september 11th
-
నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
-
నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఒకటో తేదీ (నేటి) నుంచి ఆరో తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను, 2 నుంచి 6వ తేదీ వరకు బీటెక్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 660 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 8,58,273 మంది హాజరుకానున్నారు. ఇక రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌లో 27 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 67,319 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. హాల్‌టికెట్‌లో పేర్కొన్న పరీక్ష ప్రారంభ సమయం కంటే అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేయనున్నారు. తర్వాత వచ్చే వారిని అనుమతించరు. మధ్యాహ్నం పరీక్షకు కూడా ఇదే నిబంధన వర్తించనుంది. విద్యార్థులు తమ వెంట హాల్‌టికెట్‌తోపాటు ఏదేని గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని ఎన్టీఏ సూచించింది. ఇక పరీక్షలకు మహారాష్ట్ర నుంచి అత్యధికంగా విద్యార్థులు హాజరుకానున్నారు. ఆ తరువాత స్థానంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఈ పరీక్షల ఫలితాలను ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. దీంతో 12వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లను ఐఐటీ ఢిల్లీ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 27న జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించిన ఐఐటీ ఢిల్లీ వాటి ఫలితాలను అక్టోబర్ 5న ప్రకటిస్తామని తాజాగా వెల్లడించింది. మరోవైపు ఐఐటీల్లో బీఆర్క్, బీప్లానింగ్‌లో ప్రవేశాల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టును (ఏఏటీ) అక్టోబర్ 8న నిర్వహిస్తామని, 11న ఫలితాలు వెల్లడిస్తామని వివరించింది. మొత్తానికి ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను అక్టోబర్ 6 నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. (ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా!) -
నేడు ఏపీసెట్
ఎస్కేయూ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్– 2016 ను ఆదివారం నిర్వహించనున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ ఆచార్య భాస్కర్ తెలిపారు. అనంతపురం నగరం, ఎస్కేయూలో మొత్తం 16 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతపురం రీజియన్‌లో మొత్తం 9,900 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నట్లు వివరించారు. హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఏదేని గుర్తింపు కార్డును తమ వెంట తీసుకరావాలని సూచించారు. -
11న పద్మశాలి వివాహ పరిచయ వేదిక
చిట్టినగర్ : పద్మశాలి వ««దlూవరుల పరిచయ వేదికను 11వ తేదీ బెంజ్ సర్కిల్ సమీపంలోని ఎస్వీఎస్ కళ్యాణ వేదికలో నిర్వహిస్తున్నామని పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రం శ్రీరామమూర్తి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. -
సెప్టెంబర్ 11న ఎంసెట్-3
► రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ► కన్వీనర్‌గా జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్య ► సెప్టెంబర్ 20 నాటికల్లా ర్యాంకులు! ► ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్నవారందరికీ అవకాశం ► పాత హాల్టికెట్లతోనే పరీక్షకు అనుమతి ► ఎంసెట్ కమిటీ భేటీ తర్వాత మార్గదర్శకాలపై స్పష్టత ► సీఎం ఆదేశంతో అధికారులతో భేటీ అయిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చేనెల 11వ తేదీన ఎంసెట్-3 పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షను నిర్వహిస్తామని ప్రకటించింది. పేపర్ లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-2ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం.. ఎంసెట్-3 నిర్వహణ తేదీని కూడా వెల్లడించింది. జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్యను ఎంసెట్-3 కన్వీనర్‌గా నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో జేఎన్టీయూహెచ్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య, ఇతర అధికారులు సమావేశమై పరీక్ష తేదీని నిర్ణయించారు. ఎంసెట్ కమిటీ సమావేశం తర్వాత ర్యాంకుల వెల్లడి తేదీని, ఇతర మార్గదర్శకాలను విడుదల చేయాలని నిర్ణయించారు. వీలైతే వచ్చేనెల 20 నాటికి ర్యాంకులను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల 5 లేదా 6 తేదీల్లో ఎంసెట్ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ముచ్చటగా మూడోసారి.. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం రాష్ట్రంలో మూడోసారి(ఏపీ ఎంసెట్ కాకుండా) ఎంసెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత మే 15న ఎంసెట్-1 నిర్వహించారు. అయితే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్) కారణంగా అది ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత నీట్‌పై కేంద్రం ఆర్డినెన్స్ తేవడంతో మళ్లీ మెడికల్ సీట్లలో ప్రవేశాల కోసం జూలై 9న ఎంసెట్-2 నిర్వహించారు. తీరా లీకేజీ కారణంగా ఎంసెట్-2 రద్దు చేయడంతో ఇప్పుడు మూడోసారి పరీక్ష రాయాల్సి వస్తోంది. 56,153 మందికి అవకాశం ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న 56,153 మంది విద్యార్థులకు ఎంసెట్-3 పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు. ఎంసెట్-2కు తెలంగాణతోపాటు ఏపీకి చెందిన మొత్తం 56,153 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 50,961 మంది పరీక్షకు హాజరుకాగా.. 47,644 మంది అర్హత సాధించి, ర్యాంకులు పొందారు. ప్రస్తుతం ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ పాత హాల్‌టికెట్లతో ఎంసెట్-3కి హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు. వారంతా వెబ్సైట్ నుంచి మళ్లీ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఆన్లైన్ లేకుండానే పరీక్ష ఎంసెట్-2 మాదిరి ఎంసెట్-3ని ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించే అవకాశం ఉంది. ఎంసెట్-1లో మెడికల్ ఎంసెట్ పరీక్షను హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ నిర్వహించారు. అయితే ఎంసెట్-2 పరీక్షను మాత్రం ఆఫ్‌లైన్‌లోనే నిర్ణయించారు. ఇప్పుడు ఎంసెట్-3ని కూడా ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఓఎంఆర్ జవాబు పత్రాల కార్బన్‌లెస్ కాపీ కూడా ఇచ్చే అవకాశం లేదు. దీనిపై ఎంసెట్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. విద్యార్థుల బయోమెట్రిక్ డాటాను మాత్రం సేకరించనున్నారు. క్వశ్చన్ బ్యాంకు ఏర్పాటు, ప్రశ్నపత్రాల రూపకల్పన, ముద్రణ తదితర అంశాల్లో పక్కాగా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. -
'ఈ నెల11న సమైక్యాంధ్ర అడ్వకేట్స్ మానవహారం'
ఈ నెల 11న సమైక్యాంధ్ర అడ్వకేట్స్ ఆధ్వర్యంలో మళ్లీ మానవహారం నిర్వహిస్తామని సమైక్యాంధ్ర అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ సీవీ మోహన్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. అందుకు సహకరించాలని ఆయన తెలంగాణ అడ్వకేట్స్ను కోరారు. సమైక్యాంధ్ర కోరుతున్న అడ్వకేట్స్ అందరితో ఈ నెల 28న ఓ సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం మానవహారానికి సిద్దమైన సీమాంధ్ర అడ్వకేట్స్పై తెలంగాణ లాయర్ల దాడిని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. అందుకు నిరసనగా మంగళవారం హైకోర్టు ఆవరణలో సీమాంధ్ర అడ్వకేట్స్ బైటాయించి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. హైకోర్టులో తెలంగాణ అడ్వకేట్స్‌కు అనుకూలంగా పోలీసులు వ్యవహారిస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను విజయవంతం చేసినందుకు ఏపీఎన్జీవోలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అనంతపురంలో ఈ నెల 14న అడ్వకేట్ జేఏసీ ప్రకటించిన నిరసన కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాదులు సంఘీభావం తెలుపుతున్నట్లు సీవీ మోహన్‌రెడ్డి ప్రకటించారు.