Susaid note
-
భీమారంలో బావ, మరదలు..
భీమారం : గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని 55వ డివిజన్ భీమారంలో విషాదం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో బుధవార అర్ధరాత్రి బావ, మరదలు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే మరదలిని హత్య చేసి, బావ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం జిలుగులకు చెందిన తిరుపతిరెడ్డి–అరుణ దంపతులకు కూతుళ్లు ప్రతిభారెడ్డి, రక్షణారెడ్డితోపాటు మరో కుమారుడు ఉన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయకల్‌కు చెందిన రావుల రవీందర్‌రెడ్డి–రాజేశ్వరీ దంపతుల కుమారుడు ప్రవీణ్‌రెడ్డి(30)తో ప్రతిభారెడ్డికి మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. వారికి రెండేళ్ల కూతురు ఉంది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి భీమారంలో నివాసముంటున్నాడు. మరదలితో వివాహేతర సంబంధం.. ప్రతిభారెడ్డి సోదరి రక్షణారెడ్డి(23) చదువు నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రవేశం పొందింది. మూడేళ్లుగా అక్క ఇంట్లోనే ఉంటూ కళాశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో తన బావతో ఏర్పడిన సాన్నిహిత్యమే వివాహేతర సంబంధానికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. అయితే విషయం బయటికి పొక్కడంతో కుటుంబంలో గొడవలు జరిగాయి. దీంతో ఇరుకుటుంబాల పెద్దలు ఇద్దరిని మందలిం చినట్లు తెలిసింది. దీంతో రక్షణారెడ్డిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు.15 రోజులుగా రక్షణారెడ్డి ఇంటి నుంచి కాలేజీకి రాకపోకలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఉగాది పండుగకు ప్రతిభారెడ్డి తన తల్లిగారింటికి వెళ్లగా, ప్రవీణ్‌రెడ్డి ప్రస్తుతం హుజు రాబాద్‌లో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచే కళాశాలకు వెళ్తున్నాడు. భీమారం ఇంట్లో ఆత్మహత్య.. ఉదయం కళాశాలకని బయల్దేరిన రక్షణారెడ్డి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా కలవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రవీణ్‌రెడ్డికి ఫోన్ చేసినా నోరెస్పాన్స్ వచ్చింది. దీంతో అర్ధరాత్రి ప్రతిభారెడ్డి తన తండ్రి తిరుపతిరెడ్డి, సోదరుడితో కలిసి భీమారానికి బయల్దేరింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో కింది పోర్షన్లో వారిని నిద్ర లేపి తాళం చెవి ఇచ్చారా అని అడిగింది. వారు లేదనడంతో ఎలాగు రాత్రికి అక్కడే ఉండాలని భావించి రాయితో తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రక్షణారెడ్డి మంచంపై విగతజీవురాలై కనిపించింది. పక్కనే సీలింగ్ ఫ్యాన్ పడి ఉంది. ప్రవీణ్‌రెడ్డి బెడ్రూమ్ వెనక తలుపు తెరిచి అదే బెడ్ పక్కన పడి మృతి చెందాడు. ఘటనపై పోలీసుల దర్యాప్తు సీఐ సతీష్‌బాబు, ఎస్సై భీమేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు అక్కడే విధులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న హన్మకొండ ఏసీపీ రాజేంద్రప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐదు రోజుల క్రితమే సూసైడ్ నోట్ ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ప్రవీణ్‌రెడ్డి ఐదురోజుల క్రితమే సూసైడ్ నోట్ రాసి పెట్టుకున్నాడు. ఈ నోట్ పోలీసులకు చిక్కింది. తన భార్య మంచిదని అందులో పేర్కొన్నాడు. అత్తమామలు కూడా తనకు తల్లిదండ్రిలాంటి వారని రాశాడు. తన కూతురిని సాకే బాధ్యత తండ్రి తీసుకోవాలని పేర్కొన్నాడు. చెల్లిని చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు తన చెల్లిని చంపి, ప్రవీణ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య ప్రతిభారెడ్డి రోదిస్తూ తెలిపింది. బతికి ఉంటే ఎక్కడ చంపుతారనే భయంతో నిద్రమాత్రలు మింగాడని పేర్కొంది. మృతుడి భార్య ప్రతిభారెడ్డి -
‘కాల్‌మనీ’ కాటుకు బలి
అప్పుల బాధ తాళలేక వస్త్రవ్యాపారి ఆత్మహత్య రూ.6 లక్షలకు రూ.18 లక్షలు వడ్డీ కట్టానని సూసైడ్‌నోట్ ఇరగవరం/తణుకు/పెరవలి : కాల్‌మనీ కాటుకు మరో ప్రాణం బలైంది. అప్పులిచ్చిన వాళ్ల అధిక వడ్డీ వేధింపులు తాళలేక ఓ వస్త్ర వ్యాపారి మంగళవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పూనుకున్నారు. తన కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చారు. బాధితుని సూసైడ్‌నోట్, బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇరగవరం మండలం సూరంపూడి గ్రామానికి చెందిన దొడ్డిపట్ల ధనరాజు (31) తణుకులో రెడీమేడ్ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. టైలరింగ్ చేస్తూనే ఆయన వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారం నిమిత ్తం తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన మారిశెట్టి వెంకట్రావు, మారిశెట్టి శేషగిరి వద్ద రూ.3 లక్షలు, ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామానికి చెందిన మేడపాటి తాతిరెడ్డి వద్ద రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నారు. మారిశెట్టి వెంకట్రావు, మారిశెట్టి శేషగిరిలకు వడ్డీ నిమిత్తం ఇప్పటివరకు రూ. 8 లక్షలు, మేడపాటి తాతిరెడ్డికి వడ్డీ నిమిత్తం రూ.10 లక్షలు చెల్లించారు. వ్యాపారం బాగా లేకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. కాల్‌మనీ వల్ల అధిక వడ్డీల భారం పడింది. ఈ నేపథ్యంలోనే అప్పులు ఇచ్చిన వారు తీవ్రంగా ఒత్తిడి చేస్తుండడంతో ధనరాజు మనస్థాపానికి గురయ్యారు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద నుంచి తణుకు వచ్చిన ధనరాజు పురుగులమందు డబ్బా కొనుక్కుని పెరవలి మండలం తీపర్రు గోదావరి ఒడ్డుకు వెళ్లాడు. అక్కడ పురుగులమందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు అతని బంధువులకు సమాచారం అందించారు. బంధువులు వచ్చి ధనరాజును మోటారుసైకిల్‌పై తణుకు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధనరాజు ప్రాణాలు వదిలారు. దీంతో స్వగ్రామం సూరంపూడికి తీసుకెళ్లారు. ధనరాజు పంచాయతీ వార్డు సభ్యునిగా కూడా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే.. ఎస్పీల పేరిట సూసైడ్ నోట్ ధనరాజు ఆత్మహత్యకు పాల్పడే ముందు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌లకు ధనరాజు తన ఆవేదనను వెలిబుచ్చారు. తన భార్య నగలు అమ్మి అధిక వడ్డీలు కట్టానని, ఇకపై వడ్డీలు, అప్పు కట్టలేని పరిస్థితుల్లో అప్పు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తాళలేకే తాను చనిపోతున్నట్టు వివరించారు. తాను చేసిన అప్పులకు తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధమూ లేదని, తాను చనిపోవడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మృతుడు ధనరాజుకు భార్య చంద్రకళ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయిదేళ్ల క్రితం వివాహం చేసుకున్న ధనరాజు ప్రస్తుతం తణుకులో అనూషా డ్రస్ మెటీరియల్స్ పేరుతో వస్త్రదుకాణం నిర్వహిస్తూ ఇక్కడే ఫ్లాట్ అద్దెకు తీసుకుని కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. దీనిపై పెరవలి ఎస్ఐ పి.నాగరాజు కేసునమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.