Red Sandalwood labour
-
తనిఖీలు : 23 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్
కడప : వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలుపల్లి వద్ద పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది తమిళ కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో 40 మంది ఎర్రచందనం కూలీలు పరారైయ్యారు. పట్టుబడిన కూలీలను పోలీస్ స్టేషన్‌కు తరలించి.. విచారిస్తున్నారు. పక్కా సమాచారంతో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న కూలీల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. -
పోలీసులపై రాళ్లు రువ్విన ఎర్రచందనం కూలీలు
చిత్తూరు: చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులపైకి ఎర్రచందనం కూలీలు రాళ్లు రువ్వారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దాంతో ఎర్రచందనం కూలీలు అక్కడి నుంచి పరారైయ్యారు. దాదాపు 90 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తమిళ స్మగ్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భాకరాపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
8 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్
కడప: వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం జీవీ సత్రం కూడలి వద్ద శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి 15 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లుతోపాటు రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో 21 మంది ఎర్రచందనం కూలీలు
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అందులోభాగంగా చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో పోలీసులు గత అర్థరాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బస్సులో ప్రయాణిస్తున్న 21 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో సదరు వ్యక్తులు ఎర్రచందనం కూలీలమని చెప్పారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిని వారాంత తమిళనాడుకు చెందిన వారని పోలీసులు తెలిపారు.