Sugar cane farmer
-
Sugarcane FRP Increased: చెరుకు రైతులకు గుడ్‌న్యూస్
-
తీపి కబురు
చెరకు రైతుకు టన్నుకు రూ.2600 చెరకు ఫ్యాక్టరీల అంగీకారం త్వరలోనే క్రషింగ్ షురూ పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడి మెదక్: చెరకు రైతుకు టన్నుకు రూ.2600 చెల్లించడానికి ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలు అంగీకరించాయి. త్వరలో క్రషింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడించారు. గురువారం ఆమె హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ఛాంబర్లో గణపతి ఖండసార ఫ్యాక్టరీ (సంగారెడ్డి), గాయత్రి కర్మాగారం (కామారెడ్డి), మాగి ఫ్యాక్టరీ (నిజాంసాగర్) యాజమాన్యాలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది మాదిరే ఈసారీ చెరుకు రైతులకు టన్నుకు రూ.2600 చొప్పున చెల్లించాలని యాజమాన్యాలకు సూచించామని సమావేశానంతరం పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పారు. రవాణా చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. చెరకు పంట పూర్తయ్యే వరకు క్రషింగ్ నడుస్తుందని ఆమె భరోసానిచ్చారు. -
చెరకు రైతుకు తీపి కబురు...
* టన్ను చెరకుకు రూ.2,600 ఇచ్చేందుకు సీఎం సముఖత * సర్కార్ తరఫున రూ.340 రైతు ఖాతాల్లో జమ * డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడి * ఆనందంలో రైతన్నలు మెదక్: ధరాఘాతంతో విలవిల్లాడుతున్న చెరకు రైతుకు తీపి కబురు అందింది. చెరకుకు గిట్టుబాటు కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ను కలిసిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి బర్త్‌డే గిఫ్ట్ దొరికింది. టన్ను చెరకుకు రూ.2,600 చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, ఈ మేరకు రెండు రోజుల్లో జీఓ వెలువడుతుందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతులకు ఈ సంవత్సరం ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ.2,260 లు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే గత ఏడాది రూ.2600 చెల్లించిన యాజమాన్యం ఈసారి రూ.360లు తగ్గించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో సోమవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, చెరకు రైతు నాయకులతో సీఎంను కలిసి రైతుల బాధలు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రాష్ట్ర ప్రభుత్వం తరఫున టన్ను చెరకుకు రూ.340 రైతుల ఖాతాల్లో జమచేస్తామని హామీ ఇచ్చినట్లు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో జీఓ వెలువడుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఎన్డీఎస్ఎల్ పరిధిలోని చెరకు రైతులను చెరకు సాగు అవగాహన నిమిత్తం మహారాష్ట్ర పంపేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు. మహారాష్ట్రలో చెరకు రైతులు ఎకరాకు 80 నుంచి 100 టన్నుల చెరకును పండిస్తున్నందున వారి వ్యవసాయ విధానాన్ని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్డీఎస్ఎల్ మంభోజిపల్లి పరిధిలో ఈ సంవత్సరం 1.20 లక్షల టన్నుల చెరుకు గానుగ ఆడనుంది. సీఎం తాజా హామీతో సుమారు 2,590 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. నాకిది బర్త్‌డే గిఫ్ట్ చెరకు రైతు కష్టాలు తీర్చాలని సీఎం కలిశాను. మంగళవారం నా జన్మదినం. చెరకు రైతుకు మేలు జరిగేలా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఒకరోజు ముందుగానే నాకు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణ సర్కార్ రైతుల కోసం ఎంతటి వ్యయ ప్రయాసలైనా భరిస్తుందని ఆ సంఘటనతో మరోసారి తేలిపోయింది. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని ఎన్డీఎస్ఎల్ పరిధిలో గల మూడు ఫ్యాక్టరీల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. -పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ -
ఎస్వీ షుగర్స్‌లో క్రషింగ్.. చిత్తూరులో పెండింగ్
* నేటి నుంచి శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమలో క్రషింగ్.. * చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్‌పై నీలినీడలు * 30న ఎండీలతో సీఎం కీలక సమావేశం.. * బకాయిల చెల్లింపుపై నిర్ణయం తీసుకోకపోతే సహకార పరిశ్రమలకు కష్టకాలమే సాక్షి ప్రతినిధి, తిరుపతి: చెరకు రైతుకు ఒకింత తీపి కబురు.. మరింత చేదువార్త..! క్రషింగ్కూ రికవరీకి ముడిపెట్టి డిసెం బర్ 25 తర్వాతే సహకార చక్కెర పరిశ్రమల్లో క్రషింగ్ ప్రారంభించాలన్న ఉత్తర్వులను ప్రభుత్వం సడలించింది. రేణిగుం ట మండలం గాజులమండ్యంలోని శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమ(ఎస్వీ షుగర్స్)లో గురువారం క్రషింగ్ ప్రా రంభించనున్నారు. కానీ.. చిత్తూరు సహకార చక్కెర పరిశ్రమ(చిత్తూరు షుగర్స్)లో మాత్రం క్రషింగ్‌కు ప్రభుత్వం అనుమతించలేదు. రెండేళ్ల నుంచి బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఎస్వీ షుగర్స్‌కు చెరకును సరఫరా చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ నెల 30న సహకార చక్కెర పరిశ్రమల మేనేజింగ్ డెరైక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో బకాయిలను చెల్లించే లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సహకార పరిశ్రమలకు.. రైతులకూ ప్రయోజనం. లేదంటే ఇరు వర్గాలకూ కష్టకాలమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జిల్లాలో 87,004 హెక్టార్లలో చెరకు పంటనుసాగుచేశారు. హెక్టారుకు కనిష్ఠంగా 80 టన్నుల చొప్పున 69.6 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో మూడు ప్రైవేటు, రెండు సహకార చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. ప్రైవేటు చక్కెర పరిశ్రమల్లో అక్టోబర్ నాలుగో వారం నుంచే క్రషింగ్‌ను ప్రారంభించారు. సహకార చక్కెర పరిశ్రమల్లో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ.. డిసెంబర్ 25 తర్వాత క్రషింగ్ చేస్తే రికవరీ పర్సంటేజీ అధికంగా ఉంటుందని, అప్పుడే క్రషింగ్ ప్రారంభించాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. కానీ.. 1.5 లక్షల టన్నుల చెరకు క్రషింగ్‌కు ఎస్వీ షుగర్స్, 50 వేల టన్నుల క్రషింగ్‌కు చిత్తూరు షుగర్స్ రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. డిసెంబర్ 25 వరకూ క్రషింగ్ ప్రారంభించకపోతే.. ప్రైవేటు ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో చెరకును కొనుగోలు చేస్తాయని సహకార ప్యాక్టరీల యాజమాన్యాలు ప్రభుత్వానికి నివేదించాయి. దాంతో ఎస్వీ షుగర్స్‌లో క్రషింగ్‌కు ప్రభుత్వం అనుమతించింది. కానీ.. చిత్తూరు షుగర్స్‌లో క్రషింగ్‌కు అనుమతించలేదు. మద్దతు ధరపై మీనవేషాలు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో టన్ను చెరకుకు ఆయా ప్రభుత్వాలు రూ.2,650ను మద్దతు ధరగా ప్రకటించాయి. మన రాష్ట్రంలో ఇప్పటిదాకా చెరకు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించలేదు. ఎస్వీ షుగర్స్ యాజమాన్యం టన్ను చెరకును కనిష్ఠంగా రూ.1,450 నుంచి గరిష్ఠంగా రూ.1,550 వరకూ ఖరీదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. చెరకు రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తే.. ధరను పెంచాలని భావిస్తోంది. ఇదే అదునుగా తీసుకున్న ప్రైవేటు చక్కెర పరిశ్రమలు చెరకు రైతును లూటీ చేస్తున్నాయి. టన్ను చెరకు కనిష్ఠంగా రూ.1,850 నుంచి రూ.1,950 వరకూ ఖరీదు చేస్తూ చెరకు రైతును నట్టేట ముంచుతున్నాయి. గతేడాది కేన్ కమిషనర్ బెన్హర్ ఎక్కా ప్రతిపాదనల మేరకు టన్ను చెరకు రూ.2,650ను మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లిస్తేనే మనుగడ.. 2012-13, 2013-14 క్రషింగ్ సీజన్లో టన్ను చెరకుకు ప్రభుత్వం రూ.2,100ను మద్దతు ధరగా ప్రకటించింది. సహకార చక్కెర పరిశ్రమలు రైతులకు టన్ను రూ.1800 చెల్లించగా. రూ.300ను ప్రభుత్వం చెల్లించేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. కానీ.. ప్రభుత్వం తాను చెల్లిస్తానన్న రూ.300 రెండేళ్లుగా రైతులకు చెల్లించలేదు. గత రెండేళ్లకు గాను ఎస్వీ షుగర్స్‌కు చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.62 కోట్లు, చిత్తూరు షుగర్స్‌కు సరఫరా చేసిన రైతులకు రూ.8.5 కోట్ల మేర బకాయిపడింది. బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ రైతులు ఉద్యమిస్తున్నారు. ఈ ఏడాది క్రషింగ్ సజావుగా సాగకపోతే సహకార ఫ్యాక్టరీలకు మనుగడ ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహకార పరిశ్రమలను తెగనమ్మడానికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో బకాయిల చెల్లింపుపై ఈనెల 30న సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. -
నేటి నుంచి ‘ట్రైడెంట్’లో క్రషింగ్ ప్రారంభం
జహీరాబాద్: జహీరాబాద్ సమీపంలోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో గురువారం నుంచి క్రషింగ్ ప్రారంభించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. దీంతో రైతులు చెరకు ఉత్పత్తులను క్రషింగ్ నిమిత్తం కర్మాగారానికి తరలిస్తున్నారు. బుధవారం పలువురు రైతులు చెరకు పంటను ట్రాక్టర్లలో కర్మాగారానికి తరలించారు. చెరకు ధరను పెంచక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది చెల్లించిన ధరకంటే ఎక్కువ ధర చెల్లించే అవకాశమే లేదని ఇప్పటికే కర్మాగారం ప్రతినిధులు ప్రకటించారని రైతులు వాపోతున్నారు. చక్కెరకు మార్కెట్లో ఏ మాత్రం డిమాండ్ లేనందున గత ఏడాది చెల్లించిన విధంగానే ప్రస్తు క్రషింగ్ సీజన్లో కూడా టన్నుకు రూ.2,600ల మేర చెల్లిస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడుల వ్యయం రెట్టింపైనందున టన్ను చెరకు ధరను రూ.3,500లు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం మెట్టు దిగడం లేదు. ఇది రైతులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. భారీగా చెరకు సాగు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జహీరాబాద్ జోన్ పరిధిలో చెరకు పంట అధికంగానే సాగులో ఉంది. ప్రస్తుతం జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం పరిధిలో 24వేల ఎకరాల మేర చెరకు పంట సాగులో ఉంది. అయినా ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నందున దిగుబడులు బాగా పడిపోయే అవకాశం ఉంది. గత సంవత్సరం ఎకరాకు 24 టన్నుల సగటు దిగుబడి రాగా, ఈ సంవత్సరం 19 టన్నులకు పడిపోయే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. పెట్టుబడుల వ్యయం మాత్రం అధికమైందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది మాదిరిగానే ధరను చెల్లించాలని యాజ మాన్యం నిర్ణయించడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చెరకు కోత, రవాణా సబ్సిడీలను అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
చెరకు చేదే
నారాయణఖేడ్ రూరల్: చెరకు రైతులకు ప్రతీఏడు చేదు పరిస్థితులే మిగులుతున్నాయి. తాము పండించిన పంటకు సరైన గిట్టుబాటుకు విక్రయించుకొనే పరిస్థితి చెరుకు రైతుకు లేకుండా పోతుంది. యాజమాన్యాలు నిర్ణయించిన ధరకే రైతులు పంటను అమ్మాల్సిన పరిస్థితి. ప్రతీ ఏడు పంటసాగుకు తీవ్ర ఇబ్బందులు, పెట్టుబడులు పెరిగిపోవడం పరిపాటిగా మారుతున్నా పంట విక్రయించే సరికి మద్దతు ధర లభించడంలేదు. రెండు మూడేళ్ళుగా ఒకే ధర ఉండడం రైతులకు ఆశనీపాతంగా మారుతోంది. ఈ ఏడు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు తోడు విపరీతమైన కరెంటు కోతలు. ఫలితం సాగుచేసిన చెరకు పంటకు సరిపడా నీరందడం లేదు. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. కానీ చెరకుకు మాత్రం గత ఏడాది ఇచ్చిన ధరనే ఇస్తామని కర్మాగార యాజమాన్యం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈనెల 9న క్రషింగ్‌ను ప్రారంభించింది. రైతులు టన్నుకు రూ.3,500ల చొప్పున ధర చెల్లించాలని కోరుతున్నా యాజమాన్యం మాత్రం రూ.2,600లు చెల్లిస్తామని ప్రకటించింది. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలు నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగి వద్ద ఉన్న గాయత్రి షుగర్స్ పరిధిలోకి వస్తారు. కష్టానికి దక్కని ఫలితం మాగి గాయత్రి షుగర్స్ కర్మాగారం పరిధిలో మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు, కల్హేర్, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, కంగ్టి మండలాలు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, మద్నూర్, బిచ్కుందు మండలాల నుంచి చెరకు అగ్రిమెంట్ అయింది. ఈ కర్మాగారంలో కేవలం నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోనే 12వేల ఎకరాల విస్తీర్ణంలో చెరకు కర్మాగారానికి వెళ్తుంది. అంటే సాగైన చెరకులో 90 శాతం ఈ కర్మాగారానికే అగ్రిమెంట్ అయింది. నిజామాబాద్ జిల్లాలో కేవలం 3,500ల ఎకరాలలోపే చెరకు కర్మాగారానికి తరలుతుంది. కర్మాగారం నిర్ణయించిన ధర ప్రకారం ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు పేర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు రైతులు పేర్కొంటున్నారు. అందునా పె ట్టుబడులు కూడా అధికమయ్యాయని అంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో చెరకు సాగుకు రూ.60 వేల నుంచి రూ.80వేల వరకు ఖర్చవుతున్నట్లు తెలిపారు. దిగుబడులు మాత్రం 20 నుంచి 30 టన్నుల లోపే వస్తుందని తెలిపారు. ఈ లెక్కన కర్మాగారం ద్వారా టన్నుకు రూ.2,600ల చొప్పున చెల్లిస్తే కనీస పెట్టుబడే దక్కుతుందని రైతులు అంటున్నారు. రూ.3,500లు చెల్లించిన పక్షంలో తమకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఇది ఏడాది పంట కావడంతో యాజమాన్యం చెల్లించే ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదని, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈ పెట్టుబడులను కూడా అప్పులు చేసి సాగు చేసినట్లు పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతానికి.. నేటికీ భిన్నత్వం చెరకు సాగులో గతంలో లాభసాటిగా ఉండగా రాను రాను చెరకు సాగు రైతులకు గుదిబండలా మారుతుంది. కర్మాగారాలు ప్రైవేట్ పరం కావడం ఈ దుస్థితికి కారణమని రైతులు పేర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వం రంగంలో చెరకు కర్మాగారాలు ఉన్నపుడు కేంద్ర ప్రభుత్వం ఎస్ఎంపీ ధర ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రోత్సాహకాలను అందించేదని రైతులు పేర్కొం టున్నారు. దీంతో ప్రైవేట్ కంపెనీలూ ఇదే ధరను చెల్లించేవి. ఫలితంగా రైతులకు గిట్టుబాటయ్యేది. కర్మాగారాలు ప్రైవేట్ పరం కావడం రైతులకు ఇబ్బందికరంగా తయారయింది. ఫలితంగా రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలవైపు దృష్టిసారిస్తున్నారు. ప్రతీఏటా చెరకు రైతులకు ధర విషయంలో ఇబ్బందులే ఏర్పడుతున్నాయి. క్రషింగ్ ప్రారంభ సమయం దగ్గర పడుతుండడం, రైతులు గిట్టుబాటు ధర చెల్లించాలని విన్నవించడం పరిపాటిగా మారుతోంది. పెట్టుబడుల్ని దృష్టిలో పెట్టుకోవాలి మెదక్ రూరల్: నిజాం దక్కన్ షుగర్(ఎన్డీఎస్ఎల్) ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెరకు టన్ను ధర రూ. 3,500 చెల్లించాలి. రైతులు వరిని వదిలేసి చెరకు తోటలను కాపాడుకున్నారు. ప్రతి ఏడాది రసాయన ఎరువుల ధరలు పెరగడంతో పాటు కూలీల రేట్లు, రవాణా చార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. సాగుకు పె రుగుతున్న ఖర్చుల ను దృష్టిలో పెట్టుకొ ని గిట్టుబాటు ధర చెల్లించాలి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి రైతుల్ని ఆదుకోవాలి. క్రషింగ్‌ను సైతం సకాలంలో ప్రారంభించి రైతులు నష్టపోకుండా చొరవ చూపాలి. -టీపీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి -
చెరకు రైతు.. బతుకు బరువు
సాక్షి, సంగారెడ్డి: చెరకు రైతుకు మద్దతు ధర అందని ద్రాక్షగా మారింది. ఎప్పటిలాగే ఈ సారి కూడా క్రషింగ్ సీజన్ ప్రారంభం కాగానే రైతులు మద్దతు ధర కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని మూడు చెరకు ఫ్యాక్టరీలు పది రోజుల్లో క్రషింగ్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో మద్దతు ధరపై మరోమారు మెతుకుసీమ చెరకు రైతులు పోరుబాటకు సిద్ధపడుతున్నారు. కరెంటు కోతలు, వర్షాభావం పరిస్థితులను అధిగమించి పంట సాగు చేసిన తమకు టన్నుకు రూ.3,500 చెల్లించాల్సిందిగా రైతులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. జిల్లాలోని గణపతి షుగర్స్, ట్రైడెంట్ షుగర్స్, నిజాం దక్కన్ షుగర్స్ పరిశ్రమలు మాత్రం రైతులు అడిగినంతగా ధర చెల్లించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇటీవల సంగారెడ్డి మండలం ఫసల్వాది సమీపంలోని గణపతి షుగర్స్ యాజమాన్యంతో మద్దతు ధరపై చెరకు రైతులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మిగతా రెండు పరిశ్రమల పరిధిలోని రైతులు సైతం రూ.3,500 చెల్లించాలని కోరుతున్నారు. మద్దతు ధర ఖరారు కానప్పటికీ గణపతి షుగర్స్ ఈనెల 13న, ట్రైడెంట్ షుగర్స్ ఈనెల మూడోవారంలో, నిజాం దక్కన్ షుగర్స్ వచ్చేనెల క్రషింగ్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలు, రైతు సంఘాలు, చెరకు రైతులతో సోమ లేదా మంగళవారాల్లో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మద్దతు ధరపైనే ఆశలు జిల్లాలో సుమారు 22 వేల మంది చెరకు రైతులు 18 వేల హెక్టార్లలో చెరకు పంటలను సాగు చేశారు. ఫసల్వాదిలోని గణపతి షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో 7,200 హెక్టార్లు, జహీరాబాద్‌లోని ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో 9, 000 హెక్టార్లు, మెదక్‌లోని నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో 2,280 హెక్టార్లలో రైతులు చెరకుపంట వేశారు. జహీరాబాద్, న్యాల్కల్, పుల్కల్, పాపన్నపేట, ఝరాసంగం, అందోలు ప్రాంతాల్లో చెరకు సాగు అధికంగా ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ దఫా చెరకు సాగు వ్యయం పెరిగింది. దీనికితోడు ఖరీఫ్‌లో వర్షాభావం, కరెంటు కోతల కారణంగా చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికితోడు ఈసారి లద్దెపురుగు పంటను దెబ్బతీసింది. ఈ కారణాలతో చెరకు దిగుబడి ఈ దఫా 20 శాతానికిపైగా తగ్గనున్నట్లు అంచనా. ఇదిలావుంటే చెరకు కోతల ధరలు కూడా రెట్టింపయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని చెరకు రైతులు టన్ను రూ.3,500 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తాము తీవ్రంగా నష్టపోతామంటున్నారు. చక్కెర ధర తగ్గడం వల్లే? టన్నుకు చెరకు రూ.3,500 ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తుండగా, ఫ్యాక్టరీల యాజమాన్యాలు మాత్రం రూ.2,600 నుంచి రూ.2,800 వరకు చెల్లిస్తామంటున్నాయి. మార్కెట్లో చక్కెర ధర ఆశించిన స్థాయిలో లేకపోవటం, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ చక్కెరపై ఐదు శాతం వ్యాట్ విధించటం, రాష్ట్ర విభజన నేపథ్యంలో మొలాసిస్ సరఫరాపై టన్నుకు రూ.2,500 పన్ను విధించటం తదితర కారణాలతో మద్దతు ధర చెల్లింపు విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగే చర్చల్లో సమస్యలను విన్నవించి తమకు, రైతులకు నష్టం వాటిల్లకుండా మద్దతు ధర నిర్ణయించాలని పరిశ్రమల యాజమాన్యాలు భావిస్తున్నట్లు సమాచారం.