రోబో రిపోర్టర్లు వచ్చేస్తున్నారు..!
లండన్: కేవలం ఒక్క నెలలో ఐదుగురు పాత్రికేయులు ఏకంగా 30,000 వార్తాకథనాలను రాయడం అసాధ్యం. ఐదుగురు రోబో రిపోర్టర్ల సాయంతో ఇది సాధ్యమేనంటోంది ఓ వార్తా సంస్థ. యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్‌లలో ప్రఖ్యాతిగాంచిన ‘ప్రెస్ అసోసియేషన్ (పీఏ)’ వార్తాసంస్థ ఈ పనికి శ్రీకారంచుట్టింది.
ఈ రోబో రిపోర్టర్లు స్థానిక ప్రభుత్వ సంస్థల వద్ద ఉండే సమాచారాన్ని క్రోడీకరించి ఆ సమాచారాన్ని ప్రచురణకు అనుగుణంగా వార్తలుగా, గ్రాఫ్స్‌గా మారుస్తాయి. ‘రిపోర్టర్స్ అండ్ డాటా అండ్ రోబోట్స్(రాడార్)’గా పిలిచే ఈ ప్రాజెక్టు కోసం పీఏ సంస్థ ‘ఉర్బ్స్ మీడియా’తో చేతులు కలిపింది. డిజిటల్ పాత్రికేయరంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ అందిస్తున్న రూ.5. 17కోట్ల గ్రాంటు ను సైతం ఈ ప్రాజెక్టు గెలుచుకుంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.