'షూటింగ్ పేరుతో దుస్తులు విప్పించారు'
మళయాళ దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు
ముందుగా స్క్రిప్టులో చెప్పలేదని ఆవేదన
తిరువనంతపురం
మళయాళ దర్శకుడు స్నేహజిత్పై ఒక హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దైవం సాక్షి అనే సినిమా షూటింగ్ సందర్భంగా మొత్తం యూనిట్ అంతా చూస్తుండగా తన దుస్తులు విప్పించినందుకు ఆమె ఈ ఫిర్యాదు చేసింది. కేరళలోని తొడుపుళ అనే ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ముందుగా అసలు ఇలాంటి సీన్ ఉన్నట్లు తనకు చెప్పలేదని, స్క్రిప్టులో కూడా ఎక్కడా అలా లేదని హీరోయిన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ముందుగా తొడుపుళ పోలీసు స్టేషన్లోని మహిళా విభాగంలో ఈ కేసు నమోదు చేశారు. తర్వాత కలియార్ పోలీసులు కేసు నమోదు చేశారు.