పాఠశాలల నిర్వహణ ఇలా....
ఒంగోలు వన్‌టౌన్: విద్యాహక్కు చట్టం ప్రకారం మారిన పాఠశాలల పని వేళలను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు సూచిస్తూ ఎస్‌సీఈఆర్‌టి డెరైక్టర్ ఎంఎస్ఎస్ లక్ష్మీవాట్స్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రాథమిక పాఠశాలలకు: ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.45 గంటల వరకు పని చేయాలి. పాఠశాలల్లో మొదటి గంట ఉదయం 9 గంటలకు, రెండో గంట 9.05కు, పాఠశాల అసెంబ్లీ 9.05 నుంచి 9.15 వరకు నిర్వహించాలి.
మొదటి పీరియడ్‌ను 9.15 నుంచి 10 గంటలకు వరకు, రెండో పీరియడ్‌ను 10 నుంచి 10.40 వరకు, అనంతరం 10 నిమిషాలు విరామం ఇవ్వాలి. మూడో పీరియడ్‌ను 10.50 నుంచి 11.30 గంటల వరకు, నాల్గవ పీరియడ్‌ను 11.30 నుంచి 12.10 వరకు నిర్వహించాలి. 12.10 నుంచి 1 గంట వరకు భోజన విరామ సమయం. ఐదో పీరియడ్‌ను 1 గంట నుంచి 1.40 వరకు, ఆరో పీరియడ్‌ను 1.40 నుంచి 2.20 వరకు అనంతరం 10 నిమిషాలు విరామం ఇవ్వాలి. ఏడో పీరియడ్‌ను 2.30 నుంచి 3.10 వరకు, ఎనిమిదో పీరియడ్‌ను 3.10 నుంచి 3.45 గంటల వరకు నిర్వహించాలని ఎస్‌సీఈఆర్‌టి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రాథమికోన్నత పాఠశాలలకు: ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు పని చేయాలి. పాఠశాలల్లో మొదటి గంట ఉదయం 9 గంటలకు, రెండో గంట 9.05కు, పాఠశాల అసెంబ్లీ 9.05 నుంచి 9.15 వరకు నిర్వహించాలి. మొదటి పీరియడ్‌ను 9.15 నుంచి 10 గంటలకు వరకు, రెండో పీరియడ్‌ను 10 నుంచి 10.40 వరకు, అనంతరం 10 నిమిషాలు విరామం ఇవ్వాలి. మూడో పీరియడ్‌ను 10.50 నుంచి 11.30 గంటల వరకు, నాల్గవ పీరియడ్‌ను 11.30 నుంచి 12.10 వరకు నిర్వహించాలి. 12.10 నుంచి 1 గంట వరకు భోజన విరామ సమయం. ఐదో పీరియడ్‌ను 1 గంట నుంచి 1.40 వరకు, ఆరో పీరియడ్‌ను 1.40 నుంచి 2.20 వరకు అనంతరం 10 నిమిషాలు విరామం ఇవ్వాలి. ఏడో పీరియడ్‌ను 2.30 నుంచి 3.10 వరకు, ఎనిమిదో పీరియడ్‌ను 3.10 నుంచి 3.45 గంటల వరకు, తొమ్మిదో పీరియడ్ 3.45 నుంచి 4.10 వరకు నిర్వహించాలి.
ఉన్నత పాఠశాలలకు: ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పని చేయాలి. పాఠశాలల్లో మొదటి గంట ఉదయం 9.30 గంటలకు, రెండో గంట 9.35కు, పాఠశాల అసెంబ్లీ 9.35 నుంచి 9.45 వరకు నిర్వహించాలి. మొదటి పీరియడ్‌ను 9.45 నుంచి 10.30 గంటలకు వరకు, రెండో పీరియడ్‌ను 10.30 నుంచి 11.10 వరకు, మూడో పీరియడ్‌ను 11.10 నుంచి 11.50 గంటల వరకు, అనంతరం 10 నిమిషాలు విరామం, నాల్గవ పీరియడ్‌ను 12 నుంచి 12.35 వరకు నిర్వహించాలి. ఐదో పీరియడ్‌ను 12.35 గంట నుంచి 1.10 వరకు, 1.10 నుంచి 2 గంట వరకు భోజన విరామ సమయం, ఆరో పీరియడ్‌ను 2 నుంచి 2.40 వరకు, ఏడో పీరియడ్‌ను 2.40 నుంచి 3.20 వరకు, అనంతరం 10 నిమిషాలు విరామం, ఎనిమిదో పీరియడ్‌ను 3.30 నుంచి 4.10 గంటల వరకు, తొమ్మిదో పీరియడ్ 4.10 నుంచి 4.45 వరకు నిర్వహించాలి.