పోర్ట్ ల్యాండ్‌లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో 2వ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోర్టు ల్యాండ్ చాప్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చాప్టర్ ఛైర్ శ్రీనీ అనుమందల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకలకు వచ్చిన వారందరికి శ్రీనీ అనుమందల తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనీ మాట్లాడుతూ..పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ చేపట్టిన జై కిసాన్, వికలాంగులకు మెడికల్ క్యాంపులు వంటి సేవా కార్యక్రమాల గురించి వివరించారు. టీడీఎఫ్ ప్రెసిడెంట్ విష్ణు కలవల స్కైప్ ద్వారా మాట్లాడుతూ..పోర్టు ల్యాండ్ టీం చేస్తున్న పలు సేవాకార్యక్రమాలని కొనియాడారు.