sugunakar Rao
-
సుగుణాకర్‌రావుకు బీజేపీ బీఫాం
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది పి.సుగుణాకర్‌రావును పార్టీ తరపున పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆయనకు బీఫాం కూడా అందజేసినట్లు ఆయ న వెల్లడించారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి బలమైన అభ్యర్థి సుగుణాకర్‌రావుతో పోటీ చేయిస్తున్నామన్నారు. విద్యావంతులు తమ మొదటి ప్రాధాన్య ఓటును సుగుణాకర్‌రావుకు వేసి గెలిపించాలని కోరారు. స్వతంత్రులుగా రణజిత్ మోహన్, రవి! బీజేపీ రాష్ట్ర నాయక త్వం మొదటి నుంచీ సుగుణాకర్‌రావును పోటీలో నిలపా లని శ్రద్ధ చూపుతున్న నేప థ్యంలో పార్టీనే నమ్ముకుని, ఉద్యోగాన్ని వదులుకుని పనిచేస్తున్న తనకు పార్టీ మద్దతు ఇవ్వాలని రణజిత్ మోహన్ పట్టుబట్టారు. ఎడ్ల రవి కూడా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ వర్గాలను కోరారు. రణజిత్‌మోహన్ ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కోసం పార్టీ వర్గాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నించారు. కానీ పార్టీ గురు వారం బీఫాంను సుగుణాకర్‌రావుకు ఇవ్వడం తో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రణజిత్‌మోహన్ ప్రకటించారు. మరోవైపు ఎడ్ల రవి కూడా బరిలో నిలిచే అవకాశముంది. -
దేశచరిత్ర తెలుసుకోవాలి
► కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు ► రెండోరోజుకు బీజేసీ జిల్లాస్థాయి శిక్షణ తరగతులు వేములవాడ : బీజేపీ శ్రేణులు మనదేశ చరిత్ర, వికాసం గురించి తెలుసుకోవాలని కిసాన్ మెర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు కోరారు. పట్టణం లో చేపట్టిన బీజేపీ జిల్లాస్థాయి శిక్షణ తరగతులు మంగళవారం రెండోరోజుకు చేరాయి. ఈసందర్భంగా శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఒ.శ్రీనివాస్‌రెడ్డి సైద్ధాంతిక భూమికపై వివరించారు. సంఘ్ విభాగ్ కార్యదర్శి ఒన్నా సత్యనారాయణరెడ్డి సాంస్కృతిక, జాతీయవాదంపై అవగాహన కల్పించారు. ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ దక్షిణమూర్తి ఏకత్వ మానవతావాదం, మార్గదర్శకాల గురించి బోధించారు. జిల్లాస్థాయి శిక్షణ తరగతులు ముగిసినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జంగం రాజేందర్, కార్యదర్శి పిన్నింటి హన్మండ్లు, మండల అధ్యక్షుడు బండ మల్లేశ్‌యాదవ్, నాయకులు రేగుల మల్లికార్జున్, కూరగాయల శ్రీశైలం, సీహెచ్‌వీ రమణారెడ్డి, ముద్రకోల దుర్గేశం, గూడూరి మధు, ముద్రకోల నర్సయ్య, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
'ఓట్లు-సీట్లు లక్ష్యంగా ఆహారభద్రత బిల్లు'
ఓట్లు - సీట్లు లక్ష్యంగా యూపీఏ సర్కార్ ఆహారభద్రత బిల్లు తెచ్చిందని బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు బుధవారం కరీంనగర్లో ఆరోపించారు. కాగా పేదలకు ఆహారాన్ని అందించడం ఆ బిల్లు వెనక ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని మాత్రం స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాని ఆహారధాన్యాలు పండించే రైతులకు లాభం కలిగించే విషయాన్ని మాత్రం కేంద్రం విస్మరించిందని వ్యాఖ్యానించారు. ఆహార భద్రత చట్టంపై ఉన్న పలు సందేహాలను నివృత్తి చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. జాతీయ వ్యవసాయ సిఫార్సులను అమలు చేయాలని ఈ సందర్భంగా సుగుణాకర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.