Prisoners Pardoned
-
రాజీవ్ హత్య కేసు: రాష్ట్రపతి భవన్‌కు క్షమాభిక్ష
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఖైదీల విడుదల అంశం రాజ్‌భవన్ నుంచి మళ్లీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది. సుప్రీం కోర్టు ఇచ్చి న వారంరోజుల గడువు పూర్తయినా నేటికీ ఎటూ తేలని వ్యవహారంగా మారిపోయింది. సాక్షి, చెన్నై : రాజీవ్ హత్య కేసులో వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు నిందితుల్లో ఒకరైన పేరరివాళన్ తనను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జడ్జి నాగేశ్వరరావు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరుపుతోంది. ఈ పిటిషన్ గత నెల 21న విచారణకు రాగా కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. పేరరివాళన్ సహా ఏడుగురు ఖైదీల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం 2018 సెప్టెంబర్ 9న సిఫార్సు చేస్తూ చేసిన తీర్మానంపై గవర్నర్ మూడు లేదా నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పా రు. సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోకూడదా అని జడ్జి నాగేశ్వరరావు ప్రశ్నకు అవసరం లేదని తుషార్ మెహతా బదులిచ్చారు. విచారణను రెండు వారా లు వాయిదా వేయాలని పేరరివాళన్ తరఫు న్యా యవాది కోర్టును కోరా రు. దీనిపై జడ్జి స్పంది స్తూ తమిళనాడు గవర్నర్ నిర్ణ యం వరకు వేచిచూద్దామని తెలిపారు. మూడు లేదా నాలుగు రోజుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని సొలిసిటర్ జనరల్ చెప్పిన మాటలను రికార్డు చేస్తున్నామని చెప్పి విచారణను రెండు వారాలకు వాయిదా వేశా రు. ఇదిలా ఉండగా, ఈ అంశంపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ అఫిడవిట్‌ను సుప్రీం కోర్టులో గురువారం దాఖలు చేసింది. అందులో ‘పేరరివాళన్ క్షమాభిక్షకు సంబంధించిన అన్ని పత్రాలను గవర్నర్ పరిశీలించారు. ఈ విషయంలో రాష్ట్రపతికి మాత్రమే పూర్తి అధికారం ఉంది. చట్ట ప్రకారం ఆయన తగిన నిర్ణయం తీసుకుంటారు.’ అని ఉంది. దీంతో పేరరివాళన్ పిటిషన్‌పై విచారణ ఈనెల 9వ తేదీకి వాయిదా పడింది. రాజీవ్ హత్య కేసులో ఖైదీల విడుదలపై తమిళనాడు ప్రభుత్వం, పలు రాజకీయ పార్టీలు పట్టుపడుతున్నాయి. గవర్నర్ తనకు అధికారం లేదని తేల్చిచెప్పడంతో ఈ వ్యవహారం రాజ్‌భవన్ నుంచి మళ్లీ రాష్ట్రపతి భవన్‌కు చేరింది. -
ఖైదీల క్షమాభిక్షలో జాప్యం
రాజమహేంద్రవరం: జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 30 అమలులో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఓ మార్గదర్శకాల ప్రకారం కోస్తా రీజియన్‌లో క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితాను జైలు అధికారులు సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 107 మంది, మహిళా జైలులో 14 మంది, విశాఖ సెంట్రల్ జైలు నుంచి 54 మంది ఖైదీల విడుదలకు సన్నాహాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈనెల 26న జెండా వందనానికి ముందే ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఖైదీలు ఒకరికంటే ఎక్కువ మందిని హత్య చేసిన కేసుల్లో, చిన్నపిల్లలపై లైంగికదాడి జరిపి, హత్య చేసిన కేసుల్లో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడంపై గవర్నర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో 26న ఖైదీల విడుదలలో జాప్యం జరిగే అవకాశముంది. రాష్ట్ర కేబినెట్ మరోసారి సమావేశమై క్షమాభిక్షకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు రూపొందించి, ఆమోదిస్తేనే ఖైదీల విడుదలకు మార్గం సుగమమవుతుంది. కాగా క్షమాభిక్ష ప్రసాదిస్తే వృద్ధాప్యంలోనైనా తమ కుటుంబ సభ్యులతో గడపాలని ఆశపడుతున్న ఎందరో జీవిత ఖైదీలు క్షమాభిక్షలో జాప్యం జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో దిగులు పడుతున్నారు. చేతికి అందిన తాయిలం నోటికి అందకుండా పోయినట్టు కాక.. రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాల్ని పరిష్కరించి, క్షమాభిక్ష జీఓను అమలు చేయాలని కోరుతున్నారు.