సీఎం టెక్నికల్ హాల్ట్
మధురపూడి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చారు. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జరిగే ఏరువాక కార్యక్రమానికి వెళ్తూ, ఆయన కొద్దిసేపు ఇక్కడ టెక్నికల్ హాల్ట్ చేశారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన బాబు, ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో నర్సాపురం వెళ్లారు. రన్‌వే పై కొద్దిసేపు ఆయన జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు.
బాబుకు స్వాగతం పలకడానికి కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్, డీఐజీ రామకృష్ణ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారి, రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, డీఎస్పీ ప్రసన్నకుమార్, తహసీల్దార్ కె. పోసియ్య తదితరులు విమానాశ్రయానికి వచ్చారు. కార్యక్రమం అనంతరం చంద్రబాబు తిరిగి సాయంత్రం 4 గంటలకు ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్లారు. అధికారులు వర్షంలో తడుస్తూ సీఎం కోసం వేచి ఉండాల్సి వచ్చింది.