సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ట్విటర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ‘చేతనయితే ధరలు తగ్గించండి లేదా పదవి నుంచి దిగిపోండి’ అని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఘాటుగా చెప్పారు. వరుసగా పెరుగుతున్న వంట గ్యాస్, కూరగాయల ధరలపై ఆయన ట్విటర్‌లో స్పందించారు.
ప్రధాని మోదీజీ ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి.. లేదా సింహాసనం నుంచి దిగండి అని రాహుల్ ట్వీట్ చేశారు. బుధవారం నుంచి గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు.
महंगी गैस, महंगा राशन
— Office of RG (@OfficeOfRG) November 5, 2017
बंद करो खोखला भाषण
दाम बांधो, काम दो
वर्ना खाली करो सिंहासन https://t.co/LMd2KL0N5t
Comments
Please login to add a commentAdd a comment