ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ వ్యాధి రాదు!!
న్యూయార్క్: ఇష్టం లేకుండా వధూవరులు పెళ్లి చేసుకుంటే వరుడికి తొందరగా డయాబెటిస్ రాదని ఒక వేళ వచ్చినా వెంటనే చికిత్సకు స్పందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. భార్యలు ఎక్కువగా భర్తల ఆరోగ్యస్థితులపై ప్రభావం చూపుతుంటారనీ తెలిపారు. ఇద్దరికి ఇష్టం లేకపోవడం వల్ల భర్తలకు భార్యల నుంచి ఒత్తిడి తగ్గడంతో ఆరోగ్యపరమైన విషయాల్లో మగాళ్లకు కాస్తంత విశ్రాంతి ఉంటుందని వివరించారు.
ఈ పరిశోధన కుటుంబసభ్యులు పెళ్లిళ్లలకు సంబంధించిన విషయాలను చర్చించుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. తరచూ డాక్టర్ పర్యవేక్షణ అవసరమయ్యే డయాబెటిస్ వంటి వ్యాధులు భార్యల ఒత్తళ్ల వల్ల భర్తలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. 1,228మంది వివాహిత జంటల మీద అయిదేళ్ల పాటు జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయని అన్నారు. 57 నుంచి 85 ఏళ్ల వయసు గల వీరందరిలో పరిశోధన పూర్తయ్యే లోపు 389 భర్తలకు డయాబెటిస్ వచ్చినట్లు వివరించారు. ఆశ్చర్యకరంగా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వరులకు డయాబెటిస్ బాధ తప్పినట్లు చెప్పారు. అదే ఇష్టపడి పెళ్లిచేసుకున్న భార్యలకు అయిదేళ్ల తర్వాత డయాబెటిక్ బాధ తప్పినట్లు వివరించారు. మంచి వ్యక్తిగత సాంగత్యం వల్ల మహిళల ఆరోగ్యస్థితి బాగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.