ఉత్తరాల బట్వాడా ఇక వేగవంతం
పోస్ట్ బాక్స్ క్లియరెన్స్‌కు మెయిల్ మోటార్ సర్వీసెస్ ప్రారంభం
నగరంలో పదిరూట్లలో 431 పోస్ట్బాక్స్ల ఎంపిక
చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్
సిటీబ్యూరో: జంటనగరాల్లో ఉత్తరాల బట్వాడా ఇక వేగవంతంగా జరుగుతుందని, పోస్టుబాక్స్‌ల సత్వర క్లియరెన్స్ కోసం మెయిల్ మోటార్ సర్వీస్ వాహనాలు అందుబాటులోకి తెస్తున్నామని ఏపీ, టీజీ ఉమ్మడి సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ అన్నారు. బుధవారం అబిడ్స్‌లోని డాక్‌సదన్‌లో ప్రత్యేకంగా రూపొందించిన మెయిల్ మోటర్ సర్వీస్ వాహనాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జంటనగరాల్లోని మొత్తం760 పోస్టు బాక్స్‌లు ఉండగా, అందులో మెయిల్ మోటార్ సర్వీసెస్ ద్వారా మెకనైజ్డ్ క్లియరెన్స్ కోసం 431 పోస్ట్బాక్స్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రతిరోజు మూడు పోస్టల్ డివిజన్లోని పదిరూట్లలో మెయిల్ మోటర్ వాహనాలు తిరుగుతూ పోస్టు బాక్స్‌లను క్లియరెన్స్ చేసి స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చడం జరుగుతుందని వివరించారు. ప్రతిరోజు ఈ బాక్స్‌లకు 25 వేలకు పైగా ఉత్తరాల తాకిడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సేవల ద్వారా ఉత్తరాల క్లియరెన్స్‌కు సమయం వృధా కాకుండా సత్వర బట్వాడాకు దోహదపడుతుందన్నారు.
నగరంలో సాధ్యమైనంత వరకు రెండుమూడు రోజుల్లో ఉత్తరాల బట్వాడా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నగరంలో స్పీడ్పోస్ట్కు మంచి స్పందన ఉందని తెలిపారు. ఏపీ,టీజీ ఉమ్మడి సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ తెలిపారు..ఉమ్మడి రాష్ట్రాల్లో ఒకనెలలో మొత్తం 10.27లక్షల వస్తువులు బుక్ కాగా కేవలం హైదరాబాద్ నగరంలో 5.81 లక్షల వస్తువుల బుకింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ జనరల్ (బీఆడీ) సంధ్యారాణి, డెరైక్టర్ పోస్టల్ అకౌంట్స్ డెరైక్టర్ రాఘవేంద్ర శ్యామ్, మెయిల్ మోటర్ సర్వీసెస్ మేనేజర్ ఆర్షద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.