దేశచరిత్ర తెలుసుకోవాలి | To know the country's history | Sakshi
Sakshi News home page

దేశచరిత్ర తెలుసుకోవాలి

Published Wed, Jan 4 2017 11:13 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

దేశచరిత్ర తెలుసుకోవాలి - Sakshi

దేశచరిత్ర తెలుసుకోవాలి

►  కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన   కార్యదర్శి సుగుణాకర్‌రావు
► రెండోరోజుకు బీజేసీ జిల్లాస్థాయి శిక్షణ తరగతులు


వేములవాడ : బీజేపీ శ్రేణులు మనదేశ చరిత్ర, వికాసం గురించి తెలుసుకోవాలని కిసాన్ మెర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు కోరారు. పట్టణం లో చేపట్టిన బీజేపీ జిల్లాస్థాయి శిక్షణ తరగతులు మంగళవారం రెండోరోజుకు చేరాయి. ఈసందర్భంగా శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఒ.శ్రీనివాస్‌రెడ్డి సైద్ధాంతిక భూమికపై వివరించారు. సంఘ్‌ విభాగ్‌ కార్యదర్శి ఒన్నా సత్యనారాయణరెడ్డి సాంస్కృతిక,  జాతీయవాదంపై అవగాహన కల్పించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌ చాలక్‌ దక్షిణమూర్తి ఏకత్వ మానవతావాదం, మార్గదర్శకాల గురించి బోధించారు.

జిల్లాస్థాయి శిక్షణ తరగతులు ముగిసినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జంగం రాజేందర్, కార్యదర్శి పిన్నింటి హన్మండ్లు, మండల అధ్యక్షుడు బండ మల్లేశ్‌యాదవ్, నాయకులు రేగుల మల్లికార్జున్, కూరగాయల శ్రీశైలం, సీహెచ్‌వీ రమణారెడ్డి, ముద్రకోల దుర్గేశం, గూడూరి మధు, ముద్రకోల నర్సయ్య, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement