి ఉన్నాయి. వీటి నిర్వహణపై చమురు సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వీటి పనితీరు, భద్రత విషయంలో స్థానికాధికారులు, చమురు సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉంది. అయితే చమురు సంస్థలు ఒంటెద్దు పోకడలకు పోతున్నాయి. రెవెన్యూ, పోలీసు, ఫైర్, పంచాయతీ శాఖల అధికారులను సమన్వయం చేసి ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత చమురు సంస్థలపై ఉన్నా.. అలాంటి దాఖలాలు లేవు. పైపులైన్ల భద్రతపై జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో అధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు ప్రతీ రెండు నెలలకు ఓసారి సమీక్ష చేయాల్సి ఉన్నా, ఒక్కసారి కూడా జరగలేదు. పైపులైన్ల వెంటే నివాస గృహాలు ‘గ్యాస్ పైపులైన్లకు 18 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేయరాదు. ఇక్కడ పైపులైన్ల చుట్టూ ఇళ్లను చూస్తే ఆశ్చర్యమేస్తోంది’ అని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్పీ సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం నగరంలో ఆయన పర్యటించినప్పుడు పైపులైన్లపైనే ఇళ్ల నిర్మాణం జరగడాన్ని చూసి విస్తుపోయారు. గ్యాస్ పైపులైన్ ప్రాంతాల్లో ‘నో కన్స్ట్రక్షన్ జోన్’ ఎంతవరకు విస్తరించి ఉందనే దానిపై చమురు సంస్థల నుంచి సరైన సమచారం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.