రూ.10 లక్షలు పరిహారం చెల్లించండి
‘మానవ కవచం’పై హెచ్ఆర్సీ
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ‘మానవ కవచం’ ఘటనపై విచారణ జరిపిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) బాధి తుడికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవా రం ఆదేశాలు జారీ చేసింది. కొంత కాలం క్రితం రాష్ట్రంలో అల్లర్లు జరిగిన సమయం లో ఫరూఖ్ అహ్మద్ దార్‌ను మేజర్ లీతుల్ గొగొయ్ తన జీపు బానెట్‌పై కట్టి మానవ కవచంగా వినియోగించుకున్న విషయం తెలిసిందే.
అయితే దీనిపై విచారణ జరిపిన మానవ హక్కుల కమిషన్ బాధితుడికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫరూఖ్‌కు పరిహారం చెల్లించాలన్న ఆదేశాలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఖండించారు. ‘రాళ్లు విసిరేవాళ్లకు పరిహా రం ఇచ్చే సమస్యేలేదు’ అని ఆయన అన్నారు.