నివాస ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ ఘోరావ్
కవిటి (శ్రీకాకుళంజిల్లా): నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది మోకలడ్డుతున్నరని బెంత ఒడియాలకు చెందిన విద్యార్థులు మంగళవారం తహసీల్దార్ వెంకటేశ్వరరావును ఘోరావ్ చేశారు. కవిటి మండలంలో దాదాపు ఎనిమిది వేల మంది బెంత ఒడియాలు నివసిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కోసం నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. వీటిని రెవెన్యూ వీటిని తిరస్కరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వందలాది మంది పేద బెంతొ ఒడియా విద్యార్ధులు ఫీజు రీయంబర్స్మెంట్ పధకానికి దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
కవిటిలో రైతుసాధికారిక సదస్సు బహిష్కరణ
కవిటి మండలంలో రైతులు కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని,పై-లీన్ తుఫాన్ నష్టపరిహారం కూడా ఇప్పటికీ పంపిణీ కాలేదని మంగళవారం కవిటి రెవెన్యూ,గ్రామపంచాయితీ పరిధిలో నిర్వహించిన సాధికార సదస్సును బహిష్కరించారు. సదస్సును బహిష్కరించిన రైతుల్లో అధికశాతం టీడీపీ అనుయాయులే ఉండడం గమనార్హం. రైతునేత మాజీ సర్పంచ్ బెందాళం వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రుణమాఫీకి ఏరకంగా కవిటి పంచాయితీ రైతులు అనర్హులో తెలుపకుండానే తూతూమంత్రంగా సభలు నిర్వహించడం ఎందుకన్నారు. సదసు్సును వ్యతిరేకించిన రైతుల్లో అధికశాతం టీడీపీ అనుయాయులే ఉండడం వారు సైతం తమ నిరసనను బహిరంగంగా తెలిపారు.