prise hike
-
కాంగ్రెస్ మెగా ర్యాలీ వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యకు నిరసనగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ నెల 28వ తేదీన తలపెట్టిన తలపెట్టిన మెగా ర్యాలీ వాయిదా పడింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సెప్టెంబర్ 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ గురువారం తెలిపారు. దేశ రాజధానిలో కరోనా మహమ్మారి వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని మెగా ర్యాలీని వాయిదా వేసినట్లు వెల్లడించారు. వచ్చే నెల 4న నిర్వహించబోయే భారీ ర్యాలీతో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బలమైన సందేశం పంపిస్తామని అన్నారు. ప్రజా సమస్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 22న రాష్ట్ర స్థాయిలో, 25న జిల్లా స్థాయిలో, 27న బ్లాక్ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే నిర్ణయించింది. అలాగే సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్రకు సిద్ధమవుతోంది. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ దాకా ఆ యాత్ర సాగనుంది. -
‘‘తగ్గించండి.. లేదా దిగండి’’
-
తగ్గించండి.. లేదా దిగండి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ట్విటర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ‘చేతనయితే ధరలు తగ్గించండి లేదా పదవి నుంచి దిగిపోండి’ అని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఘాటుగా చెప్పారు. వరుసగా పెరుగుతున్న వంట గ్యాస్, కూరగాయల ధరలపై ఆయన ట్విటర్లో స్పందించారు. ప్రధాని మోదీజీ ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి.. లేదా సింహాసనం నుంచి దిగండి అని రాహుల్ ట్వీట్ చేశారు. బుధవారం నుంచి గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు. महंगी गैस, महंगा राशन बंद करो खोखला भाषण दाम बांधो, काम दो वर्ना खाली करो सिंहासन https://t.co/LMd2KL0N5t — Office of RG (@OfficeOfRG) November 5, 2017 -
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
పెట్రోల్‌పై 83 పైసలు, డీజిల్‌పై రూ.1.26 న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 83 పైసలు, డీజిల్‌పై రూ.1.26 పెరిగింది. పెంచిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వెల్లడించింది. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.63.02కు, డీజిల్ ధర రూ.51.67కు పెరిగింది. ఈ నెలలో ఇదో రెండో పెంపు. మే 1న పెట్రోల్‌పై రూ.1.06, డీజిల్‌పై రూ.2.94 పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెంపు, రూపాయి- డాలర్ మారకపు విలువ పెంపుతో పెట్రో ధరలను పెంచినట్లు ఐఓసీ తెలిపింది.