వచ్చే ఏడాది నుంచి మొబైల్ ఫోన్లలో టీవీ ప్రసారాలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి మొబైల్ ఫోన్లలో టీవీ కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు ప్రసారభారతి కసరత్తు చేస్తోంది. ప్రైవేట్ మీడియా హౌజెస్ భాగస్వామ్యంతో మోబైల్ ఫోన్లలో సుమారు 20 చానెల్స్‌ను ప్రసారం చే యనుంది. ప్రస్తుతం మూడు విధాలుగా డిష్, కేబుల్, ఎంటినాల ద్వారా ప్రసారాలను అందజేస్తోంది. నాలుగో విధానంలో డిజిటల్ ఎంటీనాల ద్వారా 20 ప్రీ చానెళ్లను టీవీల్లో, వచ్చే ఏడాది మోబైళ్లలో ప్రసారం చేయనున్నట్లు ప్రసార భారతి ఎగ్జిక్యూటీవ్ అధికారి జవహార్ సిర్కార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముందుగా ఢిల్లీ, ముంబై నగరాల్లో మొబైళ్లలో మొదట ప్రారంభించనున్నారు. ఇందుకోసం దూరదర్శన్ డీవీబీటీ2 సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది.
డోంగుల్(వైర్లెస్ కనెక్షన్) ప్రవేశపెడుతారు. డీటీహెచ్ ప్లాట్‌ఫాం నుంచే అన్ని ఫ్రీ చానెల్స్‌ను ప్రసారం చేయడమే ధ్యేయమని, ఇందుకోసం ప్రైవేట్ కంపెనీలను భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు. డీవీబీటీ(డిజిటల్ వీడియో బ్రాడ్కాస్ట్ టెర్రిస్టియల్) ప్రసారాలు టీవీ టవర్స్ నుంచి అందుతాయి, కానీ ఇందుకు అవసరమైన అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్లలో ఆయా కంపెనీలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కార్యాలయాల పనివేళల్లో టీవీలను చూడలేరు. ఇందుకు మొబైల్ ఫోన్లు, టాబ్లాయిడ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రయాణం చేసేటప్పుడు బ్యాటరీ ద్వారా పనిచేసే మొబైల్ ఫోన్లలో ఎలాంటి ఖర్చు లేకుండా టీవీ చానెళ్లను చూసుకోవచ్చు. అడ్వర్టైజ్ మెంట్ ద్వారా ఆదాయా రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం భారత్‌లో 225 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు వినియోగంలో ఉన్నాయి. ఇంకా 185190 మిలియన్ల ఫోన్లు వినియోగించనున్నారు. ఇది కొన్ని దేశాల జనాభా కంటే సమానం.