rajam peta police
-
అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ దొంగల ముఠా అరెస్ట్
సాక్షి, వైఎస్సార్: రాజంపేట పోలీసులు శుక్రవారం అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వివరాలు.. రెండేళ్లుగా ప్రభుత్వ టెలిఫోన్ కాల్స్ దొంగతనం చేయబడ్డాయంటూ టెలికాం అధికారులు రాజంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజంపేట రెడ్డివారి వీధిలో నిర్వహిస్తున్న ఇంటర్నెట్ ఆధారిత అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ కేంద్రంపై దాడి చేశారు. ఈ ముఠా 32 రూపాయల ఫోన్ కాల్‌ను రూ. 6కే అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ టెలిఫోన్ కాల్స్ కేంద్రం నిర్వహకుడు లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం అతను కువైట్‌లో ఉంటున్నాడన్నారు. ఈ క్రమంలో రాజంపేట పట్టణానికి చేందిన సయ్యద్ మొహమ్మద్ షరీఫ్ (మున్నా), రాజశేఖర్ నాయుడు, పోలికి చెందిన గుండ్రాజు సుదర్శన్ రాజులు లక్ష్మీనారాయణకు సహకరిస్తూ.. రూ. కోట్లాది రూపాయలు సంపాదించి పెట్టారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వీరి ముగ్గురి మీద కేసు నమోదు చేశామని.. వారి వద్ద నుంచి 500 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
పిడికిలి
కడప అర్బన్ : జిల్లాలో పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్లుగా చలామణి అవుతున్న ముగ్గురిని ఎస్పీ జీవీజీ అశోకకుమార్ ఆదేశాల మేరకు రాజంపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరిపై పీడీ యాక్ట్ కేసు పెట్టారు. వారి వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోని రైల్వేకోడూరుకు చెందిన దేవులపల్లి రాజశేఖర్ అలియాస్ చిన్నాను అరెస్టు చేశామన్నారు. ఇతను 2009లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ప్రారంభించి ఇప్పటివరకు 18 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి ఇతను ముఖ్య అనుచరుడన్నారు.అలాగే మైదుకూరు మండలం దువ్వూరుకు చెందిన నాగినేని శివ 2007 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పరారీలో ఉన్నాడన్నారు. ఇతను 21 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. వేంపల్లె మండలం నందిపల్లెకు చెందిన వీరం లింగేశ్వరరెడ్డి అలియాస్ వీరుడు నాలుగేళ్ల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడన్నారు. ఇతను ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. వీరందరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నామన్నారు.