కోనప్రాంత మహిళలకు యనమల క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
కోటనందూరు :
తొండంగి మండలంలో కోనప్రాంత మహిళలపై అమానుషంగా వ్యవహరిస్తున్న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. శుక్రవారం కోపరేటివ్ సొసైటీ ఆవరణలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. దివిస్ కంపెనీ ఏర్పాటుకు అన్నీ తానుగా మారి, 144 సెక్ష¯ŒS విధించడం, మహిళలని కూడా చూడకుండా పోలీసులతో వారిని భయబ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. గురువారం 40 మంది మహిళలపై కేసులు నమోదు చేసి, అన్నవరం పోలీస్‌స్టేçÙ¯ŒSలో నిర్బంధించడంపై మండిపడ్డారు. సమాజనంలో ఏ ప్రాంత ప్రజలు నీకు గెలుపునిచ్చారో ఆ ప్రాంత ప్రజల రుణం ఈవిధంగా తీర్చుకుంటున్నావా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా దివిస్ కంపెనీని వదిలి ప్రజల పక్షాన పోరాటం చేయాలని సూచించారు. తొండంగి మండలానికి గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ట్రిపుల్ ఐటీకి కనీసం 60 ఎకరాలు సేకరించకుండా కలెక్టర్‌తో కలిసి నాటకాలాడిన పెద్ద మనిషి దివిస్‌కు670 ఎకరాలను కేటాయించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దివిస్ కంపెనీ ఏర్పాటుతో అనేక అనర్థాలు ఉన్నాయని దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు తాను తమ పార్టీ తరపున పూర్తిస్థాయి మద్దతు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కంపెనీ ఏర్పాటుతో ఆంధ్రరాష్ట్రంలోనే అతిపెద్దదైన హేచరీ వ్యాపారం పూర్తిగా దెబ్బతిని వేలాది మంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేక హోదాపై పోరాడుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదాతో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న బుణాలకు 90శాతం రాయితీ లభిస్తుందని, ప్రభుత్వం ఈ అంశాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. ప్రత్యేక హోదాపై తమపార్టీ ప్రజల పక్షాన పూర్తిస్థాయి పోరాటం కొనసాగిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంటష్, పార్టీ మండలాధ్యక్షడు గొర్లి రామచంద్రరావు, పార్టీ ప్రతినిధులు గొర్లి అచ్చియ్యనాయుడు, లగుడు శ్రీను, లంక ప్రసాద్, కొరుప్రోలు కృష్ణ, గుడివాడ ఆదినారాయణ, అంకంరెడ్డి బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.