punugupalli
-
హార్సిలీహిల్స్‌పై పునుగు పిల్లి ప్రత్యక్షం
బి.కొత్తకోట/శ్రీశైలం: శ్రీవారు కొలువైన తిరుమల కొండల్లో కనిపించే పునుగు పిల్లి అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పై బుధవారం ప్రత్యక్షమైంది. వివరాల్లోకి వెళితే... కొండపైన పోలీస్, టూరిజం అతిథి గృహల మధ్యలో ఇనుప కంచె ఉంది. ఈ కంచెకు చిక్కుకుని ఓ వన్యప్రాణి విలవిల్లాడుతోందని పోలీస్ అతిథి గృహంలో పనిచేసే సిబ్బంది కొండపై ఉన్న అటవీ సిబ్బంది రవి, రమణలకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని పునుగు పిల్లి శరీరానికి అతుక్కున్న కంచెను కత్తిరించడంతో అది అడవిలోకి వెళ్లిపోయింది. కంచె తీగను కత్తిరించే సమయంలో దాన్ని వీడియో తీసి హార్సిలీహిల్స్ సెక్షన్ ఆఫీసర్ అడపా శివకుమార్‌కు పంపగా ఆ వన్యప్రాణి పునుగు పిల్లిగా నిర్ధారించారు. తిరుపతి శేషాచలం అభయారణ్యానికే పరిమితమని భావిస్తున్న తరుణంలో పునుగు పిల్లి జాడ హార్సిలీహిల్స్‌పై వెలుగులోకి రావడం విశేషం. పునుగు పిల్లుల్లో 38 రకాల జాతులున్నప్పటికి ఆసియా రకానికి చెందిన పునుగు పిల్లి ఇది. దీని గ్రంధుల నుంచి సుగంధ ద్రవ్యం వెలుపలికి విసర్జిస్తాయి. పునుగు పిల్లి చర్మాన్ని దేనికైనా రుద్దితే వెలువడేదే పునుగు తైలం. పునుగు తైలాన్ని తిరుమల శ్రీవారి సేవల్లో వినియోగిస్తారు. పునుగు పిల్లులు కాఫీ కాయలను తిని గింజలను విసర్జిస్తాయి. కాఫీ తోటలున్న హార్సిలీహిల్స్‌పై వీటి మనుగడ ఉన్నట్టు భావిస్తున్నారు. కొండపైన అటవీశాఖ ప్రాంగణం, ఘాట్‌రోడ్డులో పైనుంచి కిందకు వచ్చే రెండో మలుపులో అటవీశాఖ ఆధ్వర్యంలో కాఫీ తోటల నిర్వహణ సాగుతోంది. వెలుగులోకి వచ్చిన పునుగు పిల్లుల సంతతిపై అధ్యయనం జరగాల్సి ఉంది. శ్రీశైలంలో క్యూలైన్లో మరొకటి..శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల ఉచిత దర్శన క్యూలైన్లో బుధవారం ఉదయం భక్తులకు ఓ పునుగు పిల్లి కనిపించింది. సాధారణంగా శేషాచలం కొండల్లో కనిపించే ఈ పిల్లి ఇక్కడ ప్రత్యక్షం కావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. -
ప్రియురాలిని చంపి ఇంట్లో పాతి పెట్టాడు..
చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి.. నేడు మృతదేహం వెలికితీత గుర్రంకొండ/తిరుపతిక్రైం: మూడేళ్లు ప్రేమాయణం సాగించి చివరకు ప్రియురాలి ప్రాణాలు తీసి ఇంట్లోనే పాతిపెట్టాడు ఓ వ్యక్తి. చిత్తూరు జిల్లా గుర్రంకొండ వుండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజునే ఆమె మృతదేహాన్ని వెలికితీయునున్నారు. వాల్మీకిపురం మండలం పునుగుపల్లికి చెందిన జిలానీ కుమార్తె షేక్ సబీహా అలియాస్ సంధ్య(23) గుర్రంకొండ మండలం నక్కలవాళ్లపల్లెకు చెందిన వేమనారాయణరెడ్డి(28) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వేమనారాయణరెడ్డి వాల్మీకిపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్. షేక్ సబీహా బెంగళూరులో పనిచేసేందుకు వెళుతున్నానని తల్లికి చెప్పి రెండేళ్ల కిందట తిరుపతికి చేరుకుంది. నగరంలోని ఓ ఇంటిని వీరిద్దరూ అద్దెకు తీసుకున్నారు. ఇటీవల ఆమె పేరును సంధ్యగా మార్చి ఓ మోటార్ వాహనాల షోరూంలో అకౌం టెంట్‌గా చేర్పించాడు. ఆధార్, ఓటర్ కార్డుల్లో కూడా సబీహా పేరును సంధ్యగా మార్చి వారికి ఆ ప్రూఫ్‌లు ఇచ్చాడు. కాగా, అదే షోరూంలో పనిచేస్తున్న ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతను ఆమెకు ఓ స్కూటర్ కూడా కొనిచ్చాడు. ఇద్దరూ కలసి వివిధ ప్రాంతాలు తిరిగి వచ్చారు. ఈ విష యం తెలుసుకున్న వేమనారాయణరెడ్డి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఇద్దరూ గొడవపడ్డారు. జనవరి 29న వేమనారాయణరెడ్డి తిరుపతిలోని ఇంటిని ఖాళీ చేసి సొంత గ్రామానికి చేరుకున్నాడు. సంధ్య విధులకు హాజరుకాకపోవడంతో షోరూం సిబ్బంది ఈ నెల 2న ఆమె తల్లికి ఫోన్ చేశారు. తన కూతురు పేరు సంధ్య కాదని షేక్ సబీహా అని తెలిపింది. తమ కిచ్చిన అడ్రస్‌లో సంధ్యగా ఉందని పేర్కొనడంతో తల్లికి అనుమానం వచ్చి వెంటనే తిరుపతి వెస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వేమనారాయణరెడ్డి కూడా కన్పించకపోవడంతో అతన్ని వెతికి పట్టుకొని విచారించారు. పెళ్లికి నిరాకరించడంతో ఆమెను హతమార్చి నక్కలవాళ్లపల్లిలోని తన ఇంట్లో పూడ్చిపెట్టినట్లు పోలీసులకు తెలిపాడు.