state bundh
-
19న తెలంగాణ బంద్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు పట్టు వీడటం లేదు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకుంది. సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా కార్యాచరణను ప్రకటించాయి. ఈ నెల 19న ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష పార్టీలు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా వంటా వార్పు కార్యక్రమం, 14న ఆర్టీసీ డిపోల ఎదుట బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న విద్యార్థుల ర్యాలీలు, 17న ధూందాం కార్యక్రమాలు, 18న బైక్ ర్యాలీలు చేపట్టాలని ఐకాస నిర్ణయించింది. -
ఉధృతంగా ఉక్కు పోరు
సాక్షి ప్రతినిధి, కడప/ప్రొద్దుటూరు టౌన్: వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధన దిశగా ఉధృత పోరుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమయ్యింది. ఈ మేరకు ఈనెల 29న అఖిలపక్షంతో కలిపి రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉక్కు పరిశ్రమ సాధనకు కార్యాచరణ సిద్ధం చేసేందుకు ప్రొద్దుటూరులో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్వగృ హంలో గురువారం జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో సజ్జల సమావేశం అయ్యా రు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 23న కడపలో భారీ ఎత్తున ధర్నా, 24న బద్వేలు, 25న రాజంపేటల్లో ధర్నాలు చేస్తామని తెలిపారు. జమ్మలమడుగులో 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మహాదీక్ష చేపడుతున్నామని చెప్పారు. అఖిలపక్షంతో కలిసి 27న రహదారుల దిగ్బంధం, 29న రాష్ట్ర బంద్ చేస్తామన్నారు. ఇక్కడ చేసే ప్రతి ఉద్యమం ఢిల్లీలో వినపడేలా చేస్తామన్నారు. ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకుంది టీడీపీనే.. ‘‘టీడీపీది స్వార్థ రాజకీయం...దుర్మార్గపు ఆలోచన.. ఆ నాడు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుని, నేడు ఆమరణ దీక్ష చేస్తున్నారు. నాలుగేళ్లుగా అధికారంలో ఉంటూ ఏనాడు ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తని టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమ స్థాపించాలని 48 గంటలు నిరాహార దీక్ష చేసిన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరవింపజేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ మొక్కవోని దీక్షతో అన్ని పార్టీలను కలుపుకొని పోరాటాలు చేస్తోందన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నిరాహార దీక్ష కూడా పోరాటంలో ఒక దశ అన్నారు. పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత వైఎస్సార్సీపీ తీసుకుంటుందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీపై పేటెంట్ హక్కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. కడపలో ఉక్కుపరిశ్రమ అనే ఆలోచన ఎవ్వరూ చేయని సమయంలోనే దానికి వాస్తవ రూపం ఇచ్చే ప్రయత్నం వైఎస్ చేశారని తెలిపారు. ఆ కర్మాగారాన్ని స్వార్థపూరిత రాజకీయాలతో, దుర్మార్గపు ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ అడ్డుకుందన్నారు. వైఎస్ మరికొద్దికాలం బతికున్నా ఈ సమయానికి ఉక్కు పరిశ్రమ రన్నింగ్‌లో ఉండేదన్నారు. దాదాపు లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి దక్కేదని తెలిపారు. టీడీపీ డ్రామాలను ప్రజలు చూస్తున్నారు.. విభజన చట్టంలో పొందుపర్చిన ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీడీపీ పట్టించుకోలేదని సజ్జల అన్నారు. ఇప్పుడు టీడీపీ తామే చాంపియన్లమని చెప్పుకోవడానికి తాపత్రయ పడటం విడ్డూరమన్నారు. ఈ జిల్లా వాసులకు ఎవరు ఏమి చేశారు, ఎవరి హయాంలో అభివృద్ధి పనులు చేపట్టారన్నది తెలుసునన్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి గండికొట్టి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎవరు నమ్ముతారని, టీడీపీ డ్రామాలు అందరూ గ్రహిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక కేంద్రం మెడలు వంచి స్టీల్ ఫ్యాక్టరీని వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఉక్కు పరిశ్రమ పనులు 2019లో మొదలై 2020–21 కల్లా ఫ్యాక్టరీలో ఉత్పత్తి మొదలవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎస్బి అంజాద్‌బాషా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, అమరనాథరెడ్డి, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేల్ సమన్వయకర్తలు, అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. మా ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధం: రాచమల్లు ఉక్కు పరిశ్రమ సాధన కోసం వైఎస్సార్ జిల్లాకు చెందిన తమ ఎమ్మెల్యేలు ఏడుగురు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసేందుకు సిద్ధమేనా? అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సవాల్ విసిరారు. గురువారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పుట్టపర్తి సెంటర్లో తాను చేపట్టిన 48గంటల దీక్ష విరమణ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేశారన్నారు. అందులో జిల్లాకు చెందిన వైఎస్ అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారన్నారు. జిల్లాలో 9మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు అమ్ముడుబోగా వైఎస్సార్సీపీలో ఏడుగురు ఉన్నారని తెలిపారు. టీడీపీ వద్ద ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిపి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, దొంగదీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్ ఉన్నారన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్షం ఈ 13 మందితో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసేందుకు సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. తొలిగా సంతకం చేసేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పదవుల ద్వారా వచ్చే విలువ, గౌరవం కంటే జిల్లా బిడ్డల భవిష్యత్తే తమకు ముఖ్యమన్నారు. రాజీనామాకు ఎంపీ సీఎం రమేశ్ సిద్ధమా? అని ప్రశ్నించారు. అఖిలపక్షం తీసుకోబోయే ఏ నిర్ణయానికైనా కట్టుబడి పనిచేస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వెనుకబడింది వైఎస్సార్ జిల్లానేనని తెలిపారు. ఇలాంటి జిల్లాపై ప్రధాని మోదీకి ఎందుకు అంత పగ అని ప్రశ్నించారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. 25 మంది ఎంపీలను తనకు ఇస్తే ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్ సాధిస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు ఆయన వద్ద 19మంది ఎంపీలను పెట్టుకుని ఏమీ చేశారని ప్రశ్నించారు. 25మంది ఎంపీలను వైఎస్ జగన్‌కు ఇస్తే ఇవన్నీ సాధిస్తారన్నారు. ఇవి రాకపోతే తామంతా రాజకీయాలు వదిలేస్తామన్నారు. -
బంద్ పిలుపును అపహాస్యం చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బంద్ ద్వారా ప్రజల ఆకాంక్షను తెలియజేసి, ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ పక్షాలు చేస్తున్న ప్రయత్నాలను సీఎం చంద్రబాబు అపహాస్యం చేయడం దురదృష్టకరం, హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రజల ఆకాంక్షను కాలరాసేలా బంద్‌లను విఫలం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 16న రాష్ట్రబంద్ పాటించాలని వైఎస్సార్సీపీ, వామపక్షాలు, జనసేన, ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపును తప్పుపట్టడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ‘‘పార్లమెంట్‌ను నడపడంలో విఫలమైన ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై నెపం వేసేందుకు దీక్ష చేశారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ నెల 16న జరిగే బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాలి. తాను తలచుకుంటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాహనాలు కదలవని చంద్రబాబు అనడం నియంతృత్వ ధోరణికి నిదర్శనం. ’’ అని అంబటి పేర్కొన్నారు. -
16న రాష్ట్ర బంద్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా పార్లమెంట్లో కేంద్రం అనుసరించిన వైఖరికి నిరసనగా ఈనెల 16న రాష్ట్ర బంద్ పాటించాలని హోదా, విభజన హామీల సాధన సమితి పిలుపునిచ్చింది. బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. సీపీఎం, సీపీఐలతోపాటు జనసేన కూడా మద్దతు తెలిపాయి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని ఐదుకోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలపాలని సాధన సమితి అధ్యక్షుడు చల సాని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. విభజన హామీల అమలుపై కేంద్ర తీరుకు నిరసనగా గురువారం విజయవాడ లెనిన్ సెంటర్లో నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లుగా పోరాటం: ప్రత్యేక హోదా సాధనకోసం నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేతృత్వంలో పలు రూపాల్లో పోరాటం చేస్తున్నామని పార్టీ బందరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఏపీ భవన్లో నిరాహార దీక్షలు సైతం చేశారన్నారు. -
బంద్ సంపూర్ణం
ప్రత్యేక హోదా సాధన కోసం యావత్ ఆంధ్రావని స్తంభించిపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో విద్యార్థులు, యువకులు కదం తొక్కారు. ‘ప్రత్యేక హోదాయే మా భవిష్యత్’ అని నినదించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు, మహిళలు ఇలా.. అన్ని వర్గాల ప్రజలు తమ ఆశ.. శ్వాస ప్రత్యేక హోదాయే అని ముక్తకంఠంతో చాటి చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో 13 జిల్లాల్లోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రత్యేక హోదా కోసం స్తంభించిన ఏపీ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో బంద్ ≈ హోదా ఆకాంక్షను దృఢంగా చాటిన ప్రజలు ≈ వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజాసంఘాల సంఘీభావం ≈ రాష్ర్టవ్యాప్తంగా వేలాది మంది నాయకుల అరెస్టు ≈ సాయంత్రం వరకు నిర్బంధంలోనే వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు ≈ పలుచోట్ల లాఠీచార్జీ.. వందలాదిమందికి గాయాలు ≈ తిరుపతిలో పోలీసుల దాష్టీకం ≈ మహిళల పుస్తెలు తెంపి.. చీరలు చింపిన ఖాకీలు హోదా కోసం స్తంభించిన ఆంధ్రావని సాక్షి, నెట్వర్క్: ప్రత్యేక హోదా సాధన కోసం యావత్ ఆంధ్రావని స్తంభించిపోయింది. కనీవిని ఎరుగని రీతిలో విద్యార్థులు, యువకులు కదం తొక్కారు. ‘ప్రత్యేక హోదాయే మా భవిష్యత్’ అని నినదించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు, మహిళలు ఇలా.. అన్ని వర్గాల ప్రజలు తమ ఆశ.. శ్వాస ప్రత్యేక హోదాయే అని ముక్తకంఠంతో చాటి చెప్పారు. ప్రత్యేక హోదా వస్తేనే నిరుద్యోగ సమస్య తీరిపోయి తమ బిడ్డల భవిష్యత్ బాగుంటుందని, తమ జీవితాలు బాగుపడతాయంటూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుతో 13 జిల్లాల్లోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది. బంద్‌ను విఫలం చేయడం కోసం ప్రభుత్వం పోలీసులను ప్రయోగించినా... అరెస్టులకు, లాఠీచార్జిలకు దిగినా వెరవకుండా మొక్కవోని దీక్షతో అన్నివర్గాల ప్రజలు ఒక్కతాటిపై నిలబడి జయప్రదం చేశారు. బంద్‌ను విచ్ఛిన్నం చేయడానికి అధికారపార్టీ సాగించిన కుట్రలను ప్రతిపక్షాలు తిప్పికొట్టాయి. పోలీసులు తెల్లవారుఝాము నుంచే వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లలో నిర్బంధించారు. విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. షాపులను స్వచ్ఛందంగా మూసేయడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. బస్సులు రోడ్లెక్కలేదు. బలవంతంగా షాపులను తెరిపించడానికి, బస్సులను తిప్పడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రత్యేకహోదా సాధన కోసం కేంద్రంతో పోరాటం ఒక్కటే సరిపోదని... రాష్ర్టంలోని తెలుగుదేశం ప్రభుత్వ నిర్బంధాన్నీ తట్టుకుని ఉద్యమించాల్సి ఉందని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. అరెస్టులు, లాఠీచార్జిలు.. రాష్ర్టంలోని 13 జిల్లాల్లోనూ ఆందోళనకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నించారు. పోలీసుల సాయంతో బస్సులను తిరిగేలా చేయాలని, తద్వారా బంద్ విఫలమైందని చూపాలని అధికారపార్టీ నాయకులు ప్రయత్నించారు. బంద్ పిలుపులో భాగంగా శాంతియుతంగా రాస్తారోకోలు, ధర్నాలు, బైఠాయింపులు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్టీ ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులపై దాడిచేశారు. ముఖ్యనేతలందరినీ అరెస్టు చేయడంపైనే పోలీసులు దృష్టిపెట్టారు. నాయకుల అరెస్టులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కార్యకర్తలపై పోలీసులు విచక్షణా రహితంగా లాఠీలు ఝళిపించారు. అనేక చోట్ల పోలీసుల తీరుకు నిరసనగా కార్యకర్తలు పోలీస్స్టేషన్ల వెలుపల బైఠాయించారు. జిల్లాకు వెయ్యిమంది పైనే అరెస్టులు జరిగినట్లు సమాచారం. అనేక జిల్లాల్లో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ, వామపక్షాల నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు మోపారు. స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు మునుపెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో అనేక చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పలుచోట్ల యువజన, విద్యార్థి సంఘాలకు చెందిన యువకులు బైక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. విజయవాడ బస్టాండులో వైఎస్సార్సీపీ నాయకులు గాంధీగిరి పద్ధతిలో ప్రయాణీకులకు పూలు పంపిణీ చేశారు. అన్నిజిల్లాల్లోనూ కిరాణా, ఫ్యాన్సీ, రెడీమేడ్ దుస్తుల దుకాణాలను సైతం మధ్యాహ్నం వరకు బంద్ పాటించారు. తిరుపతిలో పోలీసుల ఓవరాక్షన్ బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ మహిళా నాయకులు, కార్యకర్తలపై తిరుపతి పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. మహిళలన్న ఆలోచన లేకుండా ఈడ్చివేశారు. ఈ క్రమంలో శాంతారెడ్డి అనే మహిళ మంగళసూత్రం తెగి కిందపడగా, మరో నలుగురు మహిళా కార్యకర్తల చీరలు చిరిగాయి. పోలీసులు బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో మహిళల మోచేతులకు గాయాలయ్యాయి. తిరుపతిలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూర్ణకుంభం సర్కిల్ దగ్గర మానవహారం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోన్న వీరిపై ఉదయం 7.30 గంటలకు ఒక్కసారిగా పోలీసులు విరుచుకు పడి అరెస్టులు చేయడం ప్రారంభించారు.ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించిన పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చినపుడు అక్కడున్న సుమారు 10 మంది మహిళా నాయకులు అడ్డు పడ్డారు. భూమన అరెస్టు కాకుండా రక్షణగా నిలబడ్డారు, దీంతో రెచ్చిపోయిన పోలీసులు ఒకరిద్దరు మహిళా కానిస్టేబుళ్లతో కలిసి అక్కడున్న మహిళా కార్యకర్తలు, నాయకురాండ్రపై విరుచుకుపడ్డారు. మహిళల పట్ల పోలీసుల వైఖరికి నిరసనగా బుధవారం తిరుపతి సబ్‌కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడానికి పార్టీ మహిళా విభాగం నిర్ణయించింది. పోలీస్‌స్టేషన్‌లో కొనసాగుతున్న సీపీఐ నేతల నిరసన ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయించిన ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం రాత్రి కూడా పోలీస్ ఠాణాలోనే సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ నిరసనను కొనసాగిస్తున్నారు. విజయవాడ లెనిన్ సెంటర్లో మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభించిన రామకృష్ణ బృందాన్ని పోలీసులు అరెస్టు చేసి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్బంధించిన పోలీసులు అటుతరువాత వెల్లిపోవాలని చెప్పడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాష్ట్రం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని, అప్పటి వరకు పోలీస్ ఠాణా విడిచివెళ్లేది లేదని భీష్మించారు. -
చంద్రబాబుపై ప్రజల్లో వెల్లువెత్తిన నిరసన
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన బంద్ విజయవంతమైంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు అన్ని జిల్లాల్లోనూ ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ముడిపడి ఉన్నందున ప్రత్యేక హోదా ఆకాంక్షను ప్రజలు బంద్ ను విజయవంతం చేయడం ద్వారా స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు వీధుల్లోకి వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ నినదించారు. వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, మహిళలు పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఉదయం నుంచే ప్రజలు గుంపులుగా వీధుల్లోకి వచ్చి బంద్ లో పాల్గొన్నారు. ప్రతి పట్టణంలోనూ తమదైన శైలిలో నిరసనలు వ్యక్తం చేశారు. (మరిన్ని ఫోటోల కోసం..) బంద్ ను విఫలం చేయడానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను ఉపయోగించి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయించింది. ఇళ్లల్లోంచి బయటకు వస్తూనే కొందరు నేతలను అరెస్టులు చేసి సాయంత్రం వరకు వదిలిపెట్టలేదు. బస్సు డిపోల వద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించి బస్సులు నడపడానికి శతవిధాలా ప్రయత్నాలు చేశారు. రోడ్లపై యువకులు, విద్యార్థులు, పార్టీ శ్రేణులు నిర్వహించే భారీ ర్యాలీలను పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించలేమని కేంద్రం స్పష్టం చేయగా దాన్ని సాధించుకోవాలన్న డిమాండ్ కోసం బంద్ పాటిస్తుండగా, ఆ బంద్ ను నీరుగార్చాలని అధికార తెలుగుదేశం పార్టీ ప్రయత్నించడం పట్ల అనేక చోట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లు ఉండటంతో పోలీసుల మాత్రం పలు చోట్ల మహిళలని కూడా చూడకుండా చితకబాదారు. వేలాది మందిని అరెస్టులు చేసి నిర్భంధించారు. ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రజలు పెద్దఎత్తున స్పంధించి బంద్ ను విజయవంతం చేసిన పరిణామం అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. ప్రత్యేక హోదా డిమాండ్ కోసం ఒకరు పోరాటం చేస్తుంటే దానికి మద్దతునివ్వకపోగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించి తప్పు చేశామని పలువురు నేతలు ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. టీడీపీ చర్యల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు బంద్ ను విజయవంతం చేయడం పట్ల రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడేది లేదని నొక్కి చెప్పారు. ఈరోజు ఉదయం నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల రాత్రి అయ్యే వరకు కూడా పోలీసులు విడిచిపెట్టలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే రోడ్లపైకి పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద భారీ సంఖ్యలో పోలీసులను, సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించారు. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే అరెస్టుల పర్వం మొదలైంది. కార్యకర్తలను చెదరగొట్టడానికి అనేక చోట్ల లాఠీ ఛార్జీలు చేశారు. బంద్ జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షించారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుంటూ అవసరమైన మేరకు అధికారులకు ఆదేశారు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని భావిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలు స్పచ్చంధంగా ముందుకొచ్చి బంద్ ను విజయవంతం చేయడంపై ముఖ్యమంత్రి అధికారులపై మండిపడినట్టు తెలిసింది. బంద్ జరగకుండా నిరోధించే విషయంలో ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయాలంటూ ఎమ్మెల్యేలను పురమాయించారు. దాంతో చేసేది లేక ప్రత్యేక హోదా కల్పించాలని తామూ కోరుతున్నామని చెప్పడానికి టీడీపీ నేతలు పలు చోట్ల చీపుర్లు చేతబట్టి రోడ్లు ఊడ్చుతూ నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు అక్కడక్కడ కనిపించాయి. -
28న రాష్ట్ర బంద్‌కు పిలుపు
ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈనెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ పాటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి జరగబోతున్నాయని, దానికి మూడు రోజుల ముందు రాష్ట్రమంతా బంద్ పాటించాలని ఆయన కోరారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని.. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, తెలుగు దేశం పార్టీలను గట్టిగా నిలదీయాలని అన్నారు.