హెల్త్ పాలసీ నిబంధనలు... ముందే తెలుసుకుంటే మేలు
కుటుంబ ఆరోగ్య సంరక్షణకు హెల్త్ ఇన్సూరెన్స్ అత్యంత ముఖ్యం. ఆరోగ్య బీమా నుంచి అత్యుత్తమ ప్రయోజనాలు పొందాలంటే పాలసీలోని నిబంధనలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే, క్లెయిమ్‌ను పరిష్కరించుకునే సమయుంలోనే ఆరోగ్య బీమా పాలసీ అసలు విలువ మనకు బోధపడుతుంది. పాలసీ నిబంధనలను పాటించలేదంటూ బీమా కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరించిన సందర్భాలున్నాయి. పాలసీ నిబంధనలు, క్లాజులను ఆకళింపు చేసుకుని, అమలు చేస్తే క్లెయిమ్ పరిష్కార సమయుంలో ఇబ్బందులు తలెత్తవు.
వెయిటింగ్ పీరియుడ్: మీరు తీసుకోదలచిన పాలసీలోని వెయిటింగ్ పీరియుడ్ను పరిశీలించండి. పాలసీ తీసుకున్న కొంతకాలం వరకు క్లెయిమ్‌లను బీమా కంపెనీలు పరిష్కరించలేవు. దీన్నే వెయిటింగ్ పీరియుడ్ అంటారు. సాధారణంగా, ఓ పాలసీ కొన్న తొలి 30 రోజుల్లో ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు మినహా ఎలాంటి క్లెయిమ్లకూ చెల్లింపులు ఉండవు. ఈ వ్యవధినే ‘కూలింగ్ పీరియుడ్’గా పేర్కొంటారు. అన్ని కంపెనీల కూలింగ్ పీరియుడ్ ఒకేలా ఉండదు. వ్యవధి ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు. ఒకటి రెండేళ్ల వెయిటింగ్ పీరియుడ్ తర్వాత కవర్ చేసే కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. వీటిని మినహాయింపులు’గా వ్యవహరిస్తారు.
ముందునుంచే ఉండే వ్యాధి: పాలసీదారునికి ఏదైనా వ్యాధి ఉంటే బీమా దరఖాస్తు సమయుంలో వెల్లడించాలి. సాధారణంగా మొదటి నాలుగేళ్ల పాటు ఇలాంటి వ్యాధులను కవర్ చేయువు.
మినహాయింపులు: పాలసీ నుంచి మినహాయించిన వ్యాధుల గురించి కూడా ఖాతాదారులు తెలుసుకోవాలి. కాస్మెటిక్ సర్జరీ, అబార్షన్, గర్భధారణకు తీసుకునే చికిత్స, డయూగ్నొస్టిక్ చార్జీలు వంటివి సాధారణంగా కవరేజీలో ఉండవు. భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే వీటి గురించి కూడా తెలుసుకోవాలి.
సబ్లిమిట్: కొన్ని రకాల అంశాలకు సంబంధించి బీవూ కంపెనీలు చెల్లించే గరిష్ట పరిమితిని సబ్లిమిట్ అంటారు. గది అద్దె, శస్త్రచికిత్సల వ్యయూలపై సబ్లిమిట్ ఉంటుంది. శుక్లం శస్త్రచికిత్సకు ఓ పాలసీలో రూ.20 వేలు సబ్లిమిట్గా ఉండవచ్చు. అంటే, ఖర్చు ఎంతైనప్పటికీ బీమా కంపెనీ రూ.20 వేలు మాత్రమే చెల్లిస్తుంది.
కో-పే: ఆరోగ్య సంరక్షణకు అయ్యే ఖర్చులో బీమా కంపెనీ, బీమా చేయించుకున్న వ్యక్తి ఎంతెంత భరించాలనే వివరణ కో-పేలో ఉంటుంది. ఆసుపత్రిలో చికిత్స పొందినపుడు సంబంధిత పాలసీదారు కొంత శాతం ఖర్చును భరించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇది 10-25% వరకు ఉంటుంది.
డిడక్టిబుల్స్: పలు ఆరోగ్య బీమా పాలసీల్లో డిడక్టిబుల్ క్లాజు ఉంటుంది. బీవూ కంపెనీ బ్యాలెన్స్ అవంటును చెల్లించడానికి ముందే పాలసీదారు చెల్లించాల్సిన మొత్తాన్ని డిడక్టిబుల్ అంటారు. చాలా పాలసీల్లో ఇది ఐచ్ఛికంగా ఉంటుంది. అంటే మీకు ఇష్టమైతేనే తీసుకోవాలి. ఎంత చెల్లించాలనే అంశాన్ని కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. ఈ తరహా ఖాతాదారుల నుంచి బీమా కంపెనీలు తక్కువ ప్రీమియుం వసూలు చేస్తుంటారు.
సంజయ్ దత్తా
చీఫ్ - అండర్‌రైటింగ్ అండ్ క్లెరుుమ్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్