three children died
-
ఇంటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి
-
ముగ్గురు చిన్నారులను మింగిన గోడ
నాంపల్లి: ఇంటి మధ్య గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడిన సంఘటన గురువారం రాత్రి నగరంలోని హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అఫ్జల్‌సాగర్ మాన్గార్ బస్తీలో రోజు కూలితో పొట్టపోసుకునే మిఠాయి లాల్, సీమ దంపతులు తమకున్న ఆదాయ వనరులతో పునాదులు లేకుండా సిమెంట్ ఇటుకలతో చిన్న శ్లాబ్ ఇల్లు నిర్మించుకున్నారు. అదే ఇంట్లో గబ్బార్, సురేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. మిఠాయిలాల్, సీమలకు రోష్ని (4), లక్ష్మీ (5) పావని (రెండు నెలలు) సంతానంకాగా గబ్బార్, సురేఖలకు వరలక్ష్మి (5), గీత (3), ఆరోల (2) పిల్లలుఉన్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చిన తల్లిదండ్రులు బయట వీధిలోకి వెళ్లారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో గదిలోని వంట గది దిమ్మె వేడెక్కి గదికి మధ్యలో ఉన్న గోడపై పడింది. దీంతో ఆ గోడ ఒక్కసారిగా పిల్లలపై పడటంతో మిఠాయిలాల్ దంపతుల ముగ్గురు పిల్లలూ మరణించారు. అలాగే గబ్బార్ దంపతుల పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నిలోఫర్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. -
చిన్నారులను మింగిన వాగు
సాక్షి, రాజోళి (అలంపూర్): స్థానిక శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన ముగ్గురు స్నేహితులు ఆదివారం సెలవు రోజు కావడంతో సమీపంలోని పెద్దవాగు వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షానికి అందులో నీరు చేరింది. సమీపంలో ఉన్న కుంటలూ నిండాయి. ఆదివారం ఉదయం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారుల్లో కొందరు వెనక్కి రాగా.. శివయ్య (10), సాయి చరణ్ (9), యుగంధర్ (7) మధ్యాహ్నం 12 గంటలకు పెద్దవాగు వద్దే ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదని గ్రామంలో అంతటా వెతికారు. చివరకు రాత్రి పది గంటలకు వాగు వద్ద ఉన్న ముగ్గురు చిన్నారు చెప్పులను చూసి అనుమానం వచ్చిన స్థానికులు మత్య్సకారులతో గాలించారు. చివరికి మృతదేహాలు బురదలో ఇరుక్కుపోగా వాటిని బయటకు తీశారు. వారిని చూసిన కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. తల్లిదండ్రులు, స్థానికుల రోదనలతో ఆ ప్రాంతంలో నిండిపోయింది. ప్రతిరోజూ తమ మధ్యనే తిరుగుతూ, తమ పిల్లలతో కలిసి ఆడుకునే ముగ్గురు చిన్నారులు ఆకస్మికంగా మృత్యువాత పడటంతో గ్రామస్తులను కలిచి వేసింది. కడుపుకోత ఈ ఘటనలో మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మేమేమి పాపం చేశాం దేవుడా, వారి కి బదులు మమ్మల్ని తీసుకోవచ్చు కదా.. ముక్కు పచ్చలారని పిల్లలను చంపావ్ అని తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు అక్కడి వారిని కలచివేసింది. మాకు ఎందుకు ఇంత కడుపుకోత మిగిలిల్చావ్ అని కన్నీరుమున్నీరయ్యారు. మూడు ఇళ్లలో కొడుకులే మృతి ఆదివారం జరిగిన ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతిచెందిన వారు మూడు కుటుంబాల్లో ఒక్కో కుమారుడే కావడంతో తమ వారసుడిని కోల్పోయామని గుండెలవిసేలా రోదించారు. బజారి ఇంటిలో పెద్ద కుమారుడైన శివయ్య మృతి చెందగా వారికి కూతురు ఉంది. వెంకప్పకు ముగ్గురు అమ్మాయిల తర్వాత కుమారుడు సాయిచరణ్ జన్మించగా.. ఈ ఘటనలో ఆ బాబు మృత్యువాతపడ్డాడు. కుర్వ ఎల్లప్ప కుమారుడు యుగందర్ మృతి చెందగా.. కుమార్తె ఉంది. ఇలా మూడు కుటుంబాల్లో ముగ్గురు కుమారులే చనిపోయారు. సంఘటనా స్థలానికి శాంతినగర్ సర్కిల్ సీఐ గురునాయుడు, ఎస్ఐ మహేందర్ చేరుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
రాజధాని నిర్మాణ పనుల్లో అపశ్రుతి
-
ప్రాణాలు...నీటిపాలు..
-
ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారుల మృతి
ఆక్సిజన్ సరఫరాలో లోపమే కారణమంటున్న బంధువులు మరణాలకు ఇతర కారణాలు ఉన్నాయి: అధికారులు రాయ్‌పూర్: గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 60 మందికిపైగా చిన్నారులు మరణించిన సంఘటన మరువకముందే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ వైద్యశాలలోనూ ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందారు. డా.బీఆర్ అంబేడ్కర్ స్మారక వైద్యశాలలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ విచారణకు ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడమే పసికందుల మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం శిశువుల మృతికి ఇతర కారణాలు ఉన్నాయనీ, ఆక్సిజన్ సరఫరాలో ఏ లోపమూ లేదని వాదిస్తున్నారు.ఓ శిశువు తక్కువ బరువుతో పుట్టిందనీ, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండటంతో మధ్యాహ్నం 12.30 గంటలకు మరణించిందని వైద్యులు చెప్పారు. మరో ఇద్దరు శిశువుల మృతికి శ్వాసకోస సంబంధ సమస్యలే కారణమన్నారు. మరోవైపు మద్యం సేవించి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆక్సిజన్ సరఫరా విభాగంలోని రవిచంద్ర అనే ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. రిజర్వాయర్‌లో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటాన్ని సాయంత్రం ఐదు గంటలకు ఓ డాక్టర్ గమనించారనీ, వెంటనే రవిచంద్రను పిలవగా అతను మద్యం తాగి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆక్సిజన్ సరఫరాలో మాత్రం ఏ ఇబ్బందీ తలెత్తలేదనీ, రిజర్వాయర్‌లో కూడా ఆక్సిజన్ స్థాయి పడిపోవడాన్ని గుర్తించిన 15 నిమిషాల్లోనే సరిచేశారని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి చెప్పారు. కాగా, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చిన్నారులు మరణించారని బంధువులు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆరోపించారు. -
నీటి కుంటల్లో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి
పెనుమూరు/కలికిరి : జిల్లాలోని పెనుమూరు, కలికిరి మండలాల్లో శుక్రవారం నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు పెనుమూరు మండలం గుంటిపల్లె పంచాయతీ యానాది కాలకి చెందిన మీన, మంజుల, అమ్ములు బట్టలు ఉతికేందుకు చార్వాకానిపల్లె సమీపంలో ఉన్న దాసరకుంటకు శుక్రవారం మధ్యాహ్నం వెళ్లారు. బట్టలు ఉతికిన తర్వా త సరదాగా ముగ్గురూ కుంటలో ఈత కొట్టారు. ఈ క్రమంలో అమ్ములు(13) లోతైన ప్రాంతంలోకి వెళ్లి ఈతరాక మునిగిపోయింది. మిగిలిన ఇద్దరు చిన్నారులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులకు విషయం తెలపడంతో వారు వచ్చి వెతకగా అప్పటికే అమ్ములు మృతిచెందింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు శీను, శేషమ్మ బోరున విలపించారు. అదేవిధంగా కలికిరి మండలంలోని గుట్టపాళెం పంచాయతీ వాడవాండ్లపల్లి నల్లగుట్ట హరిజనవాడకు చెందిన వెండిగంగురాజు కుమారుడు యశ్వంత్(6), ఎస్.గంగురాజు కుమారుడు మునీంద్ర(7) కలికిరిలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో నర్సరీ చదువుతున్నారు. నవరాత్రి సెలవులు కావడంతో ఇళ్ల వద్దే ఉన్నారు. ఇద్దరి తల్లిదండ్రులూ కూలి పనులకు వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామం సమీపంలో ఉన్న నల్లప్పచెరువులో కొందరు యువకులు ఈతకొడుతుండగా చిన్నారులు చూసేందుకు వెళ్లారు. వారు వెళ్లిన అనంతరం చిన్నారులిద్దరూ బట్టలు తీసి గట్టుపై పెట్టి ఈత ఆడేందుకు నీటిలోకి దిగి ఈతరాక పోవడంతో మునిగిపోయారు. సాయంత్రానికి మృతదేహాలు నీటిలో తేలియాడుతుండడంతో గమనించిన గ్రామస్తులు వాటిని వెలికితీశారు. దీంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం అలుముకుంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంపీటీసీ ఆర్.వెంకటరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశాడు. -
బావిలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
సెలవుల్లో ఆటలాడుకుంటూ దాహం వేడడంతో నీళ్లు తాగేందుకు బావి వద్దకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు అందులోపడి మృతి చెందారు. ఈ సంఘటన బుధవారం వరంగల్ జిల్లా మహాబూబాబాద్ మండలం కేంద్రంలోని గుండ్లకుంట చెరువు వద్ద జరిగింది. గుండ్లకుంట కాలనీకి చెందిన రాగం సాయిలు కుమార్తె అనిత (13), రాగం మల్లయ్య కుమార్తె చందు (11), తొర్రూరుకు చెందిన 11 ఏళ్ల నడిగడ్డ చందు (సాయిలుమేనల్లుడు) మద్యాహ్నం సమయంలో ఆటాడుకుంటూ దాహం వేయడంతో గుండ్లకుంట చెరువు పక్కన ఉన్న బావిలో నీళ్లు తాగేందుకు వెళ్లారు. నీళ్లు తాగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి ముగ్గురూ బావిలో పడి మృతి చెందారు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలోనే బావి సమీపంలో ఉన్న చెప్పులను చూసి చిన్నారులు పడిన ట్లుగా గుర్తించారు. దీంతో బావిలోకి దిగి మృతదేహాలను వెలికితీశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు పిల్లలు చనిపోవడంతో గుండ్లకుంట కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. -
సందడి నుంచి శోక సంద్రంలోకి...
బల్లిపాడు (అత్తిలి) : సంక్రాంతి పండగకు అమ్మమ్మ ఇంటికి వచ్చి, సరదాగా గడిపిన ముగ్గురు చిన్నారులు చెరువులో పడి అనంతలోకాలకు వెళ్లిపోయారు. అప్పటి వరకు కుటుంబ సభ్యుల మధ్య ఆటపాటలతో గడిపిన వారు.. లేరన్న నిజం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ దుర్ఘటన అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బల్లిపాడు గ్రామానికి చెందిన మీసాల దానయ్య, లక్ష్మీకాంతం దంపతులకు నలుగురు కుమార్తెలు. ఈ నలుగురికి వివాహాలు అయ్యాయి. మూడవ కుమార్తె కృష్ణవేణికి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన వేల్పూరు రాంబాబుతో వివాహం అయింది. వీరికి ఇద్దరు మగపిల్లలు. నాల్గవ కుమార్తె భారతికి తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన కోటిచుక్కల నాగేంద్రకుమార్‌తో వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా కుమార్తెలను, మనమలను ఆహ్వానించడంతో మూడవ, నాల్గవ కుమార్తెలు, వారి పిల్లలు ఈనెల 16వ తేదీన అమ్మమ్మ గ్రామమైన బల్లిపాడుకు వచ్చారు. పండగ అనంతరం తిరిగి వారి స్వగ్రామాలకు సోమవారం వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. అయితే ఆదివారం సాయంత్రం రాంబాబు, కృష్ణవేణి దంపతుల చిన్న కుమారుడు మణికంఠ (7), నాగేంద్రకుమార్, భారతి దంపతుల కుమార్తెలు పావనిదుర్గ మహాలక్ష్మి (6), పల్లవి (4)లు ఆటలాడుకునే క్రమంలో కనిపించకుండా పోయారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో పిల్లలు కనిపించకపోవడంతో గ్రామంలోను, ఇతర గ్రామాలలోను వెదికారు. రాత్రి వరకు వెతికినా ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి అత్తిలి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఎసై్స వి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో గ్రామంలో ఉన్న పంచాయతీ మంచినీటి చెరువులోకి నీళ్ల కోసం వెళ్లిన గ్రామస్తులకు తొలుత బాలిక మృతదేహం కనిపించడంతో, ఈ విషయాన్ని తప్పిపోయిన వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వచ్చి చెరువులో వెతకగా మరో రెండు మృతదేహాలు లభించాయి. మృతిచెందింది తమ పిల్లలేనని గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి ఎసై్స సిబ్బందితో చేరుకుని వివరాలను స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి సేకరించారు. తణుకు సీఐ ఆర్.అంకబాబు సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేపలను చూసేందుకు వెళ్లి... స్థానిక శివాలయం ఎదురుగా ఉన్న మంచినీటి చెరువు రేవు వద్దకు ఎక్కువగా చేపలు వస్తుంటాయి. శివాలయం సెంటర్లో ఆడుకుంటూ రేవు వద్దకు చేరిన ముగ్గురు చిన్నారులు చేపలతో ఆడుకునేందుకు మెట్లపై నుంచి చెరువులోకి దిగే క్రమంలో జారిపడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. చిన్నారులు చెరువులోకి దిగడాన్ని ఎవరూ చూడకపోవడంతో నీటిలో మునిగిపోయారని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాయకులు చెరువులో పడి చిన్నారులు మృతిచెందారన్న వార్త తెలియడంతో పలువురు నాయకులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల పండుస్వామి, సొసైటీ అధ్యక్షుడు ప్రగడ కోటసత్యం, దేవస్థానం మాజీ చైర్మన్ గారపాటి నాగేశ్వరరావు, ఆకుల నాగేశ్వరరావు, టీడీపీ మండలాధ్యక్షుడు కందుల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ దిరిశాల భీమరాజు తదితరులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఈ విషయాన్ని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు సమాచారం అందించారు. దీంతో ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో మృతులు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఎంపీడీవో ఎస్.నిర్మలజ్యోతి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. గ్రామంలో విషాద ఛాయలు పండగ సందర్భంగా పుట్టింటికి వచ్చిన దానయ్య కుమార్తెలకు శోకం కలగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం స్వగ్రామాలకు వెళ్లడానికి సిద్ధం చేసుకున్న తరుణంలో ఈ దారుణం జరగడంతో తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యలు గుండెలవిసేలా విలపించారు. ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తల్లిదండ్రులు, తమ పిల్లలు లేరన్న వార్తను తట్టుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. -
పెనువిషాదం
గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ :గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో శనివారం పెనువిషాదం చోటుచేసుకుంది. గ్రామంలో పాడుపడిన క్వారీ గుంత వద్ద దుస్తులు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడి మృతిచెందారు. తొలుత ముగ్గురు అక్కాచెల్లెళ్లలో అందరికన్నా చిన్నమ్మాయి నీటిలో పడగా, ఆమెను కాపాడడానికి ప్రయత్నించి ఇద్దరు అక్కలూ కూడా ఒకరి తర్వాత ఒకరు నీటిలో పడిపోయారు. కాపాడండంటూ ఆ చిన్నారులు పెడుతున్న ఆర్తనాదాలు విని పరిసరాల్లో ఉన్న వారు అక్కడకు వచ్చి వారిని వెలికితీసేటప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ప్రాంతానికి చెందిన చల్లా శ్రీనివాసరావు, చల్లా జ్యోతి దంపతులు పొట్టకూటి కోసం పదేళ్ల కిందట గుంటూరు శివారు ప్రాంతంలోని తురకపాలెంకు వలస వచ్చారు. వీరికి శిరీష(11), నీలిమ(8), మల్లీశ్వరి(5) కుమార్తెలున్నారు. శ్రీనివాసరావు చినపలకలూరు క్వారీలోను, తల్లి జ్యోతి రాఘవరావు క్వారీలోనూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే భార్యాభర్తలిద్దరూ ఉదయం పనులకు వెళ్లారు. పిల్లలు ముగ్గురూ తమ దుస్తులు ఉతుక్కుని స్నానం చేసేందుకు పాడుపడిన క్వారీ గుంట వద్దకు వెళ్లారు. దుస్తులు ఉతికి నీటిలో దిగుదామనుకునే లోపే మల్లీశ్వరి(5) కాలు జారి గుంతలో పడింది. చెల్లిని కాపాడుకునేందుకు ఆమె చెయ్యి పట్టుకునే ప్రయత్నంలో రెండో అమ్మాయి నీలిమ(8) కూడా నీళ్లలో పడిపోయింది. కళ్లముందు నీటిలో పడిపోయిన ఇద్దరు చెల్లెళ్లను ఎలాగైనా కాపాడుకోవాలని పెద్దక్క శిరీష(11) కూడా నీటిలో దిగింది. ఎవరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతూ కాపాడండని ఆర్తనాదాలు చేశారు. వారి కేకలు విని అక్కడే దుస్తులు ఉతుకుతున్న బత్తుల దుర్గాభవాని చూసి పక్క క్వారీలో పనిచేస్తున్న కార్మికులను పిలుచుకువచ్చింది. వారు వచ్చి గుంతలో నుంచి చిన్నారులను బయటకు తీశారు. అప్పటికే శిరీష, నీలిమ చనిపోయారు. చిన్నమ్మాయి మల్లీశ్వరి కొన ఊపిరితో ఉండడంతో ఆస్పత్రికి తరలించటానికి రోడ్డుపైకి తీసుకువెళ్లేటప్పటికి ఆ చిన్నారి ప్రాణాలు కూడా ఆవిరైపోయాయి.ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు ఉరుకులు పరుగులపై ఘటనాస్థలానికి చేరుకున్నారు. రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు, తహసిల్దార్ కె.చెన్నయ్య సిబ్బందితో అక్కడకు చేరుకుని క్వారీ గుంటను పరిశీలించారు. ఈ క్వారీ నాలుగేళ్లుగా వినియోగంలో లేదని స్థానికులు చెప్పారు. గతంలో ఈ క్వారీ పసుపులేటి సంజీవరావు ఆధ్వర్యంలో ఉండేదని వారు తెలిపారు. క్వారీ గుంట నిండా వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాటు, ఈ గుంటలో నీటి ఊట కూడా వస్తుందని, చాలా లోతుగా ఉంటుందని వివరించారు. పోలీసులు క్వారీ యజమానిపై కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. ఎమ్మెల్యే రావెల పరామర్శ ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. శ్రీనివాసరావు, జ్యోతి దంపతులను ఓదార్చారు. క్వారీలో పాడుపడిన నీటి గుంట ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తప్పకుండా చర్యలు తీసుకునేలా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళతానన్నారు. చిన్నారుల అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబానికి రూ.20 వేలు అందజేశారు. దేవుడు అన్యాయం చేశాడయ్యా... అల్లారు ముద్దుగా పెంచుకునే తమ ముగ్గురు మహలక్ష్ముల్లాంటి చిన్నారులను ఒక్కసారిగా తమకు లేకుండా చేసి దేవుడు అన్యాయం చేశాడంటూ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక మేమెవరి కోసం బతకాలంటూ రోదించారు. -
పెను విషాదం...
గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ :గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో శనివారం పెనువిషాదం చోటుచేసుకుంది. గ్రామంలో పాడుపడిన క్వారీ గుంత వద్ద దుస్తులు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడి మృతిచెందారు. తొలుత ముగ్గురు అక్కచెల్లెళ్లలో అందరికన్నా చిన్నమ్మాయి నీటిలో పడగా, ఆమెను కాపాడడానికి ప్రయత్నించి ఇద్దరు అక్కలూ కూడా ఒకరి తర్వాత ఒకరు నీటిలో పడిపోయారు. తమను కాపాడండంటూ ఆ చిన్నారులు పెడుతున్న ఆర్తనాదాలు విని పరిసరాల్లో ఉన్న వారు అక్కడకు వచ్చి వారిని వెలికితీసేటప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాలిలా ఉన్నాయి. రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు తెలిపిన మేరకు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ప్రాంతానికి చెందిన చల్లా శ్రీనివాసరావు, చల్లా జ్యోతి దంపతులు పొట్టకూటి కోసం పదేళ్ల కిందట గుంటూరు శివారు ప్రాంతంలోని తురకపాలెంకు వలస వచ్చారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు శిరీష(11) నీలిమ(8)మల్లేశ్వరి(5) ఉన్నారు. తండ్రి శ్రీనివాసరావు చినపలకలూరు క్వారీలోను, తల్లి జ్యోతి రాఘవరావు క్వారీలోనూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే భార్యాభర్తలిద్దరూ ఉదయం పనులకు వెళ్లారు. పిల్లలు ముగ్గురూ తమ దుస్తులు ఉతుక్కుని స్నానం చేసివచ్చేందుకు పాడుపడిన క్వారీ గుంట వద్దకు వెళ్లారు. దుస్తులు ఉతికి నీటిలో దిగుదామనుకునే లోపే వారిలో చిన్నమ్మాయి అయిన మల్లేశ్వరి(5) కాలు జారి గుంతలో పడింది. చెల్లిని కాపాడుకునేందుకు మల్లేశ్వరి చెయ్యి పట్టుకునే ప్రయత్నంలో రెండో అమ్మాయి నీలిమ(8) కూడా కాలు జారి నీళ్లలో పడిపోయింది. కళ్లముందు నీటిలో పడిపోయిన ఇద్దరు చెల్లెళ్లను ఎలాగైనా కాపాడుకోవాలని పెద్దక్క శిరీష(11) కూడా నీటిలో దిగింది. అయితే ముగ్గురూ చిన్నపిల్లలే కావడం, వారికి ఎవరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతూ కాపాడండని ఆర్తనాదాలు చేశారు. వారి కేకలు విని అక్కడే దుస్తులు ఉతుకుతున్న ముక్కంటి ఈశ్వర్ కుమార్తె బత్తుల దుర్గా భవాని చూసి పక్క క్వారీలో పనిచేస్తున్న కార్మికులను పిలుచుకువచ్చింది. వారు వచ్చి గుంతలో నుంచి చిన్నారులను బయటకు తీశారు. అయితే అప్పటికే శిరీష, నీలిమ చనిపోయారు. చిన్నమ్మాయి మల్లేశ్వరి కొన ఊపిరితో ఉండడంతో ఆస్పత్రికి తరలించడానికి రోడ్డుపైకి తీసుకువెళ్లేటప్పటికి ఆ చిన్నారి ప్రాణాలు కూడా ఆవిరైపోయాయి.ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు ఉరుకులు పరుగులపై ఘటనాస్థలానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు, తహశీల్దార్ కె.చెన్నయ్య సిబ్బందితో అక్కడకు చేరుకుని ఘటన జరిగిన క్వారీ గుంటను పరిశీలించారు. ఈ క్వారీ గత నాలుగేళ్లుగా వినియోగంలో లేదని స్థానికులు చెప్పారు. గతంలో ఈ క్వారీ పసుపులేటి సంజీవరావు ఆధ్వర్యంలో ఉండేదని వారు తెలిపారు. క్వారీ గుంట నిండా వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాటు, ఈ గుంటలో నీటి ఊట కూడా వస్తుందని, చాలా లోతుగా ఉంటుందని చెప్పారు. ఎక్కువగా ట్రాక్టర్ డ్రైవర్లు ఈ క్వారీలో తమ ట్రాక్టర్లు శుభ్ర పరుచుకునేందుకు వినియోగిస్తుంటారన్నారు. పోలీసులు క్వారీ యజమానిపై కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. దేవుడు అన్యాయం చేశాడయ్యా... అల్లారు ముద్దుగా పెంచుకునే తమ ముగ్గురు మహలక్ష్ముల్లాంటి చిన్నారులను ఒక్కసారిగా తమకు లేకుండా చేసి దేవుడు అన్యాయం చేశాడంటూ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక మేమెవరి కోసం బతకాలంటూ పెద్దపెట్టున రోదించారు. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు, చుట్టుపక్కల వారు సైతం కంటతడిపెట్టుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు... క్వారీలు నడుపుతూ పాడుపడిపోయిన నీటి గుంట వద్ద ఎలాంటి హెచ్చరికలు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్వారీ యజమానిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వై.శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. క్వారీల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై కూడా ఉన్నతాధికారులకు నివేదిక సిద్ధం చేసి చట్టపర మైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుల కుటుంబానికి ఎమ్మెల్యే రావెల పరామర్శ ముగ్గురు చిన్నారులు మృతిచెందిన విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీటిపర్యంతం అవుతున్న చిన్నారుల తల్లి, దండ్రులను ఓదార్చారు. క్వారీలో పాడుపడిన నీటి గుంట ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తప్పకుండా చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళతానన్నారు. ప్రభుత్వం నుంచి మృతిచెందిన చిన్నారుల కుటుంబానికి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చిన్నారుల అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబానికి 20 వేల రూపాయలను అందజేశారు. -
పత్తి బస్తాల కింద నలిగి.. ముగ్గురు చిన్నారులు మృతి
-
పత్తి బస్తాల కింద నలిగి.. ముగ్గురు చిన్నారులు మృతి
కేసముద్రం, న్యూస్‌లైన్: గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో ఇంట్లో దాచుకున్న పత్తి ఆ ఇంటి దీపాలను ఆర్పేసింది. ముగ్గురు చిన్నారుల మృతికి కారణమైంది. వివరాలు.. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన బేతు వెంకటయ్య, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు వీరన్న, శ్రీను, కుమార్తె సుజాత ఉన్నారు. వీరన్నకు కుమారుడు విక్కి(3)తో పాటు పది రోజుల క్రితం మరో కుమారుడు జన్మించాడు. కుమార్తె సుజాతకు.. కుమారుడు వేణు(12), కుమార్తె భద్రకాళి(6) ఉన్నారు. కాగా, సుజాత తన పిల్లలతో ఆదివారం తల్లిగారింటికి వచ్చింది. సోమవారం యూదమ్మ, సుజాత, వీరన్న కలిసి మహబూబాబాద్ వెళ్లారు. వెంకటయ్య గ్రామంలోకి వెళ్లాడు. సుజాత, వీరన్న పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. తాము ఇంట్లో టీవీ చూసి పడుకుంటామని సుజాత కుమారుడు వేణు తలుపుపెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వెంకటయ్య తిరిగి ఇంటికి వచ్చి తలుపులు కొట్టగా లోపలి నుంచి సమాధానం రాలేదు. దీంతో తలుపులను పగులగొట్టి లోపలికి వెళ్లి పత్తిని తొలగించి చూడగా ముగ్గురు పిల్లలు శవాలై కనిపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.