వైఎస్సార్ టీఎఫ్కు నూతన కమిటీ
హైదరాబాద్: రాష్ట్ర వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్‌కు హైదరాబాద్‌లో ఆదివారం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఫెడరేషన్ గౌరవాధ్యక్షులుగా ఎం. రియాజ్ హుస్సేన్(కృష్ణా), అధ్యక్షుడుగా కేశవరపు జాలిరెడ్డి(ప్రకాశం), అసోసియేట్ అధ్యక్షుడుగా టీవీ రమణారెడ్డి(వైఎస్సార్ జిల్లా), ప్రధాన కార్యదర్శిగా కె. ఓబులపతి(అనంతపురం) ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం ఓబులపతి మాట్లాడుతూ.. సమస్యల విషయంలో కొత్త కమిటీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.