సగటుజీవికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సామాన్యులకు ఊరటని చ్చేందుకే ఈ ఏడాది ఎంసీడీల పరిధిలోని పార్కింగ్ రేట్లు, హౌసింగ్ ట్యాక్స్‌లు పెంచకూడదని నిర్ణయించినట్టు బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం పండిత్ పంత్‌మార్గ్‌లోని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ కార్యాలయంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్ల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఎంసీడీల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోయల్ మాట్లాడారు.
ఎంసీడీల పనితీరులో పారదర్శకత పెంచడంతోపాటు ప్రజలకు మరింత చేరువ య్యేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే బీజేపీ అధికారంలో ఉన్న ఎంసీడీల పరిధిలోని పార్కింగ్ రేట్లు, హౌసింగ్ ట్యాక్స్‌లు పెంచడం లేదన్నారు. హోటళ్లు, బంక్వెట్ హాళ్లుగా మార్చిన ఫామ్ హౌస్‌ల విషయంలో కొద్దిమేర మార్పులు చేసినట్టు తెలిపారు. వీటన్నింటి వివరాలు ఆన్లైన్లో పొం దుపరుస్తున్నట్టు తెలిపారు. ఎంసీడీల పరిధిలో తీసుకోబోయే నిర్ణయాలను వివరించారు.
కమ్యూనిటీహాళ్లు బుకింగ్‌తోసహా 64 అంశాలకు సంబంధించిన చెల్లింపులు, ఇతర అంశాల వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు.
ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ స్కీం(ఈసీఎస్) ద్వారా కాంట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తారు.
ఈసీఎస్ ద్వారానే ఎంసీడీ ఉద్యోగుల
జీతభత్యాలను కూడా చెల్లిస్తారు.
చారిత్రక ప్రదేశాలపై ప్రాపర్టీ ట్యాక్స్‌ను
తొలగిస్తారు.
ఎయిడెడ్ పాఠశాలలపై ప్రాపర్టీ ట్యాక్స్‌ను
తగ్గిస్తారు.