దిలావర్పూర్లో హిందూవాహిని సమావేశం
నూతన కార్యవర్గం ఏర్పాటు, గ్రామంలో ర్యాలీ
దిలావర్పూర్ : మండల కేంద్రంలో హిందూవాహిని ఆధ్వర్యంలో ప్రత్యేక ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హిందూవాహిణి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, ప్రచార కర్త విశాల్, జిల్లా అధ్యక్షుడు హరీశ్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు.
దిలావర్పూర్ నూతన కమిటీ అధ్యక్షడిగా వీరాచారి, ఉపాధ్యక్షుడిగా వెల్మల అశోక్, పాల్దె మనీశ్, ప్రధాన కార్యదర్శిగా గోపు రాకేశ్, గోరక్షక్ ప్రముఖ్‌గా కొప్పుల రమేశ్, సహ ప్రముఖ్‌గా కోడె కృష్ణ, లవ్‌జిహాద్ ప్రముఖ్‌గా రాజకిషన్, సహ ప్రముఖ్‌గా నిమ్మల అజయ్, శారీరక్ ప్రముఖ్‌గా ఆకుల రంజిత్, కార్యదర్శులుగా ఆలూర్ రమణ, పసుల రాంచందర్, దాత్రిక రాజ్‌కుమార్, సాయిప్రసాద్, కోడె నరేశ్‌లను ఎన్నుకున్నారు. ఇందులో బీజేపీ మండలాధ్యక్షుడు పీసరి శైలేశ్వర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.