శ్రీకూర్మం జంక్షన్లో తాబేలు విగ్రహం
గార: శ్రీకూర్మనాథుని ప్రతిరూపమైన తాబేలు రూపాన్ని శ్రీకూర్మం జంక్షన్లో అమర్చే పనులు చివరిదశకు చేరుకున్నాయి. దూర ప్రాంత భక్తులకు శ్రీకూర్మం జంక్షన్లో ఆలయానికి సంబంధించిన ఎటువంటి నిర్మాణాలు లేకపోవడంతో గార వరకు వెళ్లిపోయిన సందర్భాలు కోకొల్లలు. దీనిపై భక్తులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి. జంక్షన్లో గతంలో నిర్మించి వదిలేసిన ముఖద్వారం అసంపూర్తిగా ఉండిపోవడంతో దీనిని విజయవాడకు చెందిన భక్తుడు కూర్మనాథ అవతార ఘట్టాన్ని వివరించేలా నిర్మించేందుకు ముందుకు రావడంతో పనులు చేపట్టారు. ముఖద్వారం పనులు పూర్తి కావచ్చాయి. అలాగే, రూ.లక్ష ప్రభుత్వ నిధులతో తాబేలు రూపాన్ని నిర్మిస్తున్నామని దేవాదాయ శాఖ ఏసీ శ్యామలాదేవి తెలిపారు.