Telangana Transport Minister
-
రవాణా మంత్రి ఇలాకాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
హైదరాబాద్: బస్సు డ్యామేజి నష్టాన్ని డ్రైవర్లపై వేయడాన్ని నిరసిస్తూ తాండూరు బస్సు డిపో ఎదుట శుక్రవారం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సొంత ఇలాకా తాండురు బస్సు డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. ఆ విషయం తెలుసుకున్నమంత్రి మహేందర్‌రెడ్డి కార్మికులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తాండూరు ఆర్టీసీ డీఎంను మంత్రి ఆదేశించారు. దాంతో తాండూరు ఆర్టీసీ డీఎం సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చిస్తున్నారు. -
'ఆర్టీసీ విలీనంపై కేబినెట్లో చర్చిస్తా'
తెలంగాణలో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి మహీందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సచివాలయంలో మహీందర్ రెడ్డి రాష్ట్ర రవాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని బస్ డిపోలను ఆధునీకరిస్తామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కేబినెట్లో చర్చిస్తామని చెప్పారు. ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తాని వెల్లడించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే బస్సు ఛార్జీలు తక్కువుగా ఉన్నాయి మహీందర్ రెడ్డి గుర్తు చేశారు. అయినా ఆర్టీసీ ఛార్జీలు పెంచేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి మెరుగ్గా ఉందని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ల కొత్తకోట మండలం పాలెం సమీపంలో గతేడాది వోల్వో బస్సు అగ్నికి ఆహుతి అయిందిని... ఆటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మహీందర్ రెడ్డి భరోసా ఇచ్చారు.