రాట్నాలమ్మకు వెండి వస్తువుల సమర్పణ
రాట్నాలకుంట (పెదవేగి రూరల్) : స్థానిక రాట్నాలమ్మవారికి ఇద్దరు భక్తులు సోమవారం వెండి వస్తువులను సమర్పించారు. గుంటూరు జిల్లా మందడం గ్రామానికి చెందిన ఆలూరి సుబ్రహ్మణ్యం దంపతులు రూ.33 వేల విలువైన 790 గ్రామాలు వెండి వస్తువులు, ఏలూరుకు చెందిన కనిగొళ్ల పుల్లారావు గుప్తా దంపతులు రూ.10 వేల విలువైన 193 గ్రాముల వెండి వస్తువును సమర్పించారు. దాతలను ఆలయ చైర్మన్ రాయల విజయవెంకట భాస్కరరావు ఈవో ఎన్.సతీష్‌కుమార్ అభినందించారు.