చిత్రకళ అభివృద్ధి చెందాలి
విజయవాడ(మొగల్రాజపురం) : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో చిత్రకళా వికాసం జరగాల్సిన అవసరం ఉందని ప్రముఖ చిత్రకారుడు ‘పద్మశ్రీ’ ఎస్వీ రామారావు అన్నారు. ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతిలో మంగళవారం క్రియేటివ్lఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ‘నవ్యాంధ్రలో చిత్రకళా వికాసం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఎస్వీ రామారావు మాట్లాడారు. 12 మంది చిత్రకారులు గీసిన చిత్ర ప్రదర్శనను ఆయన సదస్సు అనంతరం ప్రారంభించి తిలకించారు. కార్యక్రమంలో చిత్రకారుడు సోమంచి విజయకుమార్, ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య సంఘ కార్యదర్శి బాలయోగి, క్రియేటివ్ అకాడమి అధ్యక్షులు టి.వెంకట్రావ్, ఎం.సి.దాసు, సుంకర చలపతిరావు, ఎన్.సాయిబాబు, కళాధర్ తదితరులు పాల్గొన్నారు.