భార్య, కొడుకును చంపి.. వ్యాపారి ఆత్మహత్య
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఘోరం జరిగింది. నగడా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యాపారి ఒకరు తన భార్యను, కొడుకును చంపేసి, తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇరుగుపొరుగు వాళ్లకు ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా మొత్తం ముగ్గురి మృతదేహాలు కనిపించాయి.
సతీష్ సైని మృతదేహం ఉరికి వేలాడుతుండగా, ఆయన భార్య, కొడుకుల మృతదేహాలు నేల మీద పడి ఉన్నాయి. సైనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారని పోలీసులు తెలిపారు. ఆయన భార్య, కొడుకు మృతదేహాలు నీలం రంగులోకి మారడంతో, వాళ్లకు విషం ఇచ్చి ఉంటారని భావిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.