అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలి
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని సామాజిక హక్కుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సమావేశాన్ని నిర్వహించారు. వేదిక కన్వీనర్ జగదీష్‌తోపాటు స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగ భర్తీలో రిజర్వేషన్ పాటించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, సీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతులకు, చేనేతలకు కరువు పెన్షన్ మంజూరు చేయాలన్నారు.ఈ సందర్భంగా శాంతియుత ప్రజా సభ పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు సాలార్ బాష, నూర్ మహ్మద్, నదీమ్ అహ్మద్, శ్రీరాములు, నాగభూషణం, మధు మాదిగ, డాక్టర్ మైనుద్దీన్, యుగంధర్, ఓబయ్య, జాఫర్, రఘురామయ్య, మల్లికార్జున, చక్రధర్, శ్రీరాములు, లింగమయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.