RIO ravi
-
కడపలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్?
-
కడపలో ఇంటర్ ప్రశ్నాపత్రం లీక్?
కడప : వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో ఇంటర్మీడియెట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు శుక్రవారం పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. సోషల్ మీడియాలో క్వశ్చన్ పేపర్ సెట్-3 దర్శనమిచ్చింది. అయితే ఇంగ్లీష్ పేపర్ సెట్-3 లీక్ అయినట్లు తన దృష్టికి వచ్చినట్లు ఆర్ఐవో రవి తెలిపారు. అయితే అది ప్రస్తుత ప్రశ్నపత్రమా? గత ఏడాది పేపరా? అనేది పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రశ్నాపత్రాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కాగా ఇవాళ్టి ఇంటర్ పరీక్షకు సెట్-1 ప్రశ్నాపత్రాన్ని అధికారులు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ప్రశ్నాపత్రం ఓ ప్రయివేట్ కళాశాల నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్రామీణ విద్యార్థులే తెలివైన వారు : ఆర్ఐఓ
లేపాక్షి : పట్టణ ప్రాంత విద్యార్థుల కన్నా గ్రామీణ ప్రాంత విద్యార్థులే తెలివైనవారని వైఎస్సార్ జిల్లా ఆర్ఐఓ రవి అన్నారు. ఆయన గురువారం ఉదయం లేపాక్షి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. అక్కడ వసతి, తరగతి గదులు, సిలబస్ తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివినప్పుడే లక్ష్యాన్ని సాధించగలుగుతారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంటర్ స్థాయిలోనే లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఇన్చార్జి ప్రిన్సిపల్ మురళీమోహన్ ఉన్నారు.