'ఓట్లు-సీట్లు లక్ష్యంగా ఆహారభద్రత బిల్లు' | Food security bill main targets votes and seats | Sakshi
Sakshi News home page

'ఓట్లు-సీట్లు లక్ష్యంగా ఆహారభద్రత బిల్లు'

Published Wed, Aug 21 2013 1:25 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

Food security bill main targets votes and seats

ఓట్లు - సీట్లు లక్ష్యంగా యూపీఏ సర్కార్ ఆహారభద్రత బిల్లు తెచ్చిందని బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు బుధవారం కరీంనగర్లో ఆరోపించారు. కాగా పేదలకు ఆహారాన్ని అందించడం ఆ బిల్లు వెనక ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని మాత్రం స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

 

కాని ఆహారధాన్యాలు పండించే రైతులకు లాభం కలిగించే విషయాన్ని మాత్రం కేంద్రం విస్మరించిందని వ్యాఖ్యానించారు. ఆహార భద్రత చట్టంపై ఉన్న పలు సందేహాలను నివృత్తి చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. జాతీయ వ్యవసాయ సిఫార్సులను అమలు చేయాలని ఈ సందర్భంగా సుగుణాకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement